Movie Reviews

సమీక్ష – సైంధవ్

సీనియర్ స్టార్ హీరోలలో వెంకటేష్ ల్యాండ్ మార్క్ 75వ సినిమాగా సైంధవ్ మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టేసుకున్నారు. నారప్ప మినహాయించి ఎక్కువగా ఎంటర్ టైనర్లు, థ్రిల్లర్లకు ప్రాధాన్యం ఇస్తున్న వెంకీకి ఫుల్ యాక్షన్ రోల్ లో చూడాలని కోరుకున్నారు. దానికి తగ్గట్టే దర్శకుడు శైలేష్ కొలను సైంధవ్ ని తీర్చిదిద్దుతున్నట్టు ప్రమోషన్లు, పోస్టర్లలో అర్థమైపోవడంతో క్రమంగా హైప్ పెరిగింది. సంక్రాంతి పోటీ తీవ్రంగా ఉన్నా సరే సలార్ వల్ల డిసెంబర్ నుంచి జనవరికి షిఫ్ట్ అయిన ఈ మూవీ రేసులో గెలిచేలా ఉందా

కథ

దక్షిణ భారతదేశం చంద్రప్రస్థ సముద్ర తీరంలో క్రేన్ ఆపరేటర్ గా పని చేస్తుంటాడు సైంధవ్( వెంకటేష్). కూతురు గాయత్రి (బేబీ సారా) అంటే ప్రాణం. పక్కింటిలో ఉన్న టాక్సి ఆపరేటర్ మనోగ్య(శ్రద్ధ శ్రీనాథ్)తో స్నేహం చేస్తుంటారు. పిల్లలకు తుపాకులు ఇచ్చి తీవ్రవాదులుగా మార్చే ముఠా నాయకుడు మిత్ర(ముఖేష్ ఋషి), వికాస్(నవాజుద్దీన్ సిద్ధిక్)తో సైంధవ్ కు పాత శత్రుత్వం ఉంటుంది. స్కూల్లో ఓసారి పాప కళ్ళు తిరిగి పడిపోతే తనకున్న నరాల జబ్బుకు 17 కోట్ల ఇంజెక్షన్ వేయాలని డాక్టర్లు చెబుతారు. దీంతో ఇష్టం లేకపోయినా సైంధవ్ తిరిగి నేర ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. చివరికి ఎలా సాధించాడనేది తెరమీద చూడాలి.

విశ్లేషణ

హిట్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు శైలేష్ కొలనులోని టెక్నికల్ పనితనం అతని రెండు సినిమాల్లోనూ స్పష్టంగా కనిపించింది. క్లైమాక్స్ హ్యాండిల్ చేయడంలో తడబాటు గురించి కొన్ని కామెంట్స్ వచ్చినా కేసు విచారణను, సస్పెన్స్ ని మెయింటైన్ చేసిన విధానం ఆడియన్స్ కి నచ్చింది. పెద్ద ఇమేజ్ లేని హీరోలు దొరికారు కాబట్టి తగినంత స్వేచ్ఛతో తాను కోరుకున్నట్టుగా వాటిని తీసి విజయం అందుకున్నాడు. కానీ సైంధవ్ వెంకటేష్ లాంటి సీనియర్ హీరో తన కెరీర్లో చేస్తున్న డెబ్భై అయిదవ సినిమా. సో ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకోవాలి.

కోట్ల రూపాయల ఖరీదైన ఇంజెక్షన్ వేస్తేనే ప్రాణాలు నిలిచే అరుదైన వ్యాధి ఉన్న చిన్నారులు నిజంగానే ఉన్నారు. వాటి కోసం పని చేస్తున్న ఎన్జిఓలు సోషల్ మీడియా వేదికగా విరాళాలు అడగటం చూస్తుంటాం. స్వతహాగా డాక్టర్ అయిన శైలేష్ ఈ పాయింట్ మీద మంచి యాక్షన్ కం ఎమోషనల్ డ్రామాని బిల్డ్ చేయొచ్చనే నమ్మకంతో సైంధవ్ రాసుకున్నాడు. ఆలోచన వరకు బాగానే ఉంది కానీ తీరా అది పేపర్ పైకి వచ్చి, స్క్రీన్ మీద కన్వర్ట్ అయ్యే క్రమంలో తడబాటుకి గురి కావడంతో కోరుకున్న హై దక్కే అవకాశం ఇవ్వలేదు. హీరోయిజంని ఎలివేట్ చేసే క్రమంలో కథనం వేగంగా ఉందో చెక్ చేసుకోని శైలేష్ దాని వల్ల సాగతీతకు చోటిచ్చాడు.

