కెజిఎఫ్ ప్రభావం వల్ల దాన్ని స్ఫూర్తితో కోట్ల రూపాయలతో అలాంటి సినిమాలు తీసి ఏదో నిరూపించాలని తాపత్రయపడి చేతులు కాల్చుకుంటున్న శాండల్ వుడ్ నిర్మాతల సంఖ్య పెరిగిపోతోంది. ప్రొడ్యూసర్లు సైతం మార్కెట్ ని విశ్లేషించుకోకుండా, ముందు వెనుక చూసుకోకుండా డబ్బు మంచి నీళ్లలా ఖర్చు పెట్టడంతో కనీసం పెట్టుబడి సైతం వెనక్కు రాక లబోదిబోమంటున్నారు. గత ఏడాది కబ్జా దీనికి బోణీ చేయగా తాజాగా మార్టిన్ దాన్ని మరిపించే రీతిలో అల్ట్రా డిజాస్టర్ మూటగట్టుకుంది. వీటికి ఉపేంద్రకు సంబంధం ఏంటనే పాయింట్ కొద్దాం. ఉప్పి కొత్త మూవీ యుఐ డిసెంబర్ 20 విడుదల కానుంది.
ఇప్పటిదాకా ప్రేక్షకులు సినిమాలు చూసి వాటికి హిట్టు ఫ్లాపు అని ముద్ర వేశారని, కానీ యుఐ మాత్రం ఆడియన్స్ మీద తీర్పు ఇవ్వబోతోందనే వెరైటీ క్యాప్షన్లతో ప్రమోషన్లు మొదలుపెట్టారు. గతంలో వచ్చిన టీజర్, పాటలు చూస్తే ఉపేంద్ర ఈసారి దర్శకుడిగా హీరోగా చాలా కొత్త ప్రయోగం చేసినట్టు కనిపిస్తోంది. ట్రెండీగా ఉన్నప్పటికీ అన్ని వర్గాలను మెప్పించేలా తీస్తాడా అనే అనుమానం లేకపోలేదు. ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం స్పష్టంగా ఉంది. కానీ కబ్జా, మార్టిన్ దెబ్బకు కన్నడ భారీ బడ్జెట్ సినిమాలంటే ఇతర బాషల బయ్యర్లు భయపడే పరిస్థితి వచ్చింది.
అందులోనూ ఉపేంద్రకు సైతం తెలుగు, తమిళంలో మార్కెట్ తగ్గిపోయింది. ఒకప్పుడు మాస్ ఓపెనింగ్స్ వచ్చేవి కానీ తర్వాత కనీసం డబ్బింగులు చేయడం కూడా మానేశారు. యుఐ పూర్వ వైభవం తెస్తుందని నిర్మాతలు హామీ ఇస్తున్నారు కానీ అది ఎంత మేరకు నెరవేరుతుందో చూడాలి. అసలు సవాల్ మరొకటి ఉంది. ఈ సినిమాతో పాటు అదే రోజు విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2, నితిన్ రాబిన్ హుడ్ వస్తున్నాయి. చైతు తండేల్ రిలీజయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ముఫాసా లయన్ కింగ్ భారీ ఎత్తున్న తీసుకొస్తున్నారు. ఇంత తీవ్రమైన పోటీ మధ్య ఉపేంద్ర గెలిచి చూపించాలి.
This post was last modified on October 15, 2024 3:12 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…