ప్రభాస్ సినిమా అంటే అన్నీ చాలా భారీగా ఉంటాయి. కాస్టింగ్ దగ్గర్నుంచి అన్నీ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. అందులోనూ ఈసారి హను రాఘవపూడి లాంటి మంచి అభిరుచి ఉన్న దర్శకుడితో ప్రభాస్ సినిమా చేస్తుండడంతో కాస్ట్ అండ్ క్రూ విషయంలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కోసం యూట్యూబర్ ఇమాన్వి ఇస్మాయెల్‌ను ఎంచుకోవడంతోనే తన ప్రత్యేకతను చాటుకున్నాడు హను. ముహూర్తం రోజు తనను చూసి అందరూ ఫిదా అయిపోయారు. హను టేస్టే వేరు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇప్పుడు ఈ చిత్రంలోకి ఎంచుకున్న ఓ నటుడి విషయంలోనూ అందరూ వారెవా అనే అంటున్నారు. ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలోకి బాలీవుడ్, బెంగాలీ లెజెండరీ నటుడైన మిథున్ చక్రవర్తిని ఎంచుకున్నాడు హను. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగానే ప్రకటించింది చిత్ర బృందం.
మిథున్ తాజాగా ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ పాల్కే అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా వివిధ పరిశ్రమల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభాస్-హను చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ కూడా మిథున్‌కు శుభాకాంక్షలు చెప్పింది. ఈ క్రమంలోనే ఆయన తమ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని వెల్లడిస్తూ తమ సినిమాలోకి ఆహ్వానం పలికింది.
ఒకప్పుడు హీరోగా అలరించిన మిథున్.. ఇప్పుడు క్యారెక్టర్, విలన్ రోల్స్ చేస్తున్నారు. కొన్నేళ్ల కిందట పవన్ కళ్యాణ్-వెంకటేష్ మూవీ గోపాల గోపాలలో ఆయన నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. దీని ఒరిజినల్ ఓఎంజీలోనూ ఆ పాత్రను మితునే చేశాడు. దొంగ బాబాగా ఆయన అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఏరికోరి మిథున్‌ను ఎంచుకున్నాడు అంటే.. హను ఆయన కోసం ప్రత్యేకమైన పాత్రనే డిజైన్ చేసి ఉంటాడని ఆశించవచ్చు. ఈ చిత్రంలో సీనియర్ నటి జయప్రద ఓ ముఖ్య పాత్ర పోషిస్తోందట. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రాఫర్.
This post was last modified on October 1, 2024 8:57 am
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…