సైంధవ్ అలియాస్ సైకోకి ప్రారంభంలో అంత బిల్డప్ ఇచ్చినప్పుడు అతను చేసే పనులు ఎక్స్ ట్రాడినరిగా ఉండాలి. పోర్టులో చిన్న జాబ్ చేసే వ్యక్తిక్లి వేలకోట్ల దందా చేసే మాఫియా మొత్తం వణికిపోతుందంటే దానికి తగిన జస్టిఫికేషన్ ఎక్కడో ఫ్లాష్ బ్యాక్ రూపంలో ఇవ్వాలి. దాన్ని దాచిపెట్టి రెండో భాగంలో చెప్తామని ఊరించడం వల్ల లాభం లేదు. పదే పదే గన్నులు తీసుకుని కావాల్సిన చోటికల్లా వెళ్లి గ్యాంగ్ స్టర్స్ ని పిట్టల్లా కాల్చుకుంటూ పోవడం వల్ల గూస్ బంప్స్ రావు. వాటికి న్యాయం చేకూర్చే సరైన నేపధ్యాన్ని ముందు ఎస్టాబ్లిష్ చేసి ఆపై అరాచకం మొదలుపెడితే ఆడియన్స్ నమ్ముతారు. అంతే తప్ప ఊరికే విలన్ ఇంటి మీద దండయాత్ర చేయించడం వల్ల లాభం లేదు.

పాప జబ్బు దాని పరిష్కారానికి అవసరమైన మందుని రివీల్ చేశాక డ్రామాలు, మలుపులు తగినంత మోతాదులో ఉండాలి. ఉదాహరణకు గోపీచంద్ ఒక్కడున్నాడులోని ఫస్ట్ హాఫ్ ట్విస్టులను చూడొచ్చు. ఆ తరహా ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే సైంధవ్ కు చాలా అవసరం. కానీ తీవ్ర రౌద్ర స్వరంతో విలన్లకు వార్నింగులు ఇవ్వడం తప్ప భలే సాధించాడురా అనిపించే ఛాన్స్ శైలేష్ ఎక్కడా ఇవ్వలేదు. దీంతో నెరేషన్ ఫ్లాట్ గా మారిపోయి ఒకదశ దాటాక బోర్ కొట్టడం మొదలవుతుంది. కథ ఎటూ కదలక పోర్టుకి ఇంటికి మధ్య నలిగిపోవడం మొదలవుతుంది. నవాజుద్దీన్ విలనిజం కొంచెం ఓవరనిపించినా అది కాపాడ్డం వల్లే లూస్ థ్రెడ్స్ కొన్ని నిలబడ్డాయి.

ఇందులో వెంకటేష్ చెప్పే మాస్ డైలాగు ఒకటుంది. లెక్క మారిపోద్ది నా కొడకా అని. నిజానికి సైంధవ్ కు కమర్షియల్ లెక్కలు వేసుకోవడంలో శైలేష్ చేసిన పొరపాట్లు ఇంపాక్ట్ ని తగ్గించేశాయి. దాని వల్ల బేబీ సారా మీద సింపతీ సరిగా కనెక్ట్ అవ్వక ఇంజెక్షన్ లో జరిగే ఆలస్యం మనతో అయ్యో అనిపించదు. ఒకవేళ వెంకీకి బిల్డప్ స్థాయి తగ్గించి ఒక మెడికల్ థ్రిల్లర్ గా మార్చేసి ఇంజెక్షన్ చుట్టూ థ్రిల్లర్ తరహా మోడల్ ని ఎంచుకుని ఉంటే బెటర్ గా ఉండేదేమో. వెంకటేష్, నవాజుద్దీన్ ల మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ స్పీడ్ ని పెంచేసేదేమో. చివరి ఇరవై నిముషాలు గురించి గొప్పగా చెప్పుకున్న శైలేష్ దాన్ని బాగానే హ్యాండిల్ చేశాడు మరీ గొప్పగా కాదు.

నిస్సందేహంగా సైంధవ్ బ్యాడ్ మూవీ కాదు. కానీ బెస్ట్ అనిపించుకునేందుకూ స్కోప్ ఇవ్వలేదు. క్లాస్ ని మెప్పించాలనే తాపత్రయంతో స్టోరీ, మాస్ తో విజిల్స్ కొట్టించాలనే లక్ష్యంతో ఎలివేషన్లు రాసుకుని అసలైన పాయింట్ ని మధ్యలో నలిపేయడం వల్ల ఇదో సగటు చిత్రంగా మారిపోయే ప్రమాదం వచ్చింది. సంక్రాంతి బరిలో మంచి కిక్కిచ్చే మసాలా సినిమాలు కోరుకునే తెలుగు ప్రేక్షకులను ఓపిక డిమాండ్ చేసే ఇలాంటి సీరియస్ డ్రామాలు ఏ మేరకు మెప్పిస్తాయనే దాన్ని బట్టే బాక్సాఫీస్ ఫలితం ఆధారపడి ఉంటుంది. నటన పరంగా వెంకటేష్ టాప్ టెన్ లో ఒకటిగా ఫ్యాన్స్ దీన్ని చెప్పుకుంటారేమో కానీ వాస్తవానికి అంత అర్హత దక్కతుందా అంటే అనుమానమే

