Movie Reviews

సమీక్ష – హంట్

పోలీస్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్స్ కి తెలుగులో మంచి డిమాండే ఉంది. అందుకే హంట్ మీద ప్రేక్షకుల్లో అంతో ఇంతో ఆసక్తి కలిగిన మాట వాస్తవం. రెగ్యులర్ కథలకు కాస్త విభిన్నంగా ప్రయత్నాలు చేస్తున్న సుధీర్ బాబుకు గత రెండు మూడు సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో మరోసారి ఖాకీ డ్రెస్సు తొడిగి మరో ప్రయోగంతో వచ్చాడు. ప్రమోషన్లలో చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ వచ్చాడు. సంక్రాంతి సందడి తగ్గిపోయిన తరువాత వచ్చిన చెప్పుకోదగ్గ చిత్రంగా మూవీ మీద అంచనాలు ఉన్నాయి.

ఏసిపి అర్జున్ ప్రసాద్(సుధీర్ బాబు)ఓ ప్రమాదానికి గురై గతం మర్చిపోతాడు. దీంతో కమీషనర్ మోహన్(శ్రీకాంత్) సహాయంతో ఆ విషయం బయటికి తెలియనివ్వకుండా హత్యకు గురైన తోటి ఆఫీసర్ ఆర్యన్ దేవ్(భరత్) కేసు విచారణను కొనసాగిస్తాడు. అనుమానితులు దొరికినా క్లూస్ దొరక్కుండా చిక్కుముడి పెరుగుతుంది. కొన్ని విస్తుపోయే నిజాలు బయట పడతాయి. ప్రాణ స్నేహితుడి మరణం వెనుక రహస్యం కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధపడిన అర్జున్ చివరికి గమ్యం ఎలా చేరుకున్నాడనేదే అసలు కథ

ఆడియెన్ వైవిధ్యం కోరుకుంటున్నారు. నిజమే. కాకపోతే దేశమంతా పబ్లిక్ పల్స్ ఒకేలా ఉండదు. ఉదాహరణకు తెలుగు తమిళం సినిమాల్లో ఉన్నంత కమర్షియల్ ఫ్లేవర్ మలయాళంలో కనిపించదు. బెంగాలీ ఒరియా జనాలు మరో రకం. సామజిక పరిస్థితులు ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాయి. ఒక సబ్జెక్టుని ఎంచుకునేటప్పుడు ఇది ఖచ్చితంగా గుర్తుంచుకునే తీరాలి. హంట్ లో చాలా టిపికల్ పాయింట్ ఉంది. పైకి అధికారికంగా చెప్పలేదు కానీ ఇది మల్లువుడ్ సూపర్ హిట్ ముంబై పోలీస్ కు రీమేకే. ఏవో మార్పులు చేశామన్నారు అయితే అది కొంత పరిధి మేరకే జరిగింది. మిగిలినదంతా ఒరిజినల్ వెర్షన్ నే ఫాలో అయ్యారు. సోల్ దెబ్బ తినకూడదనే ఉద్దేశం కాబోలు

ఒక హత్య చుట్టూ జరిగే ఇన్వెస్టిగేషన్ డ్రామాకు టెంపో చాలా కీలకం. దాని తాలూకు స్క్రీన్ ప్లే ఎంత గ్రిప్పింగ్ గా ఉంటే చూసేవాళ్ళు అంతగా మూవీలో లీనమైపోతారు. దర్శకుడు మహేష్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు కానీ దాన్ని ప్రతిభావంతంగా స్క్రీన్ పై చూపడంలో తడబడ్డాడు. ఉదాహరణకు ఆర్యన్ మర్డర్ ప్లాట్ మంచి ఇంటెన్స్ తో పేలాలి. అతడులో షియాజీ షిండేని పబ్లిక్ స్టేజి మీద చంపుతారని తెలిసినా ఆ సీన్ ని మనం ఉత్కంఠగా చూస్తాం. గ్రిప్పింగ్ అంటే అది. ఇందులోనూ అలాంటి స్కోప్ ఉన్నా మహేష్ ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోపరుచుకోలేదు. చక్కని మలుపులు ఉన్నాయి కానీ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా లేకపోవడం మైనస్

