తెలుగులో గొప్ప ఆదరణ దక్కించుకున్న రియాలిటీ షోల్లో ‘అన్ స్టాపబుల్’ ఒకటి. ఎవ్వరూ ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణను హోస్ట్‌గా పెట్టి ఆహా ఓటీటీ మొదలుపెట్టిన ఈ షోకు అద్భుత స్పందన వచ్చింది.
వేదికల మీద మాట్లాడేటపుడు బాగా తడబడతాడని పేరున్న బాలయ్యతో ఈ షో ప్లాన్ చేయడాన్ని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఆయన ఈ షోను చాలా ఉత్సాహంగా నడిపిస్తూ.. అతిథులతో కలిసి అల్లరల్లరి చేస్తూ దీనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, వ్యూయర్‌షిప్ తీసుకొచ్చాడు.
చిరంజీవి, చంద్రబాబు నాయుడు, ప్రభాస్, పవన్ కళ్యాణ్ సహా ఎందరో ప్రముఖులతో బాలయ్య నిర్వహించిన ఎపిసోడ్లకు అద్భుత స్పందన వచ్చింది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ‘అన్‌స్టాపబుల్’ త్వరలోనే మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈసారి ‘అన్‌స్టాపబుల్’ మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌తో మొదలు కాబోతుండడం విశేషం. దుల్కర్ అక్టోబరు నెలాఖరులో ‘లక్కీ భాస్కర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్‌కు కూడా కలిసొస్తుందనే ఉద్దేశంతో బాలయ్య షోకు రాబోతున్నాడు దుల్కర్.
అతడితో పాటు ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా షోలో సందడి చేస్తారు. దుల్కర్ మీడియాకు దొరకడం.. సినీ, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడ్డం తక్కువ. బాలయ్యతో షోలో వీటి గురించి అతను చాలా కబుర్లు చెప్పే అవకాశముంది.
ఇక చాలా ఓపెన్‌గా మాట్లాడేస్తాడని పేరున్న నాగవంశీ కూడా ఈ షోలో ఏం బాంబులు పేల్చుతాడో చూడాలి. అతను బాలయ్య-బాబీ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ ఎపిసోడ్ దసరా కానుకగా ప్రేక్షకులను అలరించబోతోంది.
This post was last modified on September 30, 2024 3:38 pm
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…