Movie Reviews

సమీక్ష – ఉస్తాద్

చిరంజీవి రజనీకాంత్ లాంటి పెద్ద హీరోల సినిమాల తాకిడి ఉన్నప్పటికీ ఉస్తాద్ బరిలో దిగడం ఆశ్చర్యం కలిగించినా నిర్మాతలు మాత్రం కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో రిలీజ్ కు సిద్ధపడ్డారు. న్యాచురల్ స్టార్ నానితో పాటు రాజమౌళి ఆధ్వర్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల దీని మీద ప్రేక్షకుల దృష్టి మళ్లింది. కీరవాణి కొడుకే అయినా సంగీతం బదులు నటన ఎంచుకున్న శ్రీసింహా కోడూరి నాలుగో ప్రయత్నమిది. మత్తు వదలరాతో మొదటి విజయాన్ని అందుకున్న కుర్ర హీరోకి మరో హిట్ ఇచ్చేలా ఉస్తాద్ ఉన్నాడా

కథ

సూర్య(శ్రీసింహా) డిగ్రీ చదువుకునే రోజుల్లో ఒక పాత బైకు ఇష్టపడి కొనుక్కుని నేర్చుకుని దాన్ని ప్రాణంలా చూసుకుంటూ ఉంటాడు. ఎత్తుకెళ్ళి చూడమంటే భయపడే ఇతనికి తల్లే(అను మీనన్)లోకం. మేఘన(కావ్య కళ్యాణ్ రామ్)ని చూసి తొలిచూపులోనే ఇష్టపడి ప్రేమించడం మొదలుపెడతాడు. ఆమె కోసం ఎంత రిస్క్ చేసేందుకైనా వెనుకాడడు. జీవితంలో పెద్దగా లక్ష్యం లేకుండా తిరుగుతున్న సూర్య తనలో భయాలన్నీ పోగొట్టుకుని ఎలా పైలట్ స్థాయికి ఎదిగాడు, అతను ఎదురుకున్న పరిణామాలు వగైరాలు తెరమీద చూడాలి

విశ్లేషణ

ఒక గోల్ కోసం యువకులు కష్టపడితే లైఫ్ లో ఎంత పెద్ద స్థాయికి చేరుకోవచ్చో చెప్పాలనుకునే ప్రయత్నం మంచిదే. దర్శకుడు ఫణిదీప్ ఆలోచన ఇదే. చిన్న బిల్డింగులు ఎక్కడానికే ఫోబియాతో వణికే సూర్య ఏకంగా విమానం నడిపే దాకా వచ్చాడనే పాయింట్ ని లవ్ స్టోరీకి ముడిపెట్టి చెప్పాలనుకున్నాడు. దాని కోసం ఫ్లాష్ బ్యాక్ మోడల్ ని ఎంచుకుని ఇది వినడానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ ని హెడ్ పైలట్ పాత్రలో ప్రవేశపెట్టాడు. కొన్ని నిమిషాల పాటు సాగే చైల్డ్ హుడ్ ఎపిసోడ్ కాగానే డైరెక్ట్ గా ఎయిర్ పోర్ట్ నుంచే స్టోరీ మొదలవుతుంది. కేవలం పాత్రల పరిచయం తప్ప వాటిని బలంగా రిజిస్టర్ చేసే క్రమంలో ఫణిదీప్ సక్సెస్ కాలేదు.

కాసేపయ్యాక సూర్య కొన్న బైకు చుట్టే అన్ని ఎమోషన్స్ ని పలకించాలని చూడటం దెబ్బ కొట్టింది. నిజానికి ఆ బండినే ఎందుకు అంత మోజుపడి కొన్నాడన్న జస్టిఫికేషన్ సరిగా జరగలేదు. పైగా ర్యాగింగ్ ఊసులు ఉండని డిగ్రీ కాలేజీలో సీనియర్ జూనియర్ మధ్య గొడవలు ఉంటాయని చూపించడం అంతగా సింక్ అవ్వలేదు. అక్కడి నుంచి బైక్ తో సూర్య చేసే ప్రయాణం చాలా బోరింగ్ గా సాగుతుంది. పోనీ అది ఇతని జీవితంలో రావడం వల్ల ఏమైనా అనూహ్య సంఘటనలు కానీ ఫ్యామిలీలో ఊహించని పరిణామాలు జరిగినట్టు చూపించినా దానికో అర్థం ఉండేది. కానీ ఫ్లాట్ గా ఇంకా చెప్పాలంటే చిన్న పాయింట్ తో సాగదీసిన షార్ట్ ఫిలిం టైపులో విపరీతంగా సాగదీశారు.

