Movie News

మెరుగైన ఛాయిస్ కోసం రావిపూడి వేట

మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు గెలుచుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నెక్స్ట్ సినిమా అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు. 2027 సంక్రాంతి విడుదలనే విషయం కన్ఫర్మ్ అయ్యింది కానీ ఎవరెవరు ఉంటారనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు.

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించబోయే ఈ ఎంటర్ టైనర్ కు చాలా అంటే చాలా పొడవైన టైటిల్ ఫిక్స్ చేశారట. అదేంటో బయటికి రాలేదు కానీ అనిల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు పేరు నుంచే ఇది ప్రేక్షకుల్లో టాక్ అఫ్ ది టౌన్ అయ్యేలా ఉంది. డిజైన్ కూడా వెరైటీగా ఉంటుందట.

అసలు సమస్య వేరే ఉంది. ఇందుల ఇంకో హీరో ఉన్నాడు. లీక్ ప్రకారం అది బావమరిది క్యారెక్టర్. తొలుత ఫహద్ ఫాసిల్ పేరు బలంగా వినిపించినప్పటికీ అనిల్ రావిపూడి మాత్రం కార్తీ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారట. మార్కెట్, ఇమేజ్ కోణంలో చూసుకుంటే తెలుగుతో పాటు తమిళంలో కూడా వర్కౌట్ చేసుకోవచ్చు కాబట్టి ఆ దిశగా ఫైనల్ చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.

కార్తీకి కథ నచ్చితే మల్టీస్టారర్ చేస్తాడు. గతంలో నాగార్జునతో ఊపిరిలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. పొన్నియిన్ సెల్వన్ లో మెయిన్ హీరో కాకపోయినా ముఖ్యమైన భూమిక పోషించాడు. హిట్ 3లో క్యామియోకు ఎస్ చెప్పాడు.

సో కార్తీ అనేది మంచి ఛాయస్ అవుతుంది. ఫుల్ కామెడీతో నడిచే ఇలాంటి సినిమా కార్తీ చేసి చాలా కాలమయ్యింది. అన్నగారు వస్తారులో కాస్త టచ్ ఇచ్చారు కానీ వర్కౌట్ కాలేదు. రాబోయే సర్దార్ 2 కూడా సీరియస్ జానరే. అనిల్ తో చేతులు కలిపితే మంచి ఫన్ మూవీలో భాగం వహించినట్టు అవుతుంది.

ఇప్పటికైతే అధికారిక ప్రకటన రాలేదు కానీ అంతా ఓకే అనుకున్నాక అనౌన్స్ మెంట్ రావొచ్చు. ఉగాదికి లాంచ్ చేసే ప్లానింగ్ ఉందట. నిర్మాతగా సాహు గారపాటి దాదాపు కన్ఫర్మే. భాగస్వామిగా వేరొకరు ఉండే ఛాన్స్ లేకపోలేదు. ఆదర్శ కుటుంబం షూటింగ్ అయిపోయాక వెంకటేష్ డేట్లు దీనికే కేటాయించబోతున్నారు.

This post was last modified on February 17, 2026 4:43 pm

Share

Recent Posts

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

35 minutes ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

1 hour ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

1 hour ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

3 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

3 hours ago

ఐకానిక్ షోకు తెర‌… చివ‌రి సీజ‌న్లో అల్లు అర్జున్‌?

ఇండియాలో వివిధ భాష‌ల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపుల‌ర్ ఏది అంటే బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత…

4 hours ago