దేవర విజయాన్ని ఆస్వాదిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ఇచ్చిన కమిట్ మెంట్లు మూడు. మొదటిది వార్ 2. ఇది జనవరి లేదా మార్చిలోగా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్ళిపోతుంది. 2025 ఆగస్ట్ విడుదలని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా యష్ రాజ్ ఫిలిమ్స్ పక్కా ప్లానింగ్ తో ఉంది. ఇదయ్యాక ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్యాన్ ఇండియా మూవీ సెట్స్ పైకి వెళ్తుంది. దీనికి ఎక్కువ టైం లేదు. 2026 సంక్రాంతి రిలీజ్ ముందే లాక్ చేసుకున్నారు. సో వచ్చే ఏడాది అక్టోబర్ లోగా గుమ్మడికాయ కొట్టేయాలి. ఆపై దేవర 2 ఎప్పుడు షురూ అనేది కొరటాల శివ ప్లానింగ్ మీద ఆధారపడి ఉంటుంది.
ఇదిలా ఉండగా ఇప్పటికిప్పుడు డేట్లు లేకపోయినా తారక్ కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్ల లిస్టు ముందే సిద్ధమైపోతోంది. జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ ఒక కథని సిద్ధం చేశాడని, ఒకవేళ రజనీకాంత్ తో జైలర్ 2 కనక ఆలస్యమయ్యే పక్షంలో జూనియర్ ప్రాజెక్టు తాలూకు స్క్రిప్ట్ ని సిద్ధం చేయొచ్చని అంటున్నారు. ప్రాధమికంగా చర్చ జరిగిందే తప్ప ఎలాంటి అధికారికంగా ధృవీకరణ లేదు. ఇక వెట్రిమారన్ కాంబో కోసం ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఆయన విడుదల పార్ట్ 2, వడివాసల్ పూర్తి చేసుకుని వచ్చేదాకా ఎదురు చూడాలి. నెల్సన్, వెట్రిమారన్ ఇద్దరికీ సమాన అవకాశాలున్నాయి.
ఇకపై కెరీర్ లో గ్యాప్ లేకుండా ఏడాదికి ఖచ్చితంగా ఒక సినిమా రిలీజయ్యేలా జూనియర్ చేసుకుంటున్న ప్లానింగ్ మంచి ఫలితాలు ఇచ్చేలా ఉంది. 2024 దేవర, 2025 వార్ 2, 2026 ప్రశాంత్ నీల్, 2027 దేవర 2 ఇలా లైనప్ ని రెడీ చేసుకుని పెట్టుకున్నాడు. ఒకవేళ ఎవరైనా నెలన్నరలో పూర్తి చేసే తక్కువ బడ్జెట్ కథ తీసుకొచ్చి మెప్పిస్తే దానికీ సిద్ధంగా ఉన్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన తారక్ ఒకవేళ అలాంటిది ఏదైనా చేసినా ఆశ్చర్యం లేదు. ఇవి కాకుండా ఇంకే కమిట్ మెంట్లు ఇవ్వలేదు కానీ వచ్చే నెల నుంచి వీలును బట్టి కొత్త కథలు వినే ప్లాన్ లో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్.