మనవాళ్లకు పొరుగింటి పుల్ల కూర రుచి. పక్కింటి సినిమాలంటే మహా మోజు. అలా కొరియన్ సినిమా నుంచి కొనుక్కొచ్చిన కథతో తీసిన సినిమా శాకిని-ఢాకిని. కానీ తీరా చూస్తే దీనికి బాబులాంటి సినిమా, దాదాపు ఇదే లైన్ తో మనవాళ్ల ఎప్పుడో వెంకీ అంటూ తీసేసారు. రవితేజ వెంకీ సినిమా గుర్తుందిగా. నలుగురు పోలీస్ ట్రయినింగ్ కుర్రాళ్లు కలిసి ఓ విలన్ ను ఎదుర్కొని ఓ అమ్మాయిని కాపాడడం. శాకిని ఢాకిని కూడా ఇంచుమించుగా ఇదే లైను. ఓ ఇద్దరు పోలీస్ ట్రయినింగ్ అమ్మాయిలు కలిసి ఆపదలో చిక్కుకున్న అమ్మాయిని కాపాడడం.
కామెడీ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ఆడియన్స్ దగ్గర మంచి ప్లేస్ వుంటుంది. కానీ ఎటొచ్చీ ఆ కామెడీ వర్కవుట్ అవ్వాలి. థ్రిల్లర్ అన్నందుకు మాంచి ఎలిమెంట్స్ జోడించాలి. శాకిని ఢాకిని సినిమాకు రెండూ కూడా పెర్ ఫెక్ట్ గా వర్కవుట్ అవ్వలేదు. కామెడీ టచ్ అన్నది కొద్దిగా వర్కవుట్ అయింది. థ్రిల్లర్ అన్నది తక్కవ.
సినిమా తొలిసగం అంతా హీరోయిన్లు నివేదా-రెజీనాల టామ్ అండ్ జెర్రీ లాంటి చిన్నపిల్లల గొడవలు చోటు చేసుకుంటాయి. అవేమంత ఫన్ క్రియేట్ చేసేంత స్టఫ్ కాదు. సపోర్టింగ్ క్యారెక్టర్లుగా పృధ్వీ-భద్రం లాంటి క్యారెక్టర్లు వున్నాయి కానీ పెద్దగా ప్లేస్ మెంట్ లేదు. పైగా ఇద్దరి అమ్మాయిల చిలిపి తగాయిదాలు చూపిస్తూనే, మధ్యలో ఓ అమ్మాయికి ఏదో ఎమోషనల్ బ్యాక్ గ్రవుండ్, ఫ్లాష్ బ్యాక్ వుందని పదే పదే గుర్తు చేస్తుంటారు. దాంతో ఈ ఫన్ డైల్యూట్ అయిపోతుంటుంది. నివేదా సూటయినంతగా ఫన్ కు రెజీనా సూట్ కాలేదు. ఇలా తొలిసగం మొత్తం ఈ ట్రాక్ కే కేటాయించి, దానికి పోలీస్ శిక్షణ సీన్లు జోడించి, థ్రిల్లర్ మలుపు తిప్పే సీన్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చారు.
ద్వితీయ సగం అంతా ఇక థ్రిల్లర్ అన్నమాట. ఇక్కడ ఇంకోరకం సమస్య ఎదురవుతుంది. సినిమా ఎక్కడా ఎటువంటి మలుపులు తిరగదు. ఫ్లాట్ గా సాగిపోతూ వుంటుంది. నేరస్థుల ఆచూకీ, పరిశోధన, అమాయకులను రక్షించడం వంటి కార్యక్రమాలు అన్నీ చకచకా సాగిపోతుంటాయి. తన్నులు తినడం, దెబ్బలు తగుల్చుకోవడం మినహా హీరోయిన్లు ఇద్దరికీ ఇన్వెస్టిగేషన్ లో పెద్దగా స్ట్రగుల్ వుండదు. ఆసక్తి కలిగించే ట్విస్ట్ లు వుండవు. ప్రేక్షకులు అలా కళ్లు అప్పగించి చూస్తూ వెళ్లిపోవడం తప్ప ఎటువంటి రసానుభూతి వుండదు.
