లీకుతో మొదలై నెగటివ్ టాక్ దావానలంలా సోషల్ మీడియాని చుట్టేసిన గేమ్ ఛేంజర్ జరగండి జరగండి పాట వల్ల తమన్ మీద మెగా ఫ్యాన్స్ నుంచి విమర్శలైతే బాగానే వచ్చాయి. గాయని గాయకుల ఎంపికతో పాటు లిరికల్ వీడియోలో చూపించిన విజువల్స్ అభిమానులను అంతగా సంతృప్తి పరచలేకపోయాయి. దీంతో రెండో సాంగ్ తో ఖచ్చితంగా మెప్పించాల్సిన ఒత్తిడి తమన్ తో పాటు దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు టీమ్ మీద పడింది. అందుకే మాములుగా చివర్లో రిలీజ్ చేసే హీరో ఇంట్రో సాంగ్ రా మచ్చాని ముందుకు తెచ్చారు. ప్రోమోతోనే అవసరమైన హైప్ రాబట్టుకోవడంలో విజయం సాధించారు.
మరి ఇప్పుడు తమన్ పూర్తి మార్కులు తెచ్చుకున్నట్టేనా అని ప్రశ్న వేస్తే పాసైతే అయ్యాడు కానీ పరీక్ష ఇంకొంచెం బాగా రాయాల్సిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చరణ్ గ్రేస్, జనసేన సూచికగా నుదుటి మీద ఎర్ర తువాలు, ఇంద్రలో వీణ స్టెప్, వాల్తేరు వీరయ్య కటవుట్ ఇవన్నీ ఫుల్ మాస్ స్టఫ్ ఇచ్చేసాయి. రా మచ్చా రా మచ్చా పదాలు చాలా క్యాచీగా ఉండటంతో మాస్ లోకి త్వరగా వెళ్లిపోయింది. అయితే మిగిలిన చరణాలు, మధ్యలో మ్యూజిక్ హడావిడిగా సాగడం కొందరు మ్యూజిక్ లవర్స్ కి పూర్తిగా ఎక్కలేదు. వ్యూస్ అయితే అదిరిపోతున్నాయి కానీ కేవలం వాటిని బట్టే స్టేటస్ చెప్పలేం.
జరగండి జరగండి కంటే చాలా బెటరనే అభిప్రాయం వచ్చింది కాబట్టి తమన్ కొంచెం రిలీఫ్ ఫీలవొచ్చు కానీ తన నుంచి ఇంకా బెస్ట్ వర్క్ ఆశిస్తున్నారు ఆడియన్స్. శంకర్ లాంటి దర్శకుడి కాంబో కాబట్టి గతంలో ఆయనకు ఏఆర్ రెహమాన్ ఇచ్చిన ఒకే ఒక్కడు, భారతీయుడు, బాయ్స్ లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇవ్వాలనే అంచనాలున్నాయి. మరి వచ్చిన రెండు పాటలు ఆ స్థాయిలో ప్రస్తుతానికి లేవనిపిస్తోంది. స్క్రీన్ మీద చూశాక అభిప్రాయాలు మారతాయేమో చూడాలి. మరో మెలోడీ సాంగ్ కు సంబంధించిన ప్రకటన ఈ వారం లేదా దసరా పండక్కు రావొచ్చని అంటున్నారు. అదింకా బెస్టవ్వాలి.
This post was last modified on October 2, 2024 10:32 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…