Movie Reviews

సమీక్ష – రాజ రాజ చోర

కొత్త తరహా కథలు తెరపైకి రావాలంటే కొత్త ఆలోచనలు చేసే దర్శకులు వుండాలి. వాటిని ప్రోత్సహించే నిర్మాతలు రావాలి. వాటిని టేకప్ చేయగల హీరోలు దొరకాలి. ఈ మూడూ కలిస్తే రాజ రాజ చోర అనే సినిమా తయారవుతుంది. శ్రీవిష్ణు మొదటి నుంచీ వైవిధ్యమైన సినిమాలు చేస్తూనే వస్తున్నాడు. హిట్ నా..ఫ్లాప్ నా అని చూడడమే లేదు. అందుకే ఈ సినిమా కూడా చేయగలిగాడు. కథగా చెబితే ఈ సినిమాను మరే హీరో ధైర్యంగా టేకప్ చేయగలిగి వుండేవాడు కాదు. అది వాస్తవం. పైగా కొత్త దర్శకుడు చెబితే. ఎందుకంటే సినిమాలో హీరో పాత్రకు పూర్తిగా నెగిటివ్ షేడ్ లు వుంటాయి. హీరోకే కాదు, ఇద్దరు హీరోయిన్లకు కూడా. హీరో పది రూపాయల కోసం కూడా మోసం చేసే రకం. ఓ హీరోయిన్ భర్తను బాధపెట్టి, బెదిరించి మరీ చదువుకోవాలనే తన కోర్కె నెరవేర్చుకునే రకం. మరో హీరోయిన్ తల్లికి తెలియకుండా సేల్స్ గర్ల్ గా పని చేస్తూ, హీరో తో ప్రేమలో పడి పక్క మీద వరకు వెళ్లిపోతుంది. చిన్నపిల్లాడు అయిన హీరో కొడుకు కూడా తండ్రి కొన్న బొమ్మల వ్యవహారం తల్లికి తెలియనివ్వడు.

ఇలాంటి పాత్రలు అన్నింటితో అల్లుకున్నకథేంటీ అంటే…భాస్కర్ (శ్రీవిష్ణు) ఓ జిరాక్స్ దుకాణంలో పని చేస్తుంటాడు. భార్య (సునయన) కొడుకు వుండగా, వేరే అమ్మాయి (మేఘ)తో సాప్ట్ వేర్ ఇంజినీర్ అని చెప్పి ప్రేమ వ్యవహారమే కాదు, పడక వ్యవహారం కూడా పెట్టకుంటాడు. భార్య చదువు, ఇంటి ఖర్చుల కోసం దొంగతనాలు చేస్తుంటాడు. క్వశ్చన్ పేపర్లు లీక్ చేస్తుంటాడు. ఆఖరికి తను పనిచేసే దుకాణంలో పది రూపాయలకు కూడా కక్కుర్తి పడుతుంటాడు. ఇలాంటి నేపథ్యంలో పోలీస్ ఇన్ స్పెక్టర్ (రవిబాబు)కు చిక్కుతాడు. అక్కడి నుంచి భాస్కర్ వ్యవహారాలు అన్నీ భార్యకు, ప్రియురాలికి కూడా తెలిసిపోతూ వుంటాయి. అది చాలక పోలీస్ చేతిలో పావుగా మారి మరిన్ని దొంగతనాలు చేయాల్సి వస్తుంది. ఇలా చిక్కుకుపోయిన విషయాలు అన్నీ ఎలా ముడివిడ్డాయి అన్నది మిగిలిన సినిమా.

రాజరాజచోర సినిమాలో ప్లస్ పాయింట్లు మూడింటి గురించి ముందుగా మాట్లాడేసుకుందాం. సినిమాకు ఫస్ట్ ప్లస్ కథ అల్లిక. ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా, జంప్ లు లేకుండా కథను అల్లుకుడున్నాడు దర్శకుడు హసిత్ గోలి. కథలో సంఘటనలు అన్నీ పక్కాగా గొలుసు కట్టుగా అల్లుకున్నాడు. ఎక్కడా లింక్ తెగినట్లు కానీ, లింక్ దాచినట్లు కానీ ఏమీ వుండదు. కామన్ ఆడియన్ ఎక్కడా బుర్ర చించుకుని బద్దలు కొట్టుకోనక్కరలేదు. పైగా సీన్ టు సీన్ ముడి పడుతూ వుంటే ప్రేక్షకుడు హుషారవుతాడు. ఈ తరహా వ్యవహారం సినిమాకు పెద్ద ప్లస్.

ఇక రెండో ప్లస్ పాయింట్ ఏమిటంటే హీరో శ్రీవిష్ణు. శ్రివిష్ణు చూపులు, ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ అన్నీ ఇలాంటి క్యారెక్టర్ కు పక్కా సరిపోతాయి. అతగాడు కాక మరెవరు చేసినా సినిమా ఇలా వుండేది కాదు. ఇక మూడో పాయింట్ డైలాగ్ వెర్షన్. డైలాగుల్లో ప్రతిభా పాటవ ప్రదర్శన చేయడానికి కానీ, సెంటిమెంట్ రంగరించి పోయడానికి కానీ, కామెడీ కుమ్మేయడానికి కానీ దర్శకుడు కిందా మీదా అయిపోలేదు. ఎంతవరకు రాయాలో అంతే రాసాడు. ఇలా ఈ మూడు ప్లస్ పాయింట్ల వల్లే సినిమాకు పాజిటివ్ లుక్ వచ్చేసింది.

