Movie Reviews

సమీక్ష..డిఙె టిల్లు

రెగ్యులర్ సినిమాలు చేస్తాం అంటే ఙనాలు థియేటర్ కు వచ్చే రోఙులు కావు ఇవి. అలా అని కొత్త కథలు ఎక్కడ నుంచీ పుట్టుకురావు. కథ ఎలా వున్నా, కథనాన్నో, క్యారెక్టర్ నో వైవిధ్యంగా తీర్చి దిద్దితే చాలు ప్రేక్షకులు ఖుషీ అయిపోతారు. కానీ ఇక్కడ సబ్ఙెక్ట్ టు కండిషన్ ఏమిటంటే ఫన్ మిస్ కాకూడదు. ఈ థియరీని బాగానే వంట పట్టించుకుని తీసినట్లుంది ఈవారం విడుదలయిన డిఙె టిల్లు.

ఇప్పటి వరకు బిగ్ స్క్రీన్ మీద పెద్దగా నోటెడ్ కాని సిద్దు ఙొన్నలగడ్డ వన్ మాన్ షో ఇది. ఈ సినిమాతో తనేంటో, తన రైటింగ్ స్కిల్స్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు సిద్దు. తన కోసమే అచ్చంగా ఓ టయిలర్ మేడ్ క్యారెక్టర్ ను తయారు చేసుకున్నాడు. దాని చుట్టూ చిన్న కథ అల్లుకున్నాడు. కథేమీ పెద్దగా కొత్తది కాదు. అలాగే ఒక ఫుల్ లెంగ్త్ సినిమాకు సరిపడా నిడివి వున్నదీ కాదు. కానీ రెండు గంటల పాటు ప్రేక్షకులను సిద్దు తన స్టయిల్ ఆఫ్ యాక్టింగ్ తో, అవుట్ ఆఫ్ ది బాక్స్ డైలాగులతో కూర్చోపెట్టాడు ప్రేక్షకులను.

సికిందరాబాద్, హైదరాబాద్ గల్లీల్లో కనిపించే చిచ్చోరా పోరగాళ్ల టైపు క్యారెక్టర్ ఒకటి రాసుకున్నాడు. అదే హీరో పాత్ర. పండగలు, పెళ్లి పేరంటాల్లో డిఙే వాయిస్తుంటాడు బాలగంగాధర్ తిలక్. అలియాస్ టిల్లు. అలాంటి వాడికి పరిచయం అవుతుంది రాధిక (నేహా శెట్టి). ఆమెకు అప్పటికే ఓ బాయ్
ఫ్రెండ్ వుంటాడు. కానీ అతగాడు ఈమె వున్నా కూడా మరో అమ్మాయితో సన్నిహితంగా వుంటాడు. అలాంటి నేపథ్యంలో రాధిక సిన్సియర్ గానే టిల్లుకు దగ్గరవుతుంది. కానీ ఈ విషయం కనిపెట్టేసిన ఆమె బాయ్ ఫ్రెండ్ ఘర్షణకు దిగుతాడు. ఆ సమయంలో రాధిక బలంగా నెట్టడంతో అతగాడు చనిపోతాడు.ఈ కేసులో ఇరుక్కుంటాడు టిల్లు. దాంతో ఇద్దరు కలిసి శవాన్ని మాయం చేస్తారు. అది చూసి ఓ తాగుబోతు బ్లాక్ మెయిల్ చేస్తాడు. వాడిని వదిలించుకుందాం అనుకంటే ఓ పోలీసుకు దొరికిపోతారు. ఇలా రకరకాల మలుపులు తిరిగిన కథ చివరకు ఎక్కడకు చేరిందన్నది సినిమా.

డిఙె టిల్లు ఎత్తుకోవడంతోనే ఫన్ రైడ్ స్టార్ట్ చేస్తుంది. సిద్దు స్వయంగా రాసుకున్న మాటలు ప్రేక్షకులను బలంగా ఆకట్టుకుంటాయి. అతని వేషం, మాటలు, కాస్త శృంగార సన్నివేశాలు, అన్నీ కలిసి సినిమా తొలిసగాన్ని నూటికి నూరు మార్కులతో పాస్ చేయించేస్తాయి. కానీ ద్వితీయార్థం వచ్చేసరికి ఈ వేగం కాస్త నెమ్మదిస్తుంది. స్క్రిప్ట్ లో రాసుకున్న ఆసుపత్రి సీన్లు సినిమాను వేగానికి గట్టి బ్రేక్ లు వేస్తాయి. అక్కడ డాక్టర్ గా వెన్నెల కిషోర్ లాంటి వాళ్లను తీసుకుని వుంటే మరోలా వుండేది. పూర్తిగా న్యూ ఫేస్ ను తీసుకోవడం కూడా సమస్య అయింది. పైగా తొలిసగంలో వున్న హుషారుకు, రొమాన్స్ కు మలి సగంలో అస్సలు చాన్స్ వుండదు. పూర్తిగా కథ మీద వెళ్లాల్సి వస్తుంది. కానీ సినిమా ప్రీ క్లయిమాక్స్ లో కోర్టు సీన్ కు వచ్చేసరికి మళ్లీ టర్న్ తీసుకుంటుంది. ఫస్ట్ హాఫ్ అంత ఙోష్ లేపకపోయినా, అప్పటి వరకు ఆవరించిన కాస్త డల్ నెస్ ను పక్కకు తీసేస్తుంది. ఆ తరువాత చిన్న ఫన్ నోట్ తో సినిమా సింపుల్ గా ముగిసిపోతుంది. ఈ క్లయిమాక్స్ కూడా కొంత మందికి అంతగా రుచించకపోవచ్చు. కానీ ఫరవాలేదు. ఎందుకంటే మర్డర్ లో హీరోయిన్ తప్పు లేదు అని ప్రేక్షకులకు తెలుసు. కానీ ఆమె అన్యాయంగా ఙైల్లోనే వుండిపోవాల్సి రావడం కరెక్ట్ కాదేమో?

సినిమాకు ముందే చెప్పుకున్నట్లు సిద్దునే అంతా. అతగాడి బాడీ లాంగ్వేఙ్, ఆటిట్యూడ్, మాటలు అన్నీ కలసి సినిమాను నిలబెట్టేసాయి. రొటీన్ గా వినిపించే డైలాగులకు బదులు, కాస్త కొత్త ఫ్రేఙ్ లు, పదాలు వినిపించాయి. విఙయ, విష్వక్ సేన్, నవీన్ ల మాదిరిగా సిద్దు కూడా తనకు ఓ స్టయిల్ సెట్ చేసుకున్నాడు. కానీ అది ఏ మేరకు కంటిన్యూ అవుతుందో చూడాలి. నేహాశెట్టి రొమాన్స్ సీన్లలో బాగుంది. మిగిలిన సీన్లలో ఙస్ట్ అలా ఓ ప్రాపర్టీలా నిల్చుంది. బ్రహ్మాఙీ, నర్రా శ్రీను, మిగిలిన సపోర్టింగ్ క్యారెక్టర్లు ఓకె. నిఙానికి హీరో..హీరోయిన్లు అంటే అత్యంత మంచి వాళ్లు, పరమ పవిత్రులు అన్న కాన్సెప్ట్ మెల్లగా మాయం అవుతోంది. నెగిటివ్ షేడ్ లు వున్న లీడ్ క్యారెక్టర్లను తీసుకుని కథలు అల్లడం మొదలైంది.

సినిమాకు టైటిల్ సాంగ్ భయంకరమైన ఫ్లస్. కానీ అది ఆరంభంలోనే ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది. ఆ రేంఙ్ కాకున్నా మరో హిట్ సాంగ్ వుంటే ఇంకా బాగుండేది. థమన్ ఇచ్చిన ఆర్ఆర్ బాగుంది. చిన్న సినిమా అయినా సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.

సెకండాఫ్ స్క్రిప్ట్ మీద మరి కాస్త శ్రద్ద పెట్టి వుంటే ఓ బ్లాక్ బస్టర్ సినిమా అయివుండేది డిఙె టిల్లు

ప్లస్ పాయింట్లు

ఫస్ట్ హాఫ్

సిద్దు ఆటిట్యూడ్, మాటలు

మైనస్ పాయింట్లు

ద్వితీయార్థం

క్లయిమాక్స్.

ఫినిషింగ్ టచ్: మాటలతో వాయించేసాడు

Rating: 2.75/5

This post was last modified on February 12, 2022 1:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

8 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

11 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

12 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

12 hours ago

నిర్మ‌ల‌మ్మ ఎఫెక్ట్‌: ‘పాప్ కార్న్‌’పై ప‌న్ను పేలుడు!

కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలోని జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాల‌క్షేపానికి తినే…

13 hours ago