దసరా లాంటి కీలక సీజన్. పోటీ కూడా పెద్దగా లేదు. తెలుగు లాంటి ఇతర భాషల్లోనూ ప్యాన్ ఇండియా సినిమాలు కాంపిటీషన్ లో లేవు. ఇన్ని సానుకూలతలకు తోడు సూపర్ స్టార్ రజనీకాంత్ బ్రాండ్ ఉంటే ఎంత అరాచకం జరగాలి. కానీ వేట్టయన్ విషయంలో ఆ జోరేమి కనిపించడం లేదు.
తమిళనాడులో బుకింగ్స్ బాగానే ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో కనీసం సగం బజ్ కూడా లేకపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. పైగా టాలీవుడ్ జనాలకు ఎంత మాత్రం కనెక్ట్ అయ్యే అవకాశం లేని విధంగా వేట్టయన్ టైటిల్ ని యధాతథంగా ఉంచడం దెబ్బ కొట్టింది.
రెండు అంశాలు వేట్టయన్ విషయంలో నెగటివ్ గా పని చేశాయి. మొదటిది ట్రైలర్ కట్. పాత్రలను పరిచయం చేసి చూచాయగా స్టోరీ లైన్ చెప్పడం తప్పించి మొదటి రోజు చూసే తీరాలన్న ఎగ్జైట్ మెంట్ ని కలిగించలేకపోయింది. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, దగ్గుబాటి రానా, మంజు వారియర్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ని సరైన రీతిలో మార్కెటింగ్ చేసుకోలేదు.
రెండో పాయింట్ అనిరుద్ రవిచందర్ సంగీతం. జైలర్ స్థాయిలో ఉన్న అంచనాలను అతను సగమైనా అందుకుంటాడో లేదోననే అనుమానాలు మ్యూజిక్ లవర్స్ లో మొదలయ్యాయి. దేవరకు వచ్చిన రీచ్ కనీసం పావొంతు వేట్టయన్ పాటలకు రాలేదు.
ఒక్క మనసిలాయో మాత్రమే ఆడియన్స్ కి రిచ్ అయ్యింది. అది కూడా మంజు వారియర్ గ్రేస్, కలర్ఫుల్ సెట్టింగ్-కొరియోగ్రఫీ వల్ల తప్పించి క్రెడిట్ ని పూర్తిగా అనిరుధ్ కి ఇవ్వలేం. సో హైప్ విషయంలో ఇంతగా పోరాడుతున్న వేట్టయన్ కు అటు తమిళంలోనూ భీభత్సమైన బుకింగ్స్ కనిపించడం లేదు.
ఉదయం షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ ఉన్నాయి కానీ రోజు మొత్తం అన్ని షోలు హౌస్ ఫుల్ కావడం గురించి ట్రేడ్ టెన్షన్ గా ఉంది. జై భీం దర్శకుడు టీజె జ్ఞానవేల్ ఇంత పెద్ద మాస్ హీరోని ఎలా హ్యాండిల్ చేసి ఉంటాడనే సందేహం నెలకొన్న నేపథ్యంలో వేట్టయన్ ముందు పెద్ద సవాళ్ళే ఉన్నాయి.
This post was last modified on October 7, 2024 10:56 am
నిన్న విడుదలైన తండేల్ గురించి కొంత మిశ్రమ స్పందన వినిపిస్తున్నప్పటికీ ఓవరాల్ గా మంచి వసూళ్లతో ఓపెనైన వైనం స్పష్టంగా…
విదేశీ జైళ్లలో ఉన్న భారతీయ ఖైదీల సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించిన తాజా…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో ఎగ్జిట్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల జల్లుకురిపించారు. దక్షిణాది సినీ రంగానికి చిరంజీవి ఐకాన్.. అని పేర్కొన్నారు.…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు మాట కు తెలుగు ఓటరు ఓటెత్తాడు.…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీజేపీ…