Movie Reviews

సమీక్ష – దాస్ కా ధమ్కీ

మంచి జోష్ తో కనిపించే కుర్ర హీరో విశ్వక్ సేన్ సినిమా అంటే యూత్ లో మంచి అంచనాలే నెలకొంటున్నాయి. ఫలక్ నుమా దాస్ ని తెరకెక్కించిన విధానంతో మొదలుకుని అశోకవనంలో అర్జున కళ్యాణం లాంటి సాఫ్ట్ సబ్జెక్టులు ఎంచుకునే దాకా ఎంతో కొంత వైవిధ్యం అయితే చూపిస్తున్నాడు. మాటల్లో కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించినా మినిమమ్ గ్యారెంటీ ఎంటర్ టైన్మెంట్ ఉంటుందనే నమ్మకం కొనగిస్తున్నాడు. దాస్ కా ధమ్కీ ప్రమోషన్లలోనూ అది చూపించాడు. నిజంగా టైటిల్ కు తగ్గట్టు ధమ్కీ ఇచ్చిందా తిందా చూద్దాం

ఫైవ్ స్టార్ హోటల్ లో పని చేసే కృష్ణదాస్(విశ్వక్ సేన్)ది పైసా పైసా లెక్కలేసుకునే మధ్యతరగతి బ్రతుకు. కీర్తి(నివేత పేతురాజ్)ని చూడగానే ఇష్టపడి ప్రేమలో పడతాడు. అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల అచ్చం తనలాగే ఉండే డాక్టర్ సంజయ్ రుద్ర(విశ్వక్ సేన్) స్థానంలో పది వేల కోట్లతో ముడిపడిన వ్యాపార సామ్రాజ్యంలోకి దాస్ అడుగుపెడతాడు. ప్రమాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని చక్కదిద్దే క్రమంలో తనకే తెలియకుండా పద్మవ్యూహంలో చిక్కుకుంటాడు. ఆ తర్వాత జరిగే మలుపులే అసలు కథ

విశ్వక్ సేన్ లో నటన పరంగా స్పార్క్ ఉండటమే కాదు టెక్నికల్ గా మంచి పట్టున్న దర్శకుడున్నాడు. ఎటొచ్చి రచయిత డామినేషన్ ఎక్కువ కావడంతో సాంకేతికంగా చూపిస్తున్న ప్రతిభ టేకింగ్ పరంగా బెస్ట్ కాలేకపోయింది. బెజవాడ ప్రసన్న కుమార్ ఇచ్చిన కథలో పెద్ద కొత్తదనమేమీ లేదు. టీమ్ ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్లలో గౌతమ్ నందా, ధమాకా పోలికలు లేవని నొక్కి నొక్కి చెప్పారు కానీ నిజానికి వాటితో కంపారిజన్లున్న మాట వాస్తవమే. అయితే పూర్తిగా మాత్రం కాదు. ధమ్కీ రెండు పాత్రలున్న విషయాన్ని ట్రైలర్ లోనే దాచలేదు. విశ్వక్ ఫస్ట్ హాఫ్ మొత్తం క్లారిటీతో మిడిల్ క్లాస్ కృష్ణదాస్ తాలూకు నేపధ్యాన్ని కాసింత కామెడీతో, లవ్ తో నీట్ గానే నెట్టుకొచ్చాడు.

హిలేరియస్ అనిపించే ఎపిసోడ్స్ లేకపోయినా మరీ విసుగు రాకుండా ఎంతో కొంత టైం పాస్ అయ్యేలా హైపర్ ఆది, రంగస్థలం మహేష్ లతో మేనేజ్ చేసుకున్నాడు. అయితే ఇదంతా అసలు స్టోరీకి ట్విస్టులకు సంబంధం లేని వ్యవహారం. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గరి నుంచి విశ్వక్ తనలోని ట్విస్టుల రైటర్ ని బయటికి తీసుకొచ్చాడు. క్రమం తప్పకుండా మలుపులు వస్తూనే ఉంటాయి. కొన్ని ఊహించలేం కానీ చాలామటుకు ఈజీగా గెస్ట్ చేసే అవకాశం ఇచ్చాడు. విశ్వక్ రెండు షేడ్స్ ని వైవిధ్యంగా పెర్ఫార్మన్స్ ఇచ్చిన విధానం బాగానే ఉంది కానీ ఎటొచ్చి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే డిమాండ్ చేసే బలమైన కంటెంట్ లేకపోవడంతో రెండో సగం గ్రాఫ్ కిందకు వెళ్తూనే పోయింది.

సంజయ్ తాలూకు బ్యాక్ డ్రాప్ ని పాజిటివ్ గా మొదలుపెట్టి దానికి గ్రే కలర్ ఇవ్వడం బాగానే ఉంది. అయితే ఇలాంటివి గతంలో ఎన్నడూ చూడనివి అయితే కాదు. శోభన్ బాబు, కృష్ణలతో మొదలుపెట్టి గోపీచంద్, జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరూ చేశారు. మరి విశ్వక్ అంత ఎగ్జైటింగ్ గ ఎవరూ చేయలేదన్న రీతిలో పబ్లిసిటీ ఎందుకు చేసుకున్నాడో అర్థం కాదు. క్యాన్సర్ కు డ్రగ్ కనిపెట్టడం, దాని వెనుక ఒక విలన్ వెంటపడటం అనేది ఎప్పుడో కాంతారావు కాలం నాటి పాయింట్. పోనీ జబ్బునైనా ఏదైనా కరోనా రేంజ్ లో క్లిష్టమైనది తీసుకున్నారా అంటే అదీ లేదు. ఈ నేపథ్యం తాలూకు ఎస్టాబ్లిష్ మెంట్ సరిగా జరగకపోవడమే ధమ్కీకి ట్రబుల్ గా మారింది

