Movie News

మోక్షజ్ఞ మీద వంద కోట్లా?

టాలీవుడ్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న అరంగేట్రం అంటే.. నందమూరి మోక్షజ్ఞదే. నిన్నటితరం సూపర్ స్టార్లలో చిరంజీవి, నాగార్జునల వారసులు ఎప్పుడో సినిమాల్లోకి వచ్చారు కానీ.. నందమూరి బాలకృష్ణ కొడుకు అరంగేట్రం మాత్రం అనుకున్న దాని కంటే చాలా ఆలస్యం అయింది. ఎప్పుడో ఏడెనిమిదేళ్ల కిందటే అనుకున్న ఎంట్రీ.. 2025లో కానీ సాధ్యపడట్లేదు. ఐతే ఎట్టకేలకు ఇటీవలే మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని ప్రకటించారు.

‘హనుమాన్’ తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ జరగబోతోంది. ‘హనుమాన్’ తరహాలోనే ఫాంటసీ టచ్ ఉన్న సినిమానే తీయబోతున్నాడని పోస్టర్ మీద వేసిన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ లోగో చూస్తేనే అర్థమైపోయింది. ఈ సినిమాను దసరాకు లాంఛనంగా మొదలుపెట్టబోతున్నారట. ముహూర్త వేడుకను ఘనంగా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న టీం.. ముహూర్త వేడుక తర్వాత కూడా వెంటనే చిత్రీకరణ మొదలుపెట్టట్లేదు. డిసెంబరులో షూట్ ఆరంభమవుతుందట. తాజాగా బాలయ్య కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇక ఈ మూవీ గురించి బయటికి వచ్చిన ఆసక్తికర అప్‌డేట్ ఏంటంటే.. దీని మీద ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట. ఒక కొత్త హీరో మీద ఇంత బడ్జెట్టా అని ఆశ్చర్యం కలగడం ఖాయం. కానీ ‘హనుమాన్’ తర్వాత ప్రశాంత్ వర్మ మీద అంచనాలు బాగా పెరిగాయి. అతడి సినిమాటిక్ యూనివర్శ్ నుంచి సినిమా అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అదే సమయంలో నందమూరి వారసుడి సినిమా అన్నా ఉండే క్యూరియాసిటీ వేరు.

హనుమాన్, కార్తికేయ తరహా డివోషనల్ టచ్ ఉన్న ఫాంటసీ మూవీ చేస్తే పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ వస్తుందని.. బడ్జెట్ వర్కవుట్ చేయడం కష్టమేమీ కాదని టీం భావిస్తోందట. ఈ చిత్రం బాలయ్య తనయురాలు తేజస్వి నిర్మాణ భాగస్వామి కావడంతో ప్రొడక్షన్ విషయంలో రాజీ పడట్లేదని తెలుస్తోంది.

This post was last modified on September 30, 2024 3:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago