Movie Reviews

సమీక్ష – పొన్నియిన్ సెల్వన్ 2

లెజెండరీ దర్శకులు మణిరత్నం కోలీవుడ్ టాప్ స్టార్స్ కలయికలో రూపొందిన పొన్నియిన్ సెల్వన్ 1 కి కొనసాగింపు అనగానే తమిళనాడులో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు వర్షన్ గొప్పగా ఆడకపోయినా తొమ్మిది కోట్ల దాకా వసూళ్లు రావడం చూస్తే ప్రేక్షకులకు దీని పట్ల ఆసక్తి ఉన్నట్టు స్పష్టమైంది. అసలు కథ సీక్వెల్ లోనే ఉంటుందని యూనిట్ బాగా ప్రచారం చేయడం ఓపెనింగ్స్ పరంగా కొంత హెల్ప్ అయ్యింది. మరి ఈ యుద్ధవీరుడు ఏజెంట్ తో తలపడిన బాక్సాఫీస్ యుద్ధంలో కోరుకున్నట్టే గెలిచాడా

కథ

మొదటి భాగాన్ని ఎక్కడ ఆపారో పీఎస్ 2 అక్కడి నుంచి కొనసాగించారు. సముద్రంలో పడిపోయిన అరుళ్ మొళి(జయం రవి) జాడ దొరక్కపోవడంతో చనిపోయాడనే ప్రచారం ఊపందుకుంటుంది. చోళ సామ్రాజ్యం కైవసం చేసుకోవడం కోసం మధురాంతకుడు(రెహమాన్) శివుడిని నమ్మే శైవులతో పావులు కదుపుతాడు. ఈ కుటుంబం మొత్తాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న నందిని(ఐశ్వర్యరాయ్) చోళులకు బద్ధ శత్రువులైన వీరపాండ్యలను రెచ్చగొడుతుంది. ఇది తెలిసిన వల్లవరాయ(కార్తీ) కుందైవి(త్రిష)లు ఈ విషయాన్ని కరికాలుడి(విక్రమ్)కు చేరవేస్తారు. ఇక్కడి నుంచి అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి.

విశ్లేషణ

తమిళంలో విశేష ఆదరణ పొందిన నవలను సినిమాగా మలచడం మణిరత్నం తన దశాబ్దాల కలగా వర్ణిస్తూ వచ్చారు. రాజమౌళి బాహుబలి తీశాకే తనకూ ధైర్యం వచ్చిందన్న ఈ కల్ట్ డైరెక్టర్ పొన్నియిన్ సెల్వన్ 2లో భావోద్వేగాల మీదే ఎక్కువ దృష్టి పెట్టి డ్రామాలు, యుద్ధం లాంటి హంగులు తగ్గించేసి పూర్తిగా విభిన్నంగా చూపించే ప్రయత్నం చేశారు. రాజ్యాధికారం కోసం స్వంత అన్నదమ్ముల మధ్య ఎలాంటి విద్వేషాలు రగులుతాయి, బయటికి వ్యక్తులు వాటిని ఎలా వాడుకునే కుట్రలు చేస్తారనే కోణంలో వీలైనంత నాటకీయత లేకుండా కథనం నడిపారు. ఈ క్రమంలో పాత్రల మధ్య సంఘర్షణ కోసం అవసరానికి మించి ఎక్కువ సమయం తీసుకున్నారు.

సబ్జెక్టుపరంగా చూసుకుంటే ఇది సబబే అయినా అయిదు భాగాల పుస్తకాన్ని కేవలం అయిదున్నర గంటల్లో చూపించాలనుకున్నప్పుడు వీలైనంత వేగం అవసరం. ఎక్కువ డీటెయిల్స్ ప్రేక్షకులు ఆశించరు. పైగా బాహుబలి, కెజిఎఫ్ లాగా ఇది కొనసాగింపు కాబట్టి వన్ చూస్తే తప్ప ఇది అర్థం కాకపోయే రిస్క్ ఉండటంతో కామన్ ఆడియన్స్ కి సరిపడా హై మూమెంట్స్ క్రమం తప్పకుండా వస్తూ ఉండాలి. కానీ పొన్నియిన్ సెల్వన్ 2లో అలాంటివి పెద్దగా ఉండవు. అరుళ్ మొళి టైటిల్స్ పడిన రెండు గంటల తర్వాత కత్తి పట్టుకుంటాడు. అది కూడా తండ్రి మీద హత్య ప్రయత్నం జరిగాక. అప్పటిదాకా బుద్ద ఆశ్రమంలో అండర్ కవర్ గా ఉంటూ చేసే కార్యమేమి ఉండదు.

