Movie News

పొరపాటు ఎక్కడ జరిగింది సుహాస్

రెగ్యులర్ మూసకు దూరంగా కొంచెం భిన్నమైన కథలను ఎంచుకుంటాడని పేరున్న సుహాస్ కు తాజా రిలీజ్ జనక అయితే గనక ఆశించిన ఫలితం ఇవ్వలేదని కలెక్షన్లు స్పష్టం చేస్తున్నాయి. టాక్ పర్వాలేదనే వచ్చింది. విశ్వం, మా నాన్న సూపర్ హీరో కన్నా దీనికే మంచి రేటింగ్స్ వచ్చాయి.

వేట్టయన్ రజని డబ్బింగ్ మూవీ కాబట్టి పోల్చలేం కానీ దసరా లాంటి హాలిడే సీజన్ లో సుహాస్ సినిమా ఎలాంటి ప్రభావం చూపించకపోవడం విచిత్రమే. దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల గతంలో సలార్ లాంటి బ్లాక్ బస్టర్లకు ప్రశాంత్ నీల్ తో పని చేసిన అనుభవమున్నా డెబ్యూతో సూపర్ హిట్ అందుకోలేకపోయాడు.

సుహాస్ ఎక్కడ పొరపాటు జరుగుతోందో అర్థం చేసుకోవాలి. వినే పాయింట్ లో క్రియేటివిటీ కన్నా దాన్ని సమర్ధవంతంగా తెరకెక్కించే ప్రతిభ డైరెక్టర్లలో పూర్తి స్థాయిలో లేకపోవడం వల్లే తనకు యావరేజ్ లేదా ఫ్లాప్ ఫలితాలు దక్కుతున్నాయి. ప్రసన్నవదనంలో ఉన్నది ఎవరూ టచ్ చేయని బ్యాక్ డ్రాప్.

అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ కోసం ఏకంగా గుండు కొట్టించుకోవడానికి వెనుకాడలేదు. పాత్ర నచ్చడం వల్ల లెన్త్ చూసుకోకుండా శ్రీరంగనీతులుకి ఒకే చెప్పాడు. టైటిల్ ఒక జంతువు మీద పెట్టినా వెరైటీగా ఉందనే ఆలోచనతో గొర్రె పురాణం ఒప్పుకున్నాడు. ఒకటి మినహాయించి ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద తుస్సుమన్నవే.

ఇలా వరస ఫెయిల్యూర్స్ వల్ల సుహాస్ కు ఓపెనింగ్స్ కరువవుతున్నాయి. జనక అయితే గనకకు దిల్ రాజు లాంటి బడా నిర్మాత అండగా నిలబడ్డా ప్రయోజనం లేకపోయింది. మరో బలగం లేదా బొమ్మరిల్లు అవుతుందనే ఆయన స్టేట్ మెంట్ నిజం కాలేదు.

ఓవర్సీస్ హక్కులు కొన్న సుహాస్ కు అక్కడ డీసెంట్ వసూళ్లే దక్కాయి కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం జనాలు సారీ జనక అనేశారు. రాబోయే వాటిలో కేబుల్ రెడ్డి, ఆనందరావు అడ్వెంచర్స్, ఉప్పు కప్పురంబు ఉన్నాయి. రైటర్ పద్మభూషణ్, కలర్ ఫోటో స్థాయిలో మరో హిట్టు అందుకుంటే తిరిగి ట్రాక్ లో పడొచ్చు. స్పీడ్ తగ్గించే పనిలో ఉన్న సుహాస్ కు ఏది బ్రేక్ ఇస్తుందో చూడాలి.

This post was last modified on October 15, 2024 4:50 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

1 hour ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

2 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

2 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

3 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

3 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

3 hours ago