రాజమౌళితో ఏ హీరో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినా అతని తర్వాత సినిమా ఖచ్చితంగా డిజాస్టరవుతుందనే సెంటిమెంట్ ఇప్పటిదాకా కొనసాగుతూ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ సైతం దీన్నుంచి తప్పించుకోలేకపోయాడు. రామ్ చరణ్, ప్రభాస్ అందరికీ ఇది అనుభవమే. రెండు దశాబ్దాల తర్వాత తారక్ దాన్ని బ్రేక్ చేశాడు. దేవర విజయం ఇకపై జక్కన్న మీదున్న అపవాదుని పూర్తిగా తొలగిచేసింది. ఏదో మాములు హిట్ అయితే ఏమో అనుకోవచ్చు కానీ రెండో వారంలో అడుగు పెట్టే సమయానికే నాలుగు వందల కోట్ల గ్రాస్ దాటడం మాటలు కాదు. ఫైనల్ ఫిగర్ ఎక్కడ ఆగుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం.
ఆర్ఆర్ఆర్ హీరోల్లో కొమరం భీమ్ గెలిచాడు. ఇప్పుడు సీతారామరాజు వంతు వస్తోంది. అదే రామ్ చరణ్. అయితే ఆచార్యలో కొంచెం నిడివి ఎక్కువున్న క్యామియో చేసి ఆల్రెడీ ఫ్లాప్ అందుకున్నాడు కాబట్టి రాజమౌళి సెంటిమెంట్ తనకు వర్తించదని మెగా ఫ్యాన్స్ వర్షన్. లేదూ సోలో హీరోగానే దాన్ని బ్రేక్ చేయాలంటే మాత్రం గేమ్ ఛేంజర్ తో దాన్ని మార్చి చూపించాలి. దేవర కన్నా చాలా ముందు మొదలై ఏళ్ళ తరబడి షూటింగ్ జరుపుకున్న గేమ్ ఛేంజర్ డిసెంబర్ విడుదలకు రెడీ అవుతోంది. అభిమానుల్లో సన్నగిల్లిన నమ్మకాన్ని రా మచ్చా సాంగ్ తిరిగి పెంచింది. దసరా నుంచి ప్రమోషన్ల వేగం పెంచబోతున్నారు.
ఎంత కాకతాళీయంగా జరిగినా రాజమౌళి విషయంలో జరిగింది మాత్రం మురారి శాపంలాగా దశాబ్దాల తరబడి వెంటాడుతూ వచ్చింది. ఇప్పుడు నాలుగుసార్లు జక్కన్నతో జట్టు కట్టిన జూనియర్ ఎన్టీఆరే దాన్ని బ్రేక్ చేయడం కన్నా మూవీ లవర్స్ కోరుకునేది ఏముంటుంది. ప్రస్తుతం మహేష్ బాబు 29 కోసం ఏర్పాట్లలో ఉన్న రాజమౌళి ఎప్పటి నుంచి షూటింగ్ మొదలుపెట్టేది ఇంకా చెప్పడం లేదు. జనవరి నుంచి ఉండొచ్చని ఇండస్ట్రీ టాక్. ఇక తారక్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీ కానుండగా, రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబుతో ఆర్సి 16 మేకోవర్ కోసం రెడీ అవుతున్నాడు. దేవర 2 కొంత లేట్ కావొచ్చు.
This post was last modified on October 4, 2024 10:41 am
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…