విక్రమ్ పోషించిన కరికాలుడి క్యారెక్టర్ నుంచి ఎంతో ఆశిస్తాం. అయితే మణిరత్నం ఆ కోణంలో ఆలోచించకుండా అసలు నందిని మీద అతని ఇష్టం ఎక్కడి నుంచి మొదలైందనే ఎపిసోడ్ నుంచి పీఎస్ 2ని మొదలుపెట్టారు. ఇది బాగా వచ్చింది. అయితే దూరం కావటానికి కన్విన్సింగ్ గా అనిపించిన పద్ధతి తిరిగి కలుసుకునే క్రమంలో ఏర్పడ్డ మానసిక ఘోషని కాస్త నిడివి పెంచి చూపడంతో ఇలాంటివి ల్యాగ్ కు కారణం అయ్యాయి. మూడు సామ్రాజ్యాల మధ్య ఆధిపత్య పోరు, అభిప్రాయ భేదాలను కేంద్రంగా చేసుకున్నప్పుడు వాటికి దారితీసిన పరిణామాలు, చోటు చేసుకున్న సంఘటనలు ఇంకొంత ప్రతిభావంతంగా ఉంటే ఖచ్చితంగా ఇంకా బాగా కనెక్ట్ అయ్యేది.

మణిరత్నం ఏ కథను తీసుకున్నా కవితాత్మకంగా చెబుతారు. ఇది అందరికీ రాదు. కానీ ఒకరకంగా ఇదే ఆయన బలహీనత కూడా. నందిని-కరికాల, వల్లవరాయ-కుంధైవి జంటల మధ్య ఆకర్షణకు పొయెటిక్ టచ్ అద్దడం వల్ల కొంత నిడివి సమస్య వచ్చిన మాట నిజం. ఇలాంటి వాటి నుంచి చిన్న పిల్లలు కావొచ్చు మాస్ అవ్వొచ్చు గూస్ బంప్స్ ఆశిస్తారు. కానీ మణిరత్నం వాటికి అవకాశం ఉన్నా దృష్టి పెట్టలేదు. ఉదాహరణకు ఇంటర్వెల్ కు ముందు అరుళ్ మొళి ఏనుగు అంబారీ మీద తిరిగి రాజ్యానికి వచ్చాక జరిగే హత్యప్రయత్నాన్ని వల్లవరాయ, తిరుమల ఇద్దరు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కానీ మొళి వీళ్ళ సహాయం తీసుకోకుండానే బయటపడతాడు

ఇదే సీన్ జక్కన్న అయితే థియేటర్లలో విజిల్స్ వేయించే రేంజ్ లో డిజైన్ చేసుకునేవారు. అలా అని మణిరత్నంని తక్కువ చేయడం లేదు. ఒక కథని ప్యాన్ ఇండియా లెవెల్ లో అన్ని వర్గాలను టార్గెట్ చేసినప్పుడు ఇలాంటివి అవసరమే. కేవలం అరవ జనం చూస్తే చాలని ఆయన నిర్మాతలు అనుకోలేదు కదా. అద్భుతమైన క్యాస్టింగ్, కళ్లుచెదిరే నిర్మాణ విలువలు, కెమెరా పనితనం ఇవన్నీ లోపాలను కప్పి పుచ్చుకునేందుకు ఉపయోగపడ్డాయి. ఐశ్వర్యరాయ్ డ్యూయల్ రోల్ చేసిన తల్లి క్యారెక్టర్ తాలూకు ట్రాక్ ని చప్పగా తేల్చేశారు. కొన్ని సీన్లు సీరియల్ తరహాలో అనిపిస్తాయి. ఇలాంటి అసంతృప్తి అక్కడక్కడా కలుగుతూనే ఉండటం ఒకరకంగా ఇబ్బందే

ట్రీట్మెంట్ ఎంత గొప్పగా ఉన్నా ఇలాంటి కథలకు కిక్ ఇచ్చే ఉపకథలు అవసరం. పొన్నియిన్ సెల్వన్ పుస్తకంలో బోలెడున్నాయి. వాటిని మణిరత్నం పూర్తిగా వాడుకోలేదు. ప్రాక్టికల్ గా సాధ్యం కాకపోయినా బెస్ట్ అనిపించేవి తీసుకోవాల్సింది. కరికాలుడు, అరుళ్ మొళి, వల్లవరాయల చుట్టే ఫోకస్ ఎక్కువగా పెట్టడం వల్ల మిగిలినవాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ని కేవలం డైలాగుల ద్వారానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పీఎస్ 1 కంటే ఈ 2 కొంత మెరుగ్గా అనిపించడం బాక్సాఫీస్ కోణంలో ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడాలి. ఒకవేళ ఈ అంశం కనక క్లిక్ అయితే ఈసారి డబ్బింగ్ వెర్షన్లతోనూ హిట్టు కొట్టొచ్చు. ఎటూ అపోజిషన్ వీక్ గా ఉండటం కలిసొస్తోంది