ఇద్దరు హీరోయిన్లు పెట్టే పరుగులు, చేసే ఫైట్లు చూడడం కోసం సినిమా చూడాలి తప్ప మరెందుకు కాదు. పోనీ ఆ పరుగులు, ఫైట్లు ఏమన్నా అద్భుతంగా వుంటాయా? భారీగా వుంటాయా అంటే అదీ కాదు. చాలా నేలబారుగా వుంటాయి. క్లయిమాక్స్ ఫైట్ ఒక్కటే కాస్త ఊరట.
శాకిని ఢాకిని సినిమాకు ప్లస్ ఏమిటంటే అనుభవజ్ఙులైన టెక్నీషియన్లు పని చేయడం. అందువల్ల బ్యాడ్ మూవీ అనిపించదు. అలా అని పరుగెత్తుకెళ్లి చూసేయాల్సిన గొప్ప సినిమ కాదు. ఏదో టైమ్ పాస్ వ్యవహారం అన్నమాట. ఇలాంటి సినిమాలో ఒక్క రఘుబాబు ఎపిసోడ్ పక్కన పెడితే మిగిలిన వన్నీ బాగానే మిక్స్ అయ్యాయి. అక్కడక్కడ చిన్న జంప్ లు కూడా కనిపించాయి.
నివేదా..రెజీనా ఇద్దరు ఓకె. నివేదా కాస్త ఎక్కువ ఓకె. ఎందుకంటే ఆమె కు కాస్త చలాకీ డైలాగ్ రైటింగ్, కామెడీ టైమింగ్ పడ్డాయి. ఇక చెప్పుకోవడానికి మరెవరు లేరు. మాటలు ఓకె. బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కొత్తగా ప్రయత్నించినట్లు కనిపించింది. సినిమాకు ఎంత వరకు కావాలో అంత వరకే కొలిచి పెట్టినట్లుంది.
ఇలా వచ్చి అలా వెళ్లిపోయే సినిమాల జాబితాలో చేరుతుందీ శాకిని-ఢాకిని.
ప్లస్ పాయింట్లు
పెద్దగా మైనస్ లు లేకపోవడం
మైనస్ పాయింట్లు
రొటీన్ కథ..కథనం
ఫినిషింగ్ టచ్: నో గుడ్ – నో బ్యాడ్
Rating: 2.25/5
This post was last modified on %s = human-readable time difference 3:48 pm
ఇంకో పది రోజుల్లో నవంబర్ 14 విడుదల కాబోతున్న కంగువ మీద ఎన్ని అంచనాలున్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఏపీ, తెలంగాణలో…
చాలా గ్యాప్ తర్వాత ఒక వీకెండ్ మొత్తం థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడటం దీపావళికి జరిగింది. పెద్ద స్టార్…
మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు ఎంత నామమాత్రంగా ఉంటాయో తెలిసిందే. కథానాయికలకు మంచి గుర్తింపు ఉన్న పాత్రలు పది సినిమాల్లో…
ప్రస్తుతం సినిమాల స్కేల్ పరంగా ప్రభాస్ను అందుకునే హీరో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరూ లేరు. బాహుబలితో ఎవ్వరికీ సాధ్యం…
టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకడు. నిర్మాతగా తొలి చిత్రం ‘దిల్’తో మొదలుపెడితే ఒకప్పుడు వరుసగా…
దర్శకులు కొన్నేళ్ల జర్నీ తర్వాత నటులవుతుంటారు. అలాగే నటులు కొన్నేళ్ల అనుభవం వచ్చాక దర్శకత్వం మీద ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. వెంకీ…