ప్రేక్షకుల్లో భావోద్వేగాలు కలగాలంటే దానికి సరిపడా ఆసక్తికరమైన కథనం ఉండాలి. సూర్య పైలట్ ఎలా అవుతాడన్న సస్పెన్స్ చూసేవాళ్లలో కలగాలి. దానికి బదులుగా పదే పదే బైకు మీద తిరగడం, దానికి రిపేర్లు చేయించడం, అమ్మ డబ్బులు కట్టడం ఇవన్నీ సహజత్వానికి దూరంగా ఉండటం అటుంచి కనీసం టైం పాస్ కూడా చేయించలేకపోయాయి. పోనీ మధ్యలో వచ్చే పాటలు వినసొంపుగా క్యాచీగా ఉంటే ఏదో అనుకోవచ్చు. ఆ ఛాన్స్ లేకపోయింది. ఇంటర్వెల్ దాకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే తరహాలో ఎక్కడ మొదలైందో స్క్రీన్ ప్లే తిరిగి అక్కడికే వచ్చి ఆగి దర్శకుడిగా ఫణిదీప్ ఏం చెప్పాలనుకున్నాడో ఎంత బుర్ర చించుకున్నా అర్థం కాదు

సెకండ్ హాఫ్ వచ్చాకైనా హై మూమెంట్స్ ఆశిస్తాం. కానీ నో ఛాన్స్. నిజానికి లైన్ పరంగా బోలెడు స్కోప్ ఉన్న ఉస్తాద్ లో ప్రేమకథతో పాటు మదర్ సెంటిమెంట్ ని సరిగ్గా వాడుకుని ఉంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేది. కానీ లవ్ అండ్ గోల్ మధ్య దేన్నీ బ్యాలన్స్ చేయాలో అర్థం కాని అయోమయంలో హీరో సూర్యలాగే ఫణిదీప్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి అవసరం లేని సీన్లు, మరీ మాములుగా అనిపించే కామెడీతో ఏదేదో చేసేశాడు. బైక్ తో సూర్య మాట్లాడ్డం, దాన్ని మేఘనని కలిసేందుకు ముడి పెట్టుకోవడం కొంత వరకు బాగానే వచ్చినా ముప్పాతిక సినిమా తెచ్చిన నీరసం వీటి మీద ఆసక్తిని కలిగించలేకపోయింది. ఈ జాగ్రత్త ముందే పడాల్సింది.

ఇమేజ్ లేని హీరోలతో సందేశం పేరుతో ఇలాంటి ల్యాగ్ ప్రయత్నాలు చేస్తే జనం బోర్ కొట్టేసి పూర్తి కాకుండానే వెళ్ళిపోతారు. పెద్దగా ముక్కు మొహం తెలియని ఆర్టిస్టులు స్క్రీన్ మీద ఉన్నప్పుడు కంటెంట్ ఎంగేజ్ అయ్యేలా కామెడీ లేదా ఎమోషన్ ఏదో ఒకటి రన్ అవుతూ ఉండాలి బలగంలాగా. అదేమీ లేకుండా కేవలం శ్రీసింహా యాక్టింగ్ టాలెంట్ ని చూపించడానికి చేసిన షో రీల్ గా చేస్తే అది కుటుంబ సభ్యులకు నచ్చుతుంది కానీ సాధారణ పబ్లిక్ కి కాదు. ఫణిదీప్ లో ఉన్న దర్శకుడిని అతి సున్నితమైన రచయిత డామినేట్ చేశాడు. దీంతో తాను పర్సనల్ గా ఫీలయ్యింది అందరికీ నచ్చేలా ఉందో లేదో చెక్ చేసుకోకుండా తీయడంతో ఉస్తాద్ భారంగా మారాడు