నటీనటులు

పొన్నియిన్ సెల్వన్ గొప్ప బలం క్యాస్టింగే. మరోసారి కార్తీ తన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. విక్రమ్ ఎప్పటిలాగే ఎమోషన్లతో ఆడుకోగా జయం రవి అదే హుందాతనాన్ని కొనసాగించాడు. ఈ వయసులోనూ ఐశ్వర్య రాయ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి వాహ్ అనకుండా ఉండలేం. నటన కూడా అదే స్థాయిలో ఉంది. త్రిష నుంచి చూపు పక్కకు తిప్పుకోవడం కష్టమే. శోభిత ధూళిపాళ, ఐశ్యర్య లక్ష్మి, విక్రమ్ ప్రభు, ప్రభు, పార్తీబన్, నిలళ్ గల్ రవి, ప్రకాష్ రాజ్, లాల్, జయరాం ఇలా మొత్తం తారాగణం ఆయా పాత్రల్లో ఒదిగిపోయిన తీరు బాగా కుదిరింది. జూనియర్ సీనియర్లను సరైన రీతిలో కంపోజ్ చేసుకుని మణిరత్నం వేసుకున్న డిజైన్ పీఎస్ సిరీస్ కున్న అతి పెద్ద ఆకర్షణ

సాంకేతిక వర్గం

ఏఆర్ రెహమాన్ మరోసారి తన బాధ్యతకు పూర్తి న్యాయం చేశారు. పాటలు ఎక్కువ లేకుండా స్వీట్ అండ్ షార్ట్ గా సర్దేశారు. ఒకప్పటి రోజా, బొంబాయి లాగా మళ్ళీ మళ్ళీ వినే ఆల్బమ్ కాకపోయినా హోరు లేని నేపధ్య సంగీతంతో మణిరత్నం ఆలోచనలకు మరోసారి బలమై నిలిచాడు. ఛాయాగ్రాహకులు రవివర్మన్ ఈ సినిమాకు కనిపించని హీరో. కలర్ స్కీం, ఫ్రేమ్ సెట్టింగ్స్ అన్నీ చక్కగా ఆవిష్కరించి దర్శకుడి విజన్ ని తన కంటితో చూపించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ని ల్యాగ్ కి నిందించలేం. బేసిక్ గా స్క్రీన్ ప్లేనే ఆలా ఉంది కాబట్టి సరిపెట్టుకోవాలి. లైకా నిర్మాణం గురించి చెప్పడానికి ఏమీ లేదు. గ్రాండియర్ అనిపించుకునే అన్ని అర్హతలకు తగ్గట్టు డబ్బు పెట్టారు

ప్లస్ పాయింట్స్

తారాగణం
భావోద్వేగాలు
నవలకే కట్టుబడటం
కెమెరా, సంగీతం

మైనస్ పాయింట్స్

నెమ్మదిగా సాగే కథనం
ఉద్వేగభరిత ఎపిసోడ్స్ లేకపోవడం
డ్రామా డామినేషన్

ఫినిషింగ్ టచ్ : మణి మార్కు ఎమోషన్

రేటింగ్ : 2.75/5

This post was last modified on April 28, 2023 9:46 pm

Share
Show comments
Published by
Satya
Tags: FeaturePS 2

Recent Posts

జోష్ సరిపోతుందా రాకీ

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో ఎక్కువ ఎడ్జ్ ఉన్నది మెకానిక్ రాకీకే. విశ్వక్ సేన్ హీరోగా మీనాక్షి చౌదరి,…

1 hour ago

అరగుండు తారక్.. ఏం ప్లాన్ చేశావ్ సుక్కు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సుకుమార్ ఏదో…

2 hours ago

పాట్నా వేడుక అదిరిపోయే బ్లాక్ బస్టర్

నిన్న జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకవేళ హైదరాబాద్ అయ్యుంటే ఎలా ఉండేదో కానీ పాట్నాలో వచ్చిన…

3 hours ago

చివరిస్తానంలో హైదరాబాద్.. బయట ఫుడ్ తో జాగ్రత్త

హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీలులకు సైతం గౌరవం ఎక్కువ.…

4 hours ago

కొత్త లుక్ లో దర్శనం ఇచ్చిన మహేష్ బాబు!

సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో గడ్డం,…

4 hours ago

రాజమౌళి-సెంథిల్.. ఏం జరిగింది?

దర్శక ధీరుడు రాజమౌళి మొదటి నుంచి ఒక సెట్ ఆఫ్ టెక్నీషియన్లతో పని చేస్తూ వచ్చాడు. ఆయన సినిమాలకు ఇప్పటిదాకా…

12 hours ago