దిల్ రాజు సినిమా నిర్మాణంలోకి రాక ముందు కేవలం డిస్ట్రిబ్యూటర్ గానే కొనసాగిన విషయం తెలిసిందే. అయితే మొదట్లో ఊహించని దెబ్బతిన్న ఆయనను మళ్ళీ ఒక ట్రాక్ లో నిలబెట్టిన సినిమా తొలిప్రేమ. ఈ సినిమాతో దిల్ రాజు ఒక్కసారి కాదు, చాలాసార్లు లాభపడ్డారు. ఏదైనా సినిమాతో నష్టం వస్తే అప్పట్లోనే మళ్ళీ తొలిప్రేమను రీ రిలీజ్ చేసి ప్రాఫిట్స్ అందుకున్నారు. ఆ విషయాన్ని మొన్నటి తొలిప్రేమ సిల్వర్ జూబ్లీ మీట్ లో ఆయనే స్వయంగా తెలిపారు.
తొలిప్రేమ విజయాన్ని దిల్ రాజు అంత ఈజీగా మర్చిపోలేదు. ఇక ఆ చిత్ర దర్శకుడు కరుణాకరన్ తో ఆయనకి మంచి సాన్నిహిత్యం ఉంది. కానీ ఎప్పుడూ కూడా సినిమా చేసే సందర్భం రాలేదు. అయితే ప్రస్తుతం ఆ దర్శకుడి పరిస్థితి బాలేదు. దీంతో రాజుగారు ఛాన్స్ ఇవ్వడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఆశిష్ రెడ్డి కోసమే ఒక కథను సిద్ధం చేయిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ కాంబినేషన్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే దర్శకుడు కరుణాకరన్ మంచి హిట్టు కొట్టి చాలా కాలమైంది. అప్పుడెప్పుడో 2010లో ప్రభాస్ తో చేసిన డార్లింగ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత ఎందుకంటే ప్రేమంట – చిన్నదాన నీకోసం – తేజ్ ఐ లవ్ యు.. వంటి సినిమాలు చేశాడు. అయితే ఆ మూడు కూడా డిజాస్టర్ అయ్యాయి. 2018 తరువాత ఏ నిర్మాత కూడా కరుణాకరన్ తో సినిమా చేసేందుకు ముందుకు రాలేదు. కానీ దిల్ రాజు మాత్రం కరుణాకరన్ మీద నమ్మకంతో కథ సిద్ధం చేసుకోమ్మని ఒక అవకాశం అయితే ఇస్తున్నాడు. గత ఏడాది నుంచి వీరి మధ్య చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక కథ ఫైనల్ అయితే త్వరలోనే అఫీషియల్ అప్డేట్ ఇవ్వాలని చూస్తున్నారు.
This post was last modified on October 14, 2024 11:59 pm
ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…
ఆస్కార్ అవార్డుల్లో ఆధిపత్యం చలాయించే అన్ని సినిమాలకూ వసూళ్లు వస్తాయని గ్యారెంటీ లేదు. అలాగే వసూళ్ల మోత మోగించిన చిత్రాలకూ…