రీమేక్స్ ఎంచుకోవడం తప్పేమీ కాదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లే మినహాయింపు కానప్పుడు సుధీర్ బాబు వాటివైపు వెళ్లడంలో ఆశ్చర్యం లేదు. కాకపోతే భాషతో సంబంధం లేకుండా ప్రతి కంటెంట్ ఓటిటిలో దొరుకుతున్నప్పుడు మరింత జాగ్రత్తలు అవసరం. ముంబై పోలీస్ లో షాకింగ్ ఎలిమెంట్ ని క్రమం తప్పకుండా ఒక పద్దతి ప్రకారం విప్పే తీరు నీట్ గా ఉంటుంది. ఇది 2013 టైంలో ఫ్రెష్ గా డిఫరెంట్ గా అనిపించి కేరళ జనాలు గొప్పగా ఆదరించారు. కానీ ఈ ఎనిమిదేళ్ల కాలంలో టెక్నాలజీతో సహా స్టోరీ టెల్లింగ్ అనే కాన్సెప్ట్ విపరీతమైన మార్పులకు లోనైంది. ముఖ్యంగా ఓటిటిల వల్ల భాషతో సంబంధం లేకుండా అన్నీ స్మార్ట్ టీవీలో అంచుల్లోకి వచ్చేశాయి.

అలాంటప్పుడు కొంచెం అప్డేట్ గా కొత్త వెర్షన్ రాసుకుని ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ వరకు ఓ మోస్తరుగా ఇంటరెస్ట్ లెవెల్స్ తగ్గకుండా నడిపించిన మహేష్ కు రెండో సగంలో క్లైమాక్స్ ట్విస్టు తప్ప పెద్దగా చెప్పడానికి ఏమి లేకుండా పోయింది. దీంతో విచారణ పేరుతో రాసుకున్న సన్నివేశాలు రిపీట్ గా అనిపించి బోర్ కు కారణమయ్యాయి. ముగ్గురు పోలీస్ ప్రాణ స్నేహితుల మధ్య బాండింగ్ ని సరిగా ఎస్టాబ్లిక్ చేయలేకపోయారు. అది పండి ఉంటే ఆర్యన్ తాలూకు విషాదం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేది. కానీ అది జరగకపోవడంతో అర్జున్ తాలూకు బాధను మనం ఆస్వాదించలేం. సహజంగానే దీని ప్రభావం చివరి ఘట్టం మీద పడి జాలి కలిగే ఛాన్స్ మిస్ అయ్యింది

ముందే చెప్పినట్టు తెలుగు జనాల టేస్ట్ లను గుర్తుపెట్టుకుని దానికి అనుగుణంగానే తెరకెక్కించాలి తప్ప క్రియేటివ్ గా ఉన్న ప్రతి పాయింట్ ని అన్ని చోట్లా ఒకేలా రిసీవ్ చేసుకుంటారన్న గ్యారెంటీ లేదు. కేరళలో కొబ్బరి నూనె వంటలు మనమెలాగైతే తినలేమో అక్కడి మనుషుల్లో ఆలోచనా విధానాన్ని కూడా ఒకేలాగా మనకు అన్వయించుకోలేం. అందుకే మలయాళం బ్లాక్ బస్టర్లు ఇక్కడ యావరేజ్ లు ఫ్లాప్ గా మిగిలినవే ఎక్కువ. హంట్ ని ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో అటుఇటు తిప్పుతూ నాన్ లీనియర్ తరహాలో చెప్పాలనుకున్న క్రమం కూడా సరైన రీతిలో కుదరలేదు. అసలు కిల్లర్ ఎవరన్నది ఊహకందకుండా డిజైన్ చేయడమొకటే హంట్ లో ఉన్న యునీక్ పాయింట్

జానర్ ఏదైనా ఎమోషనల్ కనెక్షన్ లేకపోతే ఫలితం అటుఇటు అవుతుంది. బెల్లంకొండ రాక్షసుడులో సైకో కిల్లర్ మీద మనకు కసి ఎందుకు పెరిగిందంటే స్వయానా హీరో అన్న కూతురు తాలూకు ట్రాజిడీ మనకు తగిలింది కాబట్టి. కానీ హంట్ లో అలాంటి స్కోప్ ఉన్నప్పటికీ శ్రీకాంత్ సుధీర్ భరత్ ల మధ్య బాండింగ్ సరిగా చూపించలేకపోయారు. పైగా పెద్దగా సింక్ అవ్వని టెర్రరిస్టు నేపధ్యాన్ని పెట్టారు కానీ విదేశాల్లో తీయడానికి తప్ప దాని వల్ల కలిగిన ప్రయోజనం తక్కువే. లాజిక్ కూడా ప్రాపర్ గా లేదు. మహేష్ లో పనితనం ఉన్నప్పటికీ రిస్క్ కు భయపడి ముంబై పోలీస్ ని తెలుగు పోలీస్ గా తీర్చిదిద్దడంలో అడుగులు తేడాగా వెళ్లిపోయాయి.

సుధీర్ బాబు కష్టంలో మార్పు లేదు. ఫిజికల్ ఫిట్నెస్ మీద విపరీతమైన శ్రద్ధ పెడుతున్న ఇతనికి సరైన కథలే పడటం లేదు. రెండు మూడు ఫ్రేమ్స్ లో సిక్స్ ప్యాక్ చూపించినంత మాత్రాన ఫ్యాన్స్ వావ్ అంటారేమో కానీ దానికి తగ్గట్టు బిల్డప్ సబ్జెక్టులో ఉంటేనే కొత్త జనరేషన్ లో అతను పెడుతున్న ఎఫర్ట్ కి న్యాయం జరుగుతుంది. శ్రీకాంత్ బాగానే కుదిరాడు. భరత్ కన్నా బెటర్ ఛాయస్ తీసుకోవాలనిపించింది. ప్రత్యేకంగా హీరోయిన్లంటూ లేరు. చిత్రా శుక్లా, మౌనికా రెడ్డికి చెరో రెండు సీన్లు పడ్డాయి. ఓకే అనిపించారు కానీ మరీ ప్రత్యేకంగా గుర్తుండరు. కబీర్ సింగ్, మైమ్ గోపి, గోపరాజు రమణ తదితరులు తమ తమ పరిధి మేరకు చేశారు

జిబ్రాన్ నేపధ్య సంగీతం నుంచి చాలా ఆశిస్తాం కానీ మరీ సాహో రేంజ్ లో లేకపోయినా ఈ అవుట్ ఫుట్ కి మించిన క్వాలిటీనే ఇచ్చాడు. ఐటెం సాంగ్ అసందర్భంగా రావడంతో ట్యూన్ సంగతెలా ఉన్నా ఏ మాత్రం పేలలేదు. అరుళ్ విన్సెంట్ ఛాయాగ్రహణం బాగుంది. బడ్జెట్ పరిమితులను లోటు అనిపించకుండా వీలైనంత క్వాలిటీ స్క్రీన్ మీద చూపించాడు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ని ల్యాగ్ కి కారణం అనలేం. ఇది అక్కర్లేదనేది ఏదీ లేదు కానీ అసలు బలహీనత రైటింగ్ లో ఉంది కనక తనవరకు వంకలు లేవు. ఫైట్లు గట్రా పర్వాలేదు. భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలు మరీ ఎక్కువ రాజీ పడలేదు. డిమాండ్ మేరకు ప్రొడక్షన్ మీద బాగానే ఖర్చు పెట్టారు.

ప్లస్ పాయింట్స్

డిఫరెంట్ ట్విస్ట్
ఫస్ట్ హాఫ్ కొంత
కొన్ని యాక్షన్ బ్లాక్స్
సుధీర్ బాబు కష్టం

మైనస్ పాయింట్స్

కనెక్ట్ కానీ ఎమోషన్స్
కన్విన్సింగ్ గా లేని స్క్రీన్ ప్లే
రెండో సగం ల్యాగ్
మరింత మెరుగ్గా ఉండాల్సిన క్లైమాక్స్

ఫినిషింగ్ టచ్ : గురి తప్పింది

రేటింగ్ : 2.25 / 5

This post was last modified on January 26, 2023 6:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుప‌తి క్యూలైన్లో తోపులాట‌.. ఎంత మంది చనిపోయారు

ఈ నెల 10 శుక్ర‌వారం నాడు వైకుంఠ ఏకాద‌శిని పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌త్యేక స‌ర్వ‌ద‌ర్శ‌న టోకెన్ల పంపిణీని…

14 minutes ago

న‌మో-న‌మో-న‌మో.. నారా లోకేష్ 21 సార్లు!

ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ త‌న ప్ర‌సంగంలో ఏకంగా 21 సార్లు న‌మో అనే ప‌దాన్ని…

29 minutes ago

మోదీ, పవన్ పై చంద్రబాబు ప్రశంసలు

విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక…

33 minutes ago

తెలుగులో మోదీ స్పీచ్ కు ఫిదా!

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర…

2 hours ago

ఏపీకి ప్ర‌ధాని ఇచ్చిన వ‌రాల ప్రాజ‌క్టులు ఇవీ..

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌లు గంటున్న ల‌క్ష్యాల‌ను సాకారం చేసేందుకు తాము అండ‌గా ఉంటామ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ…

2 hours ago

ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ డిమాండ్ చూశారా

మొన్నటిదాకా అసలెవరో తెలియని ఇమాన్వి ఇస్మాయిల్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎంపిక కాగానే ఒక్కసారిగా ఇతర బాషల నిర్మాతల…

3 hours ago