Movie Reviews

సమీక్ష…అంటే సుందరానికి

ప్రేమను ఫన్ ను ముడేయచ్చు…అలాగే రొమాంటిక్ ఎమోషనల్ సినిమాలు తీయొచ్చు. కానీ ప్రేమ..ఫన్…ఎమోషన్ ఈ మూడూ కలపాలి అంటే చాలా చాకచక్యం కావాలి. అంతకన్నా ముందుగా అలా తీసి ఒప్పించినా ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారు అన్న ఆలోచన వుండాలి. ఇవన్నీ కాయిన్ కు ఒక వైపు.

ఇవ్వాళ ‘డేటింగ్’ అనే పేరుతో అమ్మాయిలు..అబ్బాయిలు ‘కలిసి పోవడం’ అన్నది కామన్ అయిపోయింది. పెళ్లిళ్లు దేశ సరిహద్దులు దాటేసాయి. ప్రెగ్నన్సీ టెస్ట్ కిట్ లు, కండోమ్ లు చాక్ లెట్ల మాదిరిగా అమ్ముడైపోతున్నాయి. ఇలాంటి ట్రెండ్ నడుస్తుంటే ‘కడుపు రావడం’ ‘కడుపు చేయలేకపోవడం’ అనే పాయింట్లు తీసుకోవడమే ధైర్యం. ఆపైగా ఆ పాయింట్ల చుట్టూనే మూడు గంటల సేపు కథను నడపాలనుకోవడం మరీ ధైర్యం. ఇది కాయిన్ కు మరో వైపు.

ఇలాంటి చిత్రమైన కాయిన్ నే…’ అంటే సుందరానికి…’ సినిమా. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలోని అబ్బాయి… ఆర్థడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీలోని అమ్మాయి..ప్రేమించుకుంటే, ఇంట్లో వచ్చే అడ్డంకులను తప్పించుకోవడం కోసం చెరో అబద్దం ఆడితే, ఆ రెండు అబద్దాలు కలిసి పెద్ద చిక్కుముడిగా మారిపోతే…అదీ అంటే సుందరానికి… కథ.

అంటే సుందరానికి సినిమా ఎలా వుందీ అని అడిగితే సమాధానం చెప్పడానికే ‘అంటే..అంటే..అంటే..’ అంటూ కాస్సేపు తడుముకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వెంటనే చెప్పడం సాధ్యం కాదు కనుక. సినిమాలో కొన్ని ఫన్ మూమెంట్స్ వున్నాయి. కాదనడానికి లేదు. అలాగే మంచి బ్యాక్ గ్రవుండ్ స్కోర్ వుంది. దర్శకుడు రాసుకున్న పేజీలకు పేజీల డైలాగులు వున్నాయి. వాటిలో కొన్ని నవ్వించాయి. మరి కొన్ని ఆలోచించేలా చేసాయి. ఇంకొన్ని తల పట్టుకునేలా మార్చాయి. హీరో నాని తనదైన స్టయిల్ లో నవ్వులు పూయించాడు. కానీ భావొద్వేగాలు, చిక్కుముడులు కూడా కలిసి లెక్కేసుకుంటే ఈ ఫన్ మూమెంట్స్ డయిల్యూట్ అయిపోతాయి.

దాదాపు మూడుగంటల నిడివి వున్న అంటే సుందరాని… రెగ్యులర్ గా సినిమాలు చూసే ఏ ఆడియన్ చేతికి కత్తెరె ఇచ్చినా, ఒకటి రెండు ప్యాచ్ వర్క్ లు చేసి, సినిమా నిడివిని కనీసం 15 నిమషాలు తగ్గించేయగలడు. దానికి పెద్ద ఎడిటింగ్ విద్య అవసరం లేదు. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఓ పక్క ఇంటలెక్చువల్ గా కథ చెప్పే ప్రయత్నం చేస్తూనే, ప్రధాన కథకు అవసరం లేని చాలా అంటే చాలా విషయాలు కథలోకి లాగేసాడు. హీరోయిన్ అక్క వ్యవహారాలు, హీరోయిన్ మొదటి ప్రేమ వ్యవహారం, పదే పదే హర్షతో సిటింగ్ లు, హీరో మోడలింగ్ వ్వవహారాలు, ఇలా చాలా వున్నాయి. అన్నింటికి మించి చైల్డ్ ఎపిసోడ్ ను అంత సేపు చూపించడం, శేఖర్ మాస్టర్ కొడుకు కదా అని చెప్పి ఏకంగా పాటే పెట్టేయడం కూడా.

