నాలుగు వందల కోట్ల గ్రాస్ దాటేసి అప్రతిహతంగా దూసుకుపోతున్న దేవర విజయాన్ని పార్టీ రూపంలో నిన్న టీమ్ మొత్తం కలిసి ఇండస్ట్రీ ప్రముఖులతో జరుపుకుంది. వాస్తవానికి గుంటూరులో అభిమానుల మధ్య చేయాలని అనుకున్నప్పటికీ సెక్యూరిటీ, అనుమతులు తదితర కారణాల వల్ల వాయిదా వేశారు. దసరా పండగ తర్వాత హైదరాబాద్ లో ఓ వేడుక జరిగేలా ప్రయత్నిస్తున్నారు కానీ ఎంత మేరకు కార్యరూపం దాలుస్తుందో చూడాలి. రెండో వారంలో అడుగు పెట్టిన దేవర తాండవం ఇక్కడితో అయిపోలేదు. ఇంకా చెప్పాలంటే అసలు కథ ఇప్పుడు మొదలుకానుంది.
పది రోజుల పాటు టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు తీసుకున్నారు కాబట్టి చాలా కేంద్రాల్లో మొదటి రోజు ధరలే ఉన్నాయి. ఇకపై సాధారణ రేట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. స్కూళ్ళు, కాలేజీలకు దసరా సెలవులు ఇచ్చేశారు. 13వ తేదీ దాకా పిల్లలు, యూత్ ఇళ్లలోనే ఉంటారు. కాలక్షేపానికి థియేటర్ కు వెళ్లాలంటే మొదటి ఆప్షన్ దేవరనే. శ్రీవిష్ణు స్వాగ్ వచ్చింది కానీ దాని జానర్, కాన్సెప్ట్ కుటుంబం మొత్తం చూసేది కాదు. ఇంకో నాలుగైదు సినిమాలు వచ్చినా కామన్ ఆడియన్స్ దృష్టిలో వెళ్ళలేదు కాబట్టి అనూహ్యమైన టాక్ వస్తే తప్ప అవి రిలీజైన సంగతే తెలియదు.
సో దేవరను చూడని వాళ్ళు, రేట్లు తగ్గాలని ఎదురు చూస్తున్న మధ్యతరగతి ఆడియన్స్ కనక తారక్ సినిమా వైపు అడుగులు వేస్తే మరిన్ని భారీ నెంబర్లు తోడవుతాయి. పైగా సరైన టైమింగ్ చూసి దావూది పాటను ఇవాళ్టి నుంచి జోడించారు. దీని కోసమే రిపీట్ వెళ్లే అభిమానులు ఉంటారు. సో ఇలా అనుకూలంశాలు చాలానే ఉన్నాయి. అక్టోబర్ 10 నుంచి 12 మధ్యలో వచ్చే వేట్టయన్, విశ్వం, మా నాన్న సూపర్ హీరో, జనక అయితే గనకలు దిగే దాకా దేవరకు పరుగుకు ఎలాంటి ఢోకా లేదు. సలార్, కల్కి 2898 ఏడి తరహాలో మూడు వారాలు పైనే డెఫిషిట్ లేని బాక్సాఫీస్ రన్ ఉంటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.
This post was last modified on October 4, 2024 10:17 am
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం ఉదయం ఊహించని పరిణామం ఎదురైంది. సింగపూర్ లో…
ఐపీఎల్ 2025: ముంబయి ఇండియన్స్తో జరిగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిన తరువాత విరాట్ కోహ్లీ వైల్డ్…
ఓ ప్రజా ప్రతినిధి అన్నాక ఎలా ఉండాలి? అది కూడా ఓ శాసన సభ్యుడిగా కొనసాగుతున్న నేత ఎంత జాగ్రత్తగా…
అదేంటి రెండు ఆడేసి వెళ్ళిపోయిన సినిమాలు పరస్పరం కవ్వించుకోవడం ఏమిటని అనుకుంటున్నారా. అసలు మ్యాటర్ వేరే ఉంది. గత ఏడాది…
ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవల నిలిపివేతను ప్రైవేట్ ఆసుపత్రులు విరమించుకున్నాయి. టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకే వైద్య…
తెలంగాణలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడిన సంగతి…