ఏ ఫ్లాప్ సినిమా అయినా ఎక్కడో ఒక పాయింట్ లో ఫెయిల్ కావచ్చు. రెండు పాయింట్లలో ఫెయిల్ కావచ్చు. అయినా కనీసం ఒకటో, రెండో ప్లస్ పాయింట్లు రాయడానికి అవకాశం అయితే ఇస్తాయి. కానీ టోటల్ ఫెయిల్యూర్ అనే ట్యాగ్ లైన్ తగిలించగలిగే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అచ్చంగా అలాంటి సినిమా రామారావు ఆన్ డ్యూటీ. అలాగే గత వారం వచ్చిన ఫ్లాపును కొంచెమైనా మరిపించే సినిమాగా ఈవారం సినిమా వుంటుందని ఆశించడం రెగ్యులర్ ప్రేక్షకుల వంతు. ఈ ఏడాది వచ్చిన దారుణాతి దారుణమైన ఫ్లాపులు కూడా కాస్త బెటర్ అనిపించే సినిమా ఈ వారం చూస్తామని ఎవరైనా ఊహిస్తారా? విధి ఎంత బలీయమైనది?
రవితేజ అంటే ఎనర్జీ
రవితెేజ అంటే అల్లరి చిల్లరి డ్యాన్స్ లు
రవితేజ అంటే మాంచి ఫైట్లు
రవితేజ అంటే ఫన్
రవితేజ అంటే మాస్..
రవితేజ అంటే హోల్ సమ్ ఎంటర్ టైన్ మెంట్
కానీ వీటిల్లో ఏ ఒక్కటీ కనిపించని సినిమా రామారావు ఆన్ డ్యూటీ. రామారావు అన్ డ్యూటీ..ఓ థ్రిల్లర్ కు తక్కువ..కమర్షియల్ సినిమాకు ఇంకా తక్కువ…అసలు సినిమాగానే బాగా తక్కువ. ఎందుకలా? అంటే..
దర్శకుడు శరత్ మండవ ఓ కొత్త రకం స్క్రీన్ ప్లే రాస్తున్నా అనుకున్నాడు. సబ్ కలెక్టర్ నుంచి డిమోట్ అయి ఎమ్వారోగా మారిన హీరో రవితేజ (సాధారణంగా సబ్ కలెక్టర్ అంటే ఐఎఎస్..ఎలా డిమోటై ఎమ్మార్వోగా మారాడో శరత్ మండవ కే తెలియాలి) అనుకోకుండా ఓ మిస్సింగ్ కేసు తోక పట్టుకుని లాగడం ప్రారంభిస్తాడు. ఒకరు ఇద్దరు కాదు మిస్ అయింది చాలా అంటే చాలా మంది అని తెలుస్తుంది. దాంతో రెవెన్యూ అధికారి కాస్తా పోలీసు మాదిరిగా పరిశోధన ప్రారంభిస్తాడు. చివరకు ఏం జరిగింది అన్నది మిగిలిన సినిమా.
ఇంతకీ రామారావు డ్యూటీ సినిమాతో సమస్య ఏమిటీ? సినిమాలో పాయింట్ ఓకె. ఎర్రచందనాన్ని శేషాచలం అడవి నుంచి మంగుళూరు పోర్టుకు చేర్చడంలో అడుగుఅడుగునా సాయ పట్టే ఓ పెద్ద పోలీస్ అధికారినే ఓ కన్ సైన్ మెంట్ అంతా దారి మళ్లించి దాచేస్తాడు. కొన్ని వందల కోట్ల విలువైన సరుకు అది. ఈ ప్లాన్ కారణంగా కొంతమందిని చంపేయాల్సి వస్తుంది. ఆ హత్యలు అన్నీ మిస్సింగ్ కేసులుగా మారతాయి. వాటిని పరిశోధించడం మొదలెడితే అసలు విషయాలు అన్నీ బయటకు వచ్చాయి. అదీ కథ.
ఈ కథను కథగా చెప్పుకుంటే బాగానే అనిపిస్తుంది. దీన్ని ఓ మామూలు సినిమాగా తీసి వుంటే బాగుండేదేమో? కేజిఎఫ్ 2, విక్రమ్ స్టయిల్ ఓ ఇంటలెక్చ్యువల్ స్ఖ్రీన్ ప్లే రాసుకోవాలనుకున్నాడు. పోనీ అలా అనుకుంటే అనుకున్నాడు. దానికి రవితేజను హీరోగా ఎందుకు అనుకున్నాడో? విష్వక్ సేన్ నో, అడవి శేష్ నో తీసుకుని వుంటే పెర్ ఫెక్ట్ ఫిట్ అయ్యేవారు కదా. ఓ ధ్రిల్లర్ గా తీసుకునేవాడు కదా. అప్పుడు ఇద్దరు హీరోయిన్ల, ఐటమ్ సాంగ్, డ్యూయట్లు, బోలెడు ఫ్యామిలీ సెట్ అప్, ఎమోషన్లు, సెంటిమెంట్ల రుద్దుడు అన్నీ తప్పేవి..కేవలం సాలిడ్ సినిమా మాత్రం మిగిలేది.