నటీనటులు

మంచితనం క్రోధం కలగలసిన సీరియస్ పాత్రలో వెంకటేష్ అలవోకగా చేశారు. తన అనుభవాన్ని రంగరించి సైకోగా తననుంచి కోరుకున్నది సంపూర్ణంగా నెరవేర్చారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎక్కువ స్కోప్ దొరికింది. నవాజుద్దీన్ సిద్ధిక్ ఎందుకు విలక్షణ నటుడో ఇంకోసారి అర్థమవుతుంది. బెన్ స్టోక్స్ ఊతపదాన్ని ఉచ్చరిస్తూ తనకు మాత్రమే సాధ్యమైన పెర్ఫార్మన్స్ తో మెప్పిస్తాడు. శ్రద్ధ శ్రీనాథ్ చక్కగా ఉంది. స్టయిలిష్ అవుట్ ఫిట్లతో బబుల్ గమ్ నములుతూ ఆండ్రియా పెద్దగా చేసిందేమి లేదు. ముఖేష్ ఋషి, జయ ప్రకాష్, జిస్సు సేన్ గుప్తా రొటీనే. ఆర్య, రుహాని శర్మలకు కాస్త స్కోప్ దొరికింది. గెటప్ శీనుని పెట్టినా పెద్దగా కామెడీ చేయించలేదు.

సాంకేతిక వర్గం

సంతోష్ నారాయణన్ నేపధ్య సంగీత నిరాశపరుస్తుంది. కొన్ని మంచి సీన్లు బీజీఎమ్ బలహీనంగా ఉండటం వల్ల తేలిపోయాయి. ఒక దశ దాటాక అసలేం కొట్టారో అర్థం కానంత చప్పగా సౌండ్ మారిపోయింది. తక్కువ పాటలే ఉన్నా చిన్నారి తల్లి తప్ప మిగిలినవి అనవసరమే. మణికందన్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ని బాగా చూపించారు. గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ షార్ప్ గానే ఉన్నా టేకింగ్ లో ఉన్న ల్యాగ్ వల్ల నిడివికి అతన్నే నిందించలేం. సంభాషణలు మాములుగా ఉన్నాయి. అక్కడక్కడా తప్ప మెరుపులేం లేవు. పోరాటలు డిఫరెంట్ గా ట్రై చేశారు. కొంత వరకు ఓకే. ప్రొడక్షన్ వేల్యూస్ నీట్ గా ఉన్నాయి. అవసరానికి తగ్గట్టు ఖర్చు పెట్టారు.

ప్లస్ పాయింట్స్

వెంకటేష్ నటన
మెయిన్ పాయింట్
కొన్ని యాక్షన్ బ్లాక్స్

మైనస్ పాయింట్స్

సంగీతం
నెమ్మదిగా సాగే కథనం
కిక్ లేని వయొలెన్స్
కుదరని ఎలివేషన్లు

ఫినిషింగ్ టచ్ : లెక్క సరిపోలేదు

రేటింగ్ : 2.5 / 5

This post was last modified on January 13, 2024 1:12 pm

Share
Show comments
Published by
suman
Tags: Feature

Recent Posts

వైసీపీకి ఛాన్స్ ఇవ్వ‌డం లేదుగా !

ఏపీ విప‌క్ష పార్టీగా ఉన్న వైసీపీలో జోష్ క‌నిపించ‌డం లేదు. జ‌గ‌న్ రావాలి.. త‌మ పార్టీ ముందుకు సాగాలి అన్న‌ట్టుగా…

2 hours ago

ఇదో కొత్త రకం దోపిడీ!… ఒలా, ఉబెర్ లకు కేంద్రం నోటీసులు!

ప్యాపారుల మంత్రం ధనార్జనే. అందులో తప్పేమీ లేదు. అయితే జనం లైఫ్ స్టైల్ ఆధారంగా ఇష్జారాజ్యంగా ఆర్జించడమే దోపిడీ. మొన్నటిదాకా…

4 hours ago

16 ఒప్పందాలు.. 50 వేల ఉద్యోగాలు..రూ.1.78 లక్షల కోట్లు

స్విట్జర్లాండ్ నగరం దావోస్ వేదికగా గడచిన 4 రోజులుగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులు గురువారంతో ముగిశాయి. పెట్టుబడులు…

5 hours ago

జగన్ ఇంటి ఎదుట లోకేశ్ బర్త్ డే సెలబ్రేషన్స్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా గురువారం చాలా ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు…

6 hours ago

సంతృప్తి గ్రాఫ్‌లో ఈ మంత్రుల‌దే పైచేయ‌ట‌..!

రాష్ట్రంలో ప్ర‌భుత్వాలు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ప‌నిచేసుకుని పోవ‌డం తెలిసిందే. అయితే.. చంద్ర‌బాబు హ‌యాంలో మాత్రం ఏదో గుడ్డిగా ప‌నిచేసుకుని పోతున్నామంటే…

8 hours ago

‘రేపటి తీర్పు’గా మారనున్న ‘భగవంత్ కేసరి’?

నందమూరి బాలకృష్ణ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ని తమిళ టాప్ స్టార్ విజయ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్…

10 hours ago