Movie News

నితిన్ చెప్పేశాడు….ఇక చైతునే బాకీ

డిసెంబర్ బరిలో నుంచి గేమ్ ఛేంజర్ తప్పుకోవడంతో ఒక్కసారిగా ఇతర నిర్మాతలు అలెర్ట్ అయిపోయారు. వాయిదా వేయడానికి గల కారణాలు దిల్ రాజు స్పష్టంగా వివరించారు. ముందు అనుకున్న ప్రకారం అయితే చరణ్ డిసెంబర్ 20 లేదా 25 రావాలి. మొన్నటి దాకా ఇదే ధీమాతో ఎస్విసి టీమ్ ఉండటంతో మిగిలిన ప్రొడ్యూసర్లు ఆ డేట్ మీద ఆశలు వదులుకున్నారు. ఇప్పుడు ఆ స్లాట్ ఖాళీ కావడంతో ఒక్కక్కరుగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి రెడీ అవుతున్నారు. నితిన్ రాబిన్ హుడ్ డిసెంబర్ 20 వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్టు కొత్త పోస్టర్ తో మైత్రి సంస్థ అనౌన్స్ మెంట్ ఇచ్చేసింది.

వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎంటర్ టైనర్ నిజానికి ఎప్పుడో ఈ తేదీని లాక్ చేసుకుంది. కానీ గేమ్ ఛేంజర్ ఎంట్రీతో కొద్దిరోజులు వేచి చూద్దామని ఆగింది. ఇప్పుడు రూట్ క్లియర్ కావడంతో కుండ బద్దలు కొట్టేసింది. ఇక అందరి చూపు నాగ చైతన్య వైపు వెళ్తోంది. తండేల్ కూడా గతంలో డిసెంబర్ 20నే అఫీషియల్ చేసుకుంది. తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో డేట్ మార్చుకునే ఆలోచన చేసింది. బన్నీ వాస్ త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో అన్నారు. మరి ఇప్పుడు రాబిన్ హుడ్ తో పాటు ఒకేరోజు బరిలో దిగుతారా లేదా అనేది వేచి చూడాలి.

పుష్ప 2 ది రూల్ వచ్చిన రెండు వారాలకే రావడంలో కొంత రిస్క్ పొంచి ఉన్నా క్రిస్మస్ సెలవులను దృష్టిలో ఉంచుకోవడం అవసరమే. ఓవర్సీస్ కోణంలో చూసుకుంటే మూడు పెద్ద హాలీవుడ్ మూవీస్ వస్తున్నాయి కాబట్టి విదేశాల్లో స్క్రీన్ కౌంట్ పరంగా రాబిన్ హుడ్ రాజీ పడాల్సి ఉంటుంది. తేరి రీమేక్ గా వస్తున్న బాలీవుడ్ సినిమా బేబీ జాన్ కూడా కొంత ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. సో తండేల్ ఏం చెప్పబోతోందో వేచి చూడాలి. ఒకవేళ పాత మాటకే కట్టుబడి ఇరవైకి వస్తుందా లేక జనవరికి షిఫ్ట్ అవుతుందా అనేది సస్పెన్స్. ప్రస్తుతం తండేల్ షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది.

This post was last modified on October 12, 2024 3:54 pm

Share

Recent Posts

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

13 minutes ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

2 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

2 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

4 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

5 hours ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

5 hours ago