Movie News

త్వరగా తేల్చవయ్యా తండేల్

నాగచైతన్య తండేల్ విడుదల తేదీ తాలూకు డోలాయమానం కొనసాగుతోంది. నితిన్ రాబిన్ హుడ్ డిసెంబర్ 20 ప్రకటించారు కాబట్టి ఇది కూడా అదే డేట్ కి రావొచ్చనే ఊహాగానాలు పరిశ్రమలో బలంగా రేగాయి. కానీ దానికి భిన్నంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

అప్పటికంతా పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి ఫస్ట్ కాపీ సిద్ధం చేసే పరిస్థితి లేదని దర్శకుడు చందూ మొండేటి చెప్పడం వల్లే అనౌన్స్ మెంట్ ఆగిపోయిందని ఇంకో టాక్ ఉంది. తాజాగా తండేల్ 2025 సంక్రాంతికి వస్తోందనే వార్త రావడంతో ఒక్కసారిగా అక్కినేని అభిమానులు యాక్టివేట్ అయిపోయి ట్రెండింగ్ చేయడం మొదలుపెట్టారు.

ఇటీవలే బన్నీ వాస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తండేల్ ని ఎక్కువ కాలం హోల్డ్ చేసే పరిస్థితి లేదని ఈ ఏడాది చివరిలో లేదా జనవరిలో ఖచ్చితంగా రిలీజ్ చేయాలని అన్నారు. ఆ మాట ప్రకారం చూసుకుంటే క్రిస్మస్ లేదా సంక్రాంతి రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి.

అయితే గేమ్ ఛేంజర్, బాలయ్య 109, వెంకటేష్ – అనిల్ రావిపూడి చిత్రం, సందీప్ కిషన్ మజాకాలు అధికారికంగా రేసులో ఉండగా తండేల్ లాంటి కంటెంట్ ఉన్న మూవీకి థియేటర్ల పరంగా ఇబ్బందులు రావొచ్చు. గీతా ఆర్ట్స్ కు ఎంత నెట్ వర్క్ ఉన్నా కాంపిటీషన్ లో ఉన్న నిర్మాతలు తక్కువైనోళ్లు కాదు.

సరే బాగుంటే మూడు నాలుగు సినిమాలు సులభంగా ఆడతాయి కాబట్టి తండేల్ సంక్రాంతికే వస్తుందని అనుకున్నా ముందైతే వీలైనంత త్వరగా తేల్చి చెప్పడం బెటర్. ఎందుకంటే దానికి అనుగుణంగా ప్రమోషన్లు మొదలుపెట్టాల్సి ఉంటుంది. వరస డిజాస్టర్లతో డీలా పడ్డ చైతు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు.

శారీకరంగా శ్రమ తీసుకోవడంతో పాటు హెయిర్ స్టైల్ నెలల తరబడి అలాగే మెయిటైన్ చేస్తున్నాడు. సాయిపల్లవితో రెండోసారి జత కట్టడం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం లాంటి ఆకర్షణలు ఇందులో బోలెడున్నాయి. ఎక్కువ సస్పెన్స్ లేకుండా కుండ బద్దలు కొట్టమని చైతు ఫ్యాన్స్ డిమాండ్.

This post was last modified on October 15, 2024 4:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లోకేశ్ లోని చతురతను వెలుగులోకి తీసుకొచ్చిన ఇంటర్వ్యూ

ఒక రాజకీయ నేత సమర్థతను.. అంశాల మీద.. ప్రజా సమస్యల మీద అతడికున్న అవగాహనతో పాటు.. రాజకీయ చతురత ఎంతన్న…

1 hour ago

క్రాష్ టెస్టులో 5 పాయింట్లు కొల్లగొట్టిన టాటా కొత్త కారు

ఒక కారు మంచిదా? చెడ్డదా? అన్న దానికి సాంకేతిక అంశాలు ఎంత ముఖ్యమో.. అలానే క్రాష్ టెస్టులో సదరు కారుకు…

2 hours ago

గాంధీ ఫ్యామిలీలోనే కాదు పార్లమెంటులోనూ రేర్ సీన్

అంచనాలు నిజమయ్యాయి. లెక్క వేసుకున్నట్లే.. కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన రాహుల్ గాంధీ సోదరి వాద్రా ఎన్నికల బరిలోకి దిగారు. తాజాగా…

3 hours ago

పొరపాటు ఎక్కడ జరిగింది సుహాస్

రెగ్యులర్ మూసకు దూరంగా కొంచెం భిన్నమైన కథలను ఎంచుకుంటాడని పేరున్న సుహాస్ కు తాజా రిలీజ్ జనక అయితే గనక…

6 hours ago

పుష్ప 2 రచ్చకు రంగం సిద్ధమవుతోంది

ముందు ప్రకటించినట్టు డిసెంబర్ 6 కాకుండా ఒక రోజు ముందు డిసెంబర్ 5 పుష్ప పార్ట్ టూ ది రూల్…

16 hours ago

సినిమా టికెట్ ధరలు – ఏది తప్పు ఏది ఒప్పు

ఇండస్ట్రీలో, సామాన్యుల్లో సినిమా టికెట్ రేట్ల గురించి చర్చ జరగడం కొత్తేమి కాదు. పెద్ద హీరోలతో ప్యాన్ ఇండియా మూవీస్…

18 hours ago