నటీనటులు

శ్రీసింహా ఇంకా చాలా జర్నీ చేయాల్సి ఉంది. హెవీ సబ్జెక్టులు అతనికి నప్పవు. భాగ్ సాలేలో కామెడీ కూడా సరిగా పండలేదు. అయితే క్రమంగా మెరుగు పడే ఛాన్స్ ఉంది కానీ ఇంకా లేతదనం పోవాలి. కొన్నిసార్లు ఎక్స్ ప్రెషన్లు ఓవర్ ది బోర్డ్ వెళ్లాయి. కావ్య కళ్యాణ్ రామ్ నీట్ గా చేసింది. అలవాటైన పాత్రే. అను హాసన్ తల్లిగా మంచి ఛాయస్. గౌతమ్ మీనన్ కేవలం సంభాషణలకు పరిమితం కావడంతో నటన పరంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు కానీ దానికి సూటయ్యారు. రవీంద్ర విజయ్, కమెడియన్ రవిశివ తేజ, సాయికిరణ్ తదితరులు తక్కువ నిడివికి పరిమితమయ్యారు. క్యాస్టింగ్ చాలా చిన్నది. స్క్రీన్ స్పేస్ ఎక్కువ శ్రీసింహా మీద రాసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బందిది

సాంకేతిక వర్గం

సంగీతం అందించిన అకీవ బి ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. సినిమా డల్ గా ఉన్నా తన మ్యూజిక్ బాగుంటే కనీసం అసంతృప్తి శాతం తగ్గేది. పవన్ కుమార్ ఛాయాగ్రహణం ఉన్నంతలో పర్వాలేదు. చాలా బడ్జెట్ పరిమితులను తట్టుకుని డీసెంట్ క్వాలిటీ చూపించేందుకు కష్టపడ్డాడు. కార్తీక్ కట్స్ ఎడిటింగ్ పరంగా నిడివిని కంట్రోల్ చేయలేకపోయారు. స్పష్టంగా సాగతీత ఉన్న చోట కత్తెరకు పని చెప్పకపోవడం ముమ్మాటికీ తప్పే. డైలాగుల్లో మెరుపుల్లేవ్. అక్కడక్కడ తప్పించి గుర్తుండిపోయేలా రాయలేదు. ఆర్ట్ వర్క్ ఓకే. నిర్మాణ విలువల గురించి చెప్పడానికేం లేదు. ఫ్లైట్ విజువల్స్ కి తప్ప మిగిలినదంతా తక్కువ ఖర్చుతో జరిగిన వ్యవహారమే

ప్లస్ పాయింట్స్

ఎంచుకున్న అంశం

మైనస్ పాయింట్స్

నీరసంగా సాగే నెరేషన్
బాలన్స్ కాని భావోద్వేగాలు
నిడివి
దర్శకత్వ వైఫల్యం

ఫినిషింగ్ టచ్ : బలం లేని ఉస్తాద్

రేటింగ్ : 1.75/5

This post was last modified on August 12, 2023 5:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మరో సారి కేటీఆర్ పై రెచ్చిపోయిన కొండా సురేఖ

లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…

1 hour ago

ధనుష్ కోసం నయన్ ఫ్రీ సాంగ్

రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…

4 hours ago

విశ్వసుందరి కిరీటం విక్టోరియాకే.. ఇది మరో చరిత్ర!

ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…

4 hours ago

ఆదివారం కూడా.. కేసీఆర్‌ను వ‌దిలిపెట్ట‌వా రేవంత్‌!?

సండే ఈజ్ ఏ హాలీడే కాబ‌ట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్ర‌జ‌లంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజ‌కీయ‌ నాయ‌కులు మాత్రం…

4 hours ago

కేజ్రీవాల్ కు మరో దెబ్బ..

దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…

4 hours ago

కీర్తి సురేష్ పెళ్లి.. నిజమేనా?

ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…

5 hours ago