ప్రతి మనిషి తన జీవితంలో జాతర చూడని సందర్భం ఉండదు. పెద్ద నగరంలో ఉన్నా, చిన్న పట్టణంలో బ్రతుకుతున్నా ఏదో ఒక రూపంలో ఈ సాంప్రదాయ సందడిని మిస్ కారు. అంతటి ప్రాముఖ్యత జాతరకు ఉంది. ఇటీవలి కాలంలో ఇదే ఒక సక్సెస్ ఫార్ములాగా మారుతోందంటే ఆశ్చర్యం కలగక మానదు. దేవరలో కీలకమైన రెండు ఎపిసోడ్లు దర్శకుడు కొరటాల శివ దీని చుట్టే డిజైన్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే డాన్సు చేసింది కూడా ఈ పాటలోనే. ఇంటర్వల్ కు ముందు వచ్చే కీలక ఘట్టంలో లీడ్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఇదేంత పేలిందో మళ్ళీ చెప్పనక్కర్లేదు.
చిన్న మూవీగా వచ్చిన కమిటీ కుర్రోళ్ళులో ప్రధాన ట్విస్టు జాతర మీద పెట్టాడు దర్శకుడు యదు వంశీ. ప్రధాన పాత్రల్లో ఒకరిని అక్కడ చనిపోయేలా చేయడంతో పాటు మొత్తం ట్రాక్ ని తెరకెక్కించిన తీరు ప్రశంసలు అందుకుంది. కిరణ్ అబ్బవరం కలో సైతం ఇదే కీలక పాత్ర పోషించనుంది. భారీ ఎత్తున తీసిన క్లైమాక్స్ తాలూకు విజువల్స్ కొన్ని షేర్ చేయడం ద్వారా ఎంత ఖర్చు పెట్టారో క్లూ ఇచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే పుష్ప 2 ది రూల్ లో గంగమ్మ జాతర గురించి టీమ్ ఇస్తున్న లీక్స్ అభిమానులకు నిద్ర పోనివ్వడం కష్టమనేలా ఉన్నాయి. పావు గంటకు పైగా ఈ నేపథ్యంలో ఫైట్ ఉంటుందట.
గత ఏడాది మంగళవారం లాంటి సెమీ హారర్ థ్రిల్లర్ సినిమాలోనూ జాతర మీదే మెయిన్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే దర్శక రచయితలు జాతరని ఇలా కథలో కీలక భాగం చేయడం స్మార్ట్ ఫోన్స్ లో మునిగి తేలుతున్న కొత్త తరాన్ని ఒక ట్రెడిషన్ వైపు చూసేలా చేయడమే. ఇప్పటికీ ఎన్నో ఊళ్లలో జాతరలు జరుగుతూనే ఉంటాయి. వాటి కోసమే సెలవు రోజుల్లో స్వంత పల్లెలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు లక్షల్లో ఉన్నారు. అయినా కథలో భాగంగా వస్తే బాగుంటుంది కానీ ఇదేదో వర్కౌట్ అవుతుందని బలవంతంగా జాతర ఎపిసోడ్స్ పెడితే తేడా కొట్టే రిస్క్ లేకపోలేదు. అలా జరిగిన దాఖలాలు తక్కువే.
This post was last modified on October 3, 2024 10:15 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…