కథను ముందుకు తీసుకెళ్లే క్రమంలో డైరెక్టర్ గా ఎక్కడిక్కడ సులభంగా క్లూలు ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ప్రసన్న కుమార్ ఇచ్చిన కథను యధాతథంగా తీశాడా లేక తనవంతుగా మార్పులు చేర్పులు చేసుకున్నాడా తెలియదు కానీ విశ్వక్ సేన్ మీద పలు రకాల ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా యాక్టర్ గా తనలోని బెస్ట్ ఆవిష్కరించుకునే తాపత్రయం ఒకటి కాగా, ట్విస్టులని ఎంత ఎక్కువగా జొప్పిస్తే ఆడియన్స్ అంతగా ఎగ్జైట్ అవుతారనే ఆలోచనతో కథనంలో వేగాన్ని తన క్రియేటివిటీ కిల్ చేసిన సంగతిని గుర్తించలేకపోయాడు. పైగా ప్రీ క్లైమాక్స్ ముందు మొత్తం ఓపెన్ అయ్యాక కూడా ఇంకో పది నిముషాలు సాగదీయడం ఇబ్బంది

ట్రీట్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విశ్వక్ సేన్ దర్శకుడిగా దాస్ కా ధమ్కీ ఓల్డ్ స్కూల్ లోనే వెళ్తోందన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. ఒకవేళ ఇది కనక బ్యాలన్స్ అయ్యుంటే సెకండ్ హాఫ్ పరుగులు పెట్టి ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేవాళ్ళు. బాలీవుడ్ మూవీ రేస్ తరహా మేకింగ్ తెలుగులోనూ చూపించాలన్న ఆలోచన కాబోలు విశ్వక్ ని ఇలా ఆలోచించేలా చేసింది. రేస్ అంత పెద్ద విజయం సాధించడానికి ప్రధాన కారణం పాత్రలను ఆడియన్స్ కి రిజిస్టర్ చేసే క్రమాన్ని ఎలాంటి అనుమానం రాకుండా రాసుకోవడం వల్ల. కానీ విశ్వక్ సేన్ ఫోకస్ మొత్తం మలుపుల మీదే ఉండిపోవడంతో క్యారెక్టర్ల ప్రవర్తన ఉత్సుకతని ఎక్కడికక్కడ చంపేస్తూ వచ్చింది

నటుడిగా విశ్వక్ సేన్ సంపూర్ణంగా మెప్పించాడు. కృష్ణ దాస్, సంజయ్ గా ఎక్కడా నిరాశపరచలేదు. కథలను విని వాటిలో నటించి న్యాయం చేయడానికే కొందరు యూత్ హీరోలు కిందా మీదా పడుతుంటే ఇక్కడ డైరెక్షన్ అనే బరువుని మోస్తూ పాస్ కావడం అతనికున్న పెద్ద బలం. రైటర్ గా ఉన్న బలహీనతలను పోగొట్టుకుంటే చాలు. నివేత పేతురాజ్ కు గ్లామర్ తో పాటు స్క్రీన్ మీద చెప్పుకోదగ్గ స్కోప్ దక్కింది. రావు రమేష్ ది రొటీన్ పాత్ర. రోహిణి సింగల్ ఎక్స్ ప్రెషన్ కు సరిపోయారు. హైపర్ ఆది, మహేష్ ల జోకులు హెల్ప్ అయ్యాయి. అజయ్ ని ఇలా ఎన్నోసార్లు చూసేశాం. చిన్న చిన్న పాత్రలో పేరున్న క్యాస్టింగ్ ని తీసుకున్నారు.

లియోన్ జేమ్స్ సంగీతం పర్వాలేదు. పాటలు ఎక్కువ పెట్టకపోవడం రిలీఫ్ ఇచ్చింది. ట్యూన్స్ బాగానే ఉన్నాయి. పిక్చరైజేషన్ కుదిరాయి. చివర్లో వచ్చే ఐటెం సాంగ్ ఎందుకు పెట్టారో అంతు చిక్కదు. దినేష్ కె బాబు ఛాయాగ్రహణం గురించి పెద్దగా ఫిర్యాదేం లేదు. చక్కగా ఇచ్చారు. అన్వర్ అలీ ఎడిటింగ్ క్రిస్పీగానే ఉంది. ఎక్కడా అనవసరమైన సీన్లు బోలెడున్నాయన్న ఫీలింగ్ రాలేదు. ప్రాబ్లమ్ కంటెంట్ లో ఉన్నప్పుడు కత్తెరను కామెంట్ చేయలేం. విశ్వక్ రాసుకున్న డైలాగులు అక్కడక్కడా బాగానే పేలాయి. స్వంత నిర్మాణ సంస్థే అయినా ఖర్చు విషయంలో రాజీ పడలేదు. తెరమీద భారీతనం కనిపిస్తుంది. తన మార్కెట్ మించిన రిస్కే ఇది

ప్లస్ పాయింట్స్

విశ్వక్ సేన్ నటన
ఫస్ట్ హాఫ్ కామెడీ
ఇంటర్వెల్ ట్విస్టు

మైనస్ పాయింట్స్

సంజయ్ ఎపిసోడ్
రొటీన్ ఫ్లాష్ బ్యాక్
రెండో సగం సాగతీత

ఫినిషింగ్ టచ్ – కిక్కు చాల్లేదు దాసూ

రేటింగ్ : 2.5 / 5

This post was last modified on March 22, 2023 3:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

3 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

5 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

6 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

8 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

9 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

9 hours ago