పైగా కమర్షియల్ సినిమా వేరు. థ్రిల్లర్ సినిమా వేరు. ఈ రెండూ కలిపి మిక్చర్ చేయడం అంత సులువు కాదు. రామారావు ఆన్ డ్యూటీకి మూడు కీలక మైనస్ లు. ఒకటి రవితేజ. రెండు తొట్టెంపూడి వేణు. మూడు థ్రిల్లర్ సినిమాకు ఈ తరహా స్క్రిప్ట్ తయారుచేయడం. సినిమా ఆరంభమైన దగ్గర నుంచి అసలు కథలోకి చేరేవరకు బండికి తాడు కట్టిన చందంగా సాగుతుంది సినిమా. ఆరంభంలోనే నీరసం తెప్పించేస్తుంది. సరే, అసలు కథలోకి వెళ్లాక బాగానే వుంటుందేమో అనుకుంటే తొట్టెెంపూడి వేణు అనే మహా నటుడిని వెదికి మరీ తీసుకువచ్చి, నానా కంగాళీ చేసుకున్నారు. సదరు క్యారెక్టర్ నెగిటివ్ నో తెలియదు. పాజిటివ్ నో తెలియదు..కామెడీనో తెలియదు..విలనీయో తెలియదు. పైగా అదో రకం గొంతుతో డబ్బింగ్ ఒకటి.
ఇలా సకల అవలక్షణాలు చోటు చేసుకున్నాయి రామారావు ఆన్ డ్యూటీకి. సినిమా ఆరంభంలో ఆ ఐటమ్ సాంగ్ ఏమిటో? హీరోకి ఆ చిన్న వయసు హీరోయిన్ ఏమిటో? ఆ ఇద్దరు డ్యూయట్ పాడుకుంటుంటే….
ఇంతోటి సినిమాకు మళ్లీ విక్రమ్ మాదిరిగా లాస్ట్ రీల్ లో విలన్ ను రివీల్ చేసి, రెండో భాగం వుందోచ్ అన్న హింట్ ఇవ్వడం కూడానూ. అప్పటికే తల పట్టుకుని ఎప్పుడు సినిమా పూర్తవుతుందా అనే ధోరణిలో వున్న ప్రేక్షకుడు, దాంతో నిలువునా నీరైపోయి, నీరసంగా ఇంటి దారి పడతాడు.
ఇలాంటి సినిమాలో రవితేజను చూస్తే ఆ నీరసానికి కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా వున్నాడు. హుషారుకు మారుపేరైన రవితేజ ఇలా వున్నాడేంటీ అనుకోవడం పక్కా. నటనలో, నడకలో, ఫైట్స్ లో, డ్యాన్స్ ల్లో ఎక్కడా జోష్ అన్నది లేదు. ఇలా అయితే ఇక రవితేజ రిటైర్ మెంట్ నా అన్న దారుణమైన ఆలోచన కూడా ప్రేక్షకుడికి కలిగే ప్రమాదం ఈ సినిమా కలిగిస్తుంది. హీరోయిన్లు ఎందుకో, హీరోకి అంత ఫ్యామిలీ సెటప్ ఏమిటో? అసలు తొలిసగంలో అక్కర్లేని సీన్లు అన్ని ఎందుకో దర్శకుడికే తెలియాలి. అసలు నరేష్, పవిత్రల పాత్రలు తీసేస్తే కథకు ఏమైనా లోపమా? నిర్మాతకు కాస్తయినా డబ్బుులు మిగలడం తప్పించి?
బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బుర్ర మీద బాదేస్తున్నట్లే వుంటుంది. దాన్ని సీన్ ఎలివేషన్ అని అనుకుంటే మ్యూజిక్ డైరక్టర్ కు వంద వందనాలు. సినిమాటోగ్రఫీ ఓకె. సంభాషణలు సగటు కన్నా తక్కువ రేంజ్ లోనే వున్నాయి. ఫన్ అన్న దాన్ని వెదకక్కరలేదు. మొత్తం మీద ఈ ఏడాది వచ్చిన దారుణమైన సినిమాల్లో మొదటి స్థానం కోసం పోటీ పడకుండానే, ఏకగ్రీవంగా గెలుచుకునే సినిమా రామారావు ఆన్ డ్యూటీ.
ప్లస్ పాయింట్ల
సారీ..ఏమీ లేవు
మైనస్ పాయింట్లు
సినిమానే పెద్ద మైనస్
ఫినిషింగ్ టచ్: డిస్మిస్డ్
Rating: 2/5
This post was last modified on July 29, 2022 3:06 pm
ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రిలీజైన అయిదారు నెలల తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోవడం సహజం.…
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వ తీరుపై తన వినూత్న నిరసనతో హాట్ టాపిక్గా మారారు. ఇటీవల…
భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్లో ఫామ్ కోసం ప్రయత్నిస్తూ ఉండగా ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.…
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్య సమస్యల మధ్య కూడా దేశం కోసం తన బాధ్యతలను నిర్వర్తించిన వైనం నిజంగా…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్…
ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో ఉన్న గ్యాప్ను దాదాపు తగ్గించుకునే దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా మోడీ…