తిరుమల లడ్డు వివాదంపై సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ అభిప్రాయంతో విభేదించినంత మాత్రాన ఆయనతో తనకు వ్యక్తి గత గొడవలు ఉన్నట్లు అనుకోవాల్సిన పని లేదని ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు పేర్కొన్నాడు. ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ మీదే విష్ణు గెలిచిన గెలిచిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. ఆ తర్వాత కూడా కొంత కాలం ఘర్షణ కొనసాగింది.
ఈ నేపథ్యంలో తిరుమల లడ్డు వివాదానికి మతం రంగు పూసి జాతీయ స్థాయి వివాదంగా మారుస్తున్నాడంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించడం.. దీనిపై మంచు విష్ణు మీరు మీ పరిధిలో ఉండండి అంటూ కౌంటర్ వేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ గొడవపై విష్ణు తాజాగా స్పందిస్తూ.. “ప్రకాష్ రాజ్ గారు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని మాత్రమే తెలియజేశా. ఒక హిందువుగా, తిరుపతి వాసిగా ఆ వివాదానికి మతం రంగు లేదని గర్వంగా చెప్పగలను. ప్రకాష్ రాజ్ ట్వీట్ పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అలాగే నేను నా అభిప్రాయం తెలియజేశా. ఆయన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని చెప్పా. వ్యక్తిగతంగా ప్రకాష్ రాజ్ గారి మీద నాకు ఎంతో గౌరవం ఉంది. నాన్న చేసిన సినిమాల్లో ఆయన కలిసి నటించారు. ఆయన నాకు ఎంతో కాలం నుంచి తెలుసు. నేను ఆయన్ని అంకుల్ అని పిలుస్తుంటా. ఆయనంటే గౌరవం ఉంది. ఈ విషయంలో ఎలాంటి వివాదం లేదు” అని విష్ణు స్పష్టం