దర్శకుడు సుకుమార్ పుష్ప 2తో ఎలాంటి కిక్ ఇస్తాడో గాని, ఆ సినిమాకు వర్క్ చేస్తున్న ప్రతీ ఒక్కరు కంటెంట్ పై ఒక రేంజ్ ఎలివేషన్ ఇస్తున్నారు. రాజమౌళి కంటే అతిగా చెక్కేస్తున్న సుక్కు పుష్ప రెండవ భాగంలో ప్రతీ విషయం కూడా కొత్తగా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ఎప్పుడో ఆగస్టులో రావాల్సిన ఈ సినిమా ఒక్కసారిగా డిసెంబర్ కు షిఫ్ట్ అయ్యింది. దీంతో సినిమాపై ఆసక్తి తగ్గుతోంది అనేలా కూడా కామెంట్స్ వచ్చాయి.
కానీ సినిమాకు వర్క్ చేస్తున్న టీమ్ సభ్యులు ఏదో ఒక సందర్భంలో ఫ్యాన్స్ కు కిక్కిచ్చేలా అప్డేట్స్ ఇస్తున్నారు. ఇక ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ పుష్ప 2పై ఇచ్చిన ఒక వివరణ కూడా వైరల్ అయ్యేలా ఉంది. హైదరాబాద్ లోని ఒక ప్రోగ్రాంలో పాల్గొన్న రాకింగ్ స్టార్ పుష్ప 2 ఫస్ట్ హాఫ్ చూడగానే మైండ్ బ్లాక్ అయ్యిందనే రేంజ్ లో మాట్లాడారు. ఫస్ట్ హాఫ్ లోనే కొన్ని సీన్స్ కు నేను, చంద్రబోస్ గారు క్లాప్ కొట్టేశాం. ఒక్కో సీన్ ఇంటర్వెల్ ఎపిసోడ్ మాదిరిగా ఉందని దేవి వివరణ ఇచ్చారు. అలాగే బన్నీ నటన, సుక్కు రైటింగ్ – మేకింగ్ స్టైల్ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అని భరోసా ఇచ్చారు.
మరోవైపు బన్నీ సన్నిహితుడు SKN కూడా పుష్ప 2కి సంబంధించిన రెండు సీన్లు చూసినట్లు చెప్పారు. ఆ రెండు సన్నివేశాల అనంతరం ఇంకా ఇంకా చూడాలి అనిపించిందని, సుకుమార్ గారు, బన్నీ గారు కెరీర్ లోనే టాప్ లెవెల్ బెస్ట్ వర్క్ ఈ సినిమాతోనే హైలెట్ అవుతుందని SKN చెప్పారు. ఇదే ఫామ్ కొనసాగితే వచ్చే ఏడేళ్ళలో బన్నీకి ఇండియాలో ఉన్న అన్నీ అవార్డులు కొట్టేయడం పక్కా అని మరొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏదేమైనా మేకర్స్ నుంచి సౌండ్ పెంచే అప్డేట్స్ రాకపోయినా ఇలాంటి వారి ద్వారా పుష్ప 2 జానాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.
This post was last modified on October 15, 2024 12:01 am
వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్నట్టుగానే పార్టీ అధినేత జగన్…
అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న యూత్ ఫాలోయింగ్ కి అదనంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని జోడించిన బ్లాక్ బస్టర్…
"హలో... ఐ యామ్ చిట్టి. స్పీడ్ వన్ టెరా హెర్ట్జ్, మెమరీ వన్ జెట్టా బైట్!" రజనీకాంత్ రోబో సినిమాలో…
మొన్నటిదాకా వరస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్ లో పడేసుకున్న సూర్య మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. అసలు పెద్దగా అంచనాలు లేకుండా…
టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులకు చిన్నతనంలోనే సినిమా పురుగు కుట్టేస్తుంది. బాల నటుడిగానే అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే…
మహిళలు మీసాలు పెంచలేరని.. పురుషులు గర్భాన్ని దాల్చలేరని సామెత!. అయితే.. ఇటీవల కాలంలో రష్యాకు చెందిన ఓ మహిళ మీసాలు…