టాలీవుడ్ లో సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకులతో క్రిష్ ఒకరు. అతనికి ఎంత పెద్ద ఫ్లాప్ ఎదురైనా కూడా వెంటనే కథ వినేందుకు అగ్ర హీరోలు కూడా సిద్ధంగా ఉంటారు. అందుకు కారణం క్రిష్ కథలలో సామాజిక అంశాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే స్టార్స్ వారి టాలెంట్ ను మరింత కొత్తగా చూపేందుకు స్కోప్ ఉంటుంది.
గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, గౌతమీ పుత్ర శతకర్ణి లాంటి సినిమాలతో క్రిష్ దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్, కొండపొలం డిజాస్టర్స్ అయినప్పటికీ మళ్ళీ వెంటనే పవన్ తో ఛాన్స్ అందుకోవడం విశేషం. అయితే పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాను సగానికి పైగా ఫినిష్ చేసినప్పటికీ షూటింగ్ చివరి దశలో బయటకు రావాల్సి వచ్చింది.
ఆ విషయంలో క్రిష్ పై రకరకాల గాసిప్స్ వచ్చినప్పటికీ టైమ్ వృధా చేయకుండా వెంటనే అనుష్కతో ఘాటీ అనే సినిమా స్టార్ట్ చేశాడు.. ఈ సినిమా పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. అయితే అనుష్క తరువాత క్రిష్ ఎవరితో వర్క్ చేస్తాడు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. లేటెస్ట్ టాక్ ప్రకారం ఒక మీడియం రేంజ్ హీరోతోనే సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ లిస్టులో విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని లాంటి హీరోలు ఉన్నారట. కథలు అయితే సిద్ధంగా ఉంచుకున్న క్రిష్ ఘాటీ రిలీజ్ లోపే ఒకరిని ఫైనల్ చేసి అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. అసలే కమర్షియల్ గా హిట్ చూసి చాలా కాలమైంది కాబట్టి వీలైనంత త్వరగా కొత్త ప్రాజెక్టుని ఫిక్స్ చేసుకోవాలని క్రిష్ అడుగులు వేస్తున్నారు. మరి ఆయనకు ఏ హీరో సెట్టవుతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates