హిట్టు డైరెక్టర్ల వెంట పడతాడని ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కు ఓ పేరుండేది. ‘అతనొక్కడే’, ‘కిక్’ల తర్వాత సురేందర్ రెడ్డితో.. ‘కందిరీగ తర్వాత’ సంతోష్ శ్రీనివాస్‌తో.. ‘లెజెండ్’ తర్వాత బోయపాటి శ్రీనుతో.. ‘గబ్బర్ సింగ్’ తర్వాత హరీష్ శంకర్‌తో.. ఇలా చాలామంది సక్సెస్ ఫుల్ డైరెక్టర్లతో సినిమాలు చేయడమే ఈ పేరు రావడానికి కారణం. కానీ ఇలా చేసిన అశోక్, ఊసరవెల్లి, రభస, దమ్ము, రామయ్యా వస్తావయ్య లాంటి సినిమాలు తారక్‌కు నిరాశనే మిగిల్చాయి.
ఐతే తర్వాత తారక్ రూటు మారిపోయింది. అతను ఫ్లాప్ డైరెక్టర్లతో పని చేసి వాళ్లకు వరుస హిట్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ సెంటిమెంట్ ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషం. వరుస డిజాస్టర్లలో అల్లాడుతున్న పూరి జగన్నాథ్‌తో ‘టెంపర్’ చేసి తన కెరీర్‌ను మళ్లీ గాడిన పెట్టుకున్న తారక్.. ‘1 నేనొక్కడినే’తో ఇబ్బంది పడ్డ సుకుమార్‌తో ‘నాన్నకు ప్రేమతో’ చేసి హిట్ కొట్టాడు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో షాక్ తిన్న బాబీతో ‘జై లవకుశ’ చేసి విజయం సాధించాడు. అలాగే ‘అజ్ఞాతవాసి’తో దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ‘అరవింద సమేత’ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.
ఇప్పుడు కొరటాల శివతోనూ ఈ సెంటిమెంటును వర్కవుట్ చేశాడు తారక్. ఆయన చివరి సినిమా ‘ఆచార్య’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. అయినా కొరటాలను నమ్మి ‘దేవర’ చేశాడు. ఈ సినిమాకు కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. కానీ అది వసూళ్ల మీద పెద్దగా ప్రభావం చూపలేదు. వీకెండ్ వరకు ‘దేవర’ అదరగొట్టింది. ఇక ముందు ఎలా పెర్ఫామ్ చేస్తుందో కానీ.. సినిమాకు నెగెటివ్ టాక్ అయితే లేదు. ఫ్లాప్ అనే అవకాశం ఎంతమాత్రం లేదు. కాబట్టి ఫ్లాప్ డైరెక్టర్లకు హిట్ ఇస్తాడన్న తారక్ పేరు ఇంకా బలపడడ్డట్లే.
This post was last modified on September 30, 2024 9:33 pm
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…