సినిమా తొలిసగం ఫన్ మూమెంట్స్ ను ఎక్కువగా ఒడిసి పట్టింది. ఓకె అనిపించుకుంది. మలి సగం మాత్రం అటు ఫన్ ను, ఇటు ఎమోషన్ ను బ్యాలన్స్ చేయలేకపోయింది. ప్రతీదీ సవివరంగా చెప్పాలనే రంథిలో పడి లెంగ్త్ ను పెంచేసుకున్నాడు.

ఇలాంటి సినిమాలో హీరో గా నానికి నూటికి నూరు మార్కులు పడిపోతాయి. కానీ హీరోయిన్ గా నజ్రియాను కోరి తెచ్చుకున్నారు. కానీ గ్లామరస్ హీరోయిన్ గా మాత్రం అనిపించదు. మార్కులు తెచ్చుకోదు. గెస్ట్ గా కనిపించిన అనుపమ బాగుంది. నరేష్, రోహిణిల నటన బాగుంది.

సినిమా టెక్నికల్ గా చూసుకుంటే వివేక్ సాగర్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది. కానీ ఒక్క పాట కూడా సరిగ్గా చేయలేకపోయారు. దర్శకుడు రాసుకున్న సంభాషణలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఓకె.

మొత్తం మీద చిన్న పాయింట్ ను పట్టుకుని, కావాల్సినన్ని, అక్కరలేనన్ని చిక్కుముడులు వేసి, మేధావితనం రంగరించి, కొత్తగా చెప్పాలని ప్రయత్నించి, ఆ ప్రయత్నంలో కొంత వరకు విజయం సాధించిన సినిమా…’అంటే సుందరానికి..’

ప్లస్ పాయింట్లు

ఫన్ సీన్లు

డైలాగులు

నేపథ్యసంగీతం

మైనస్ పాయింట్లు

సాగదీత

లెంగ్త్

ఫినిషింగ్ టచ్: అంటే..ఫన్ విత్ ఎమోషన్

Rating: 3/5

This post was last modified on June 10, 2022 3:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కందుల దుర్గేశ్ రూటే సెపరేటు!

జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నిజంగానే విభిన్న పంథాతో సాగే నేత. ఇప్పటిదాకా…

2 hours ago

టీడీపీ – జ‌న‌సేన‌ల‌కు.. వ‌క్ఫ్ ఎఫెక్ట్ ఎంత‌..!

ఏపీలో అధికార కూట‌మి మిత్ర ప‌క్షాల మ‌ధ్య వ‌క్ఫ్ బిల్లు వ్య‌వ‌హారం.. తేలిపోయింది. నిన్న మొన్న‌టి వ‌రకు దీనిపై నిర్ణ‌యాన్ని…

4 hours ago

అభిమానులను తిడితే సినిమా హిట్టవుతుందా

హెడ్డింగ్ చూసి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా. నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా భార్య వార్దా ఖాన్ వరస చూస్తే మీకూ…

4 hours ago

ఎస్ఎస్ఎంబి 29 – సీక్వెల్ ఉంటుందా ఉండదా

టాలీవుడ్ కే కాదు మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఇప్పటికే…

4 hours ago

టీడీపీలో కుములుతున్న ‘కొన‌క‌ళ్ల’.. ఏం జ‌రిగింది ..!

మ‌చిలీప‌ట్నం మాజీ ఎంపీ, టీడీపీ సీనియ‌ర్ నేత కొన‌క‌ళ్ల నారాయ‌ణరావు.. త‌న యాక్టివిటీని త‌గ్గించారు. ఆయ‌న పార్టీలో ఒక‌ప్పుడు యాక్టివ్…

5 hours ago

ఆల్ట్ మన్ ట్వీట్ కు బాబు రిప్లై… ఊహకే అందట్లేదే

టెక్ జనమంతా సింపుల్ గా శామ్ ఆల్ట్ మన్ అని పిలుచుకునే శామ్యూల్ హారిస్ ఆల్ట్ మన్… భారత్ లో…

6 hours ago