ఇంకా షూటింగ్ మొదలుకాకుండానే జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న ప్యాన్ ఇండియా మూవీ గురించి రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. డ్రాగన్ టైటిల్ ఆల్రెడీ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే పేరుని తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ సినిమా కోసం తమిళంలో రిజిస్టర్ చేసి పెట్టారు. సో ఫైనల్ గా ఎవరికి దక్కుతుందో ఇప్పుడే చెప్పలేం కానీ మాట్లాడాల్సిన సంగతులు వేరే ఉన్నాయి. మొదటిది హీరోయిన్ ఎంపిక. సప్తసాగరాలు సైడ్ ఏబి ఫేమ్ రుక్మిణి వసంత్ పేరు సీరియస్ పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇంకా ఖరారు చేయలేదు.
మాములుగా నీల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది కానీ గ్లామర్ షోలు, డ్యూయెట్లు లాంటివి ఉండవు. శ్రీనిధి శెట్టి, శృతి హాసన్ విషయంలో చూశాం. ఇప్పుడు వాటికన్నా మెరుగైన క్యారెక్టర్ కావడంతో పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకునే రుక్మిణిని మొదటి ఆప్షన్ గా పెట్టుకున్నట్టు తెలిసింది. రష్మిక మందన్న వైపు కూడా చూస్తున్నారట కానీ డేట్ల అందుబాటు వల్ల ఇప్పుడే ఔనా కాదాని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక బ్యాక్ డ్రాప్ విషయానికి వస్తే ఒకప్పుడు బంగ్లాదేశ్ లో ఇరుక్కన్న ప్రవాస భారతీయుల నేపథ్యంలో వాళ్ళను కాపాడే పవర్ ఫుల్ పాత్రలో తారక్ ని చాలా గొప్పగా చూపించబోతున్నారట.
బ్లాక్ టోన్ వీలైనంత తగ్గించి ఈసారి సరికొత్త నేపధ్యాన్ని పరిచయం చేయబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం లొకేషన్లతో పాటు ఇంటీరియర్ గా వేయాల్సిన సెట్ల మీద వర్క్ షాపులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. వార్ 2 లో తన భాగం పూర్తి చేసుకుని జూనియర్ ఎన్టీఆర్ తిరిగి వచ్చాక అటుపై నీల్ సెట్లో అడుగు పెడతాడు. 2026 సంక్రాంతి విడుదలని అఫీషియల్ గా లాక్ చేసుకున్న మైత్రి మేకర్స్ సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలకు జరిగే జాప్యం లేకుండా పక్కా ప్లాన్ తో ఉన్నారని తెలిసింది. దేవరకొచ్చిన స్పందనే ఇలా ఉంటే ఇక తారక్ నీల్ కాంబోకు ఆకాశమే హద్దు.
This post was last modified on October 1, 2024 12:23 pm
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…