ఇక ఇప్పుడు నెగిటివ్ పాయింట్లు గురించి మాట్లాడుకుందాం. దర్శకుడు ఈ కథను స్క్రీన్ మీదకు ఇలా తేవాలి అని అనుకున్నాడు కాబట్టి అలాగే తీసాడు. కానీ ఈ తీయడంలో కాస్త నస లేదా సాగదీత అన్నది చొరబడింది అన్నది నికార్సయిన వాస్తవం. అదీ ముఖ్యంగా ద్వితీయార్థంలో. సినిమా తొలిసగం ఒక్కో సీన్ ను అల్లుకుంటూ, ఓ పగడ్బందీ పాయింట్ దగ్గర హీరోకి, విలన్ కు, మరో క్యారెక్టర్ కు ఒకేసారి నిజాలు వెల్లడి చేయడం అనే బ్లాస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చాడు. అక్కడి వరకు బాగానే వుంది.

కానీ ఇంత వైవిధ్యంగా క్యారెక్టర్లు, కథ, నడక అల్లుకున్నదర్శకుడు ద్వితీయార్థంలోకి వెళ్లే సరికి మళ్లీ కొంత పాత తరహా పాయింట్లను, సినిమాటిక్ సీన్లను నమ్ముకున్నాడు. పోలీస్ చేతిలో ఇరుక్కుని దొంగతనాలు కంటిన్యూ చేయడం అన్నది పాత పాయింట్. అక్కడి నుంచి అంతా పాత నెరేషన్.కానీ దొంగను వాడేసుకుని తెలివిగా ఇరికిద్దాం అన్న పోలీస్ బ్రెయిన్ కొత్త పాయింట్. ఆ పాయింట్ చెప్పడం కోసం అంత నిడివి నడపడం ప్రేక్షకుడికి కాస్త ఇబ్బందే. అలాగే సినిమాలో ప్రతి పాత్రను వీలయినంత పాజిటివ్ నోట్ తో ముగించాలనుకోవడం కోసం మరి కొన్ని అదనపు సీన్లు, పాయింట్లు తయారుచేసుకోవాల్సి వచ్చింది. దాని వల్ల కూడా నిడివి పెరిగింది. ఇవన్నీ ద్వితీయార్థలోనే చోటు చేసుకోవడంతో, తొలిసగం కన్నా మలి సగానికి మార్కలు తక్కువ పడతాయి.. సినిమా కథ లో జోక్యం చేసుకునేలా తనికెళ్ల భరణి లేదా మరో మహిళ చేత చేయించిన పురాణకాలక్షేపాలు కాస్త ఎక్కువే అడ్డం పడతాయి.

శ్రీవిష్ణుతో పాటు సునయిన కూడా మంచి రిమార్కులు అందుకుంటుంది. ఒక్క సీన్ తో అజయ్ ఘోష్ పాత్ర ప్లస్ అయిపోతుంది. మేఘా ఆకాష్ ఒకె. సినిమాకు వైవిధ్యమైన నేపథ్య సంగీతం అందించారు. ఫొటోగ్రఫీ ఒకె. నిడివి, కాస్త సాగదీత లాంటి విషయాలు క్షమించేస్తే రాజరాజచోర సినిమాను చూసేయచ్చు.

ప్లస్ పాయింట్లు
కథ అల్లిక
శ్రీవిష్ణు

మైనస్ పాయింట్లు
నిడివి
ద్వితీయార్థం

ఫినిషింగ్ టచ్: రాజు దొంగ..దొంగ రాజు

Rating: 3/5

సూర్య

This post was last modified on August 19, 2021 4:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాగ్ అశ్విన్‌ను డిప్రెషన్లోకి నెట్టిన ‘ఇన్సెప్షన్’

డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న…

4 hours ago

ఎన్టీఆర్ జిల్లాలో స్పోర్ట్స్ సిటీ.. నది తీరాన అత్యంత భారీగా..

ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంగా భారీ క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కృష్ణా నది…

4 hours ago

ట్రంప్ టారిఫ్ లను తట్టుకున్న ఏకైక మార్కెట్ మనదే..

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి భారత స్టాక్ మార్కెట్ బయటపడిన మొదటి మార్కెట్‌గా…

5 hours ago

లాభం లేదబ్బాయ్….రూటు మార్చెయ్

హాస్య నటులు హీరోలు కావొచ్చేమో కానీ యాంకర్లు కథానాయకులుగా వెలుగొందటం అంత సులభం కాదు. నాలుగేళ్ల క్రితం ప్రదీప్ మాచిరాజు…

5 hours ago

అంతరిక్షంలో ప్రయాణం.. టికెట్ ధర ఎంతంటే?

ప్రముఖ అమెరికన్ గాయని కేటీ పెర్రీ ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆమె మరో ఐదుగురు మహిళలతో కలిసి…

5 hours ago

దేశంలో తొలిసారిగా మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేయనున్న రోబో

మ్యాన్‌హోల్‌లోకి దిగుతూ ప్రాణాలు కోల్పోయే పారిశుద్ధ్య కార్మికుల ఘటనలు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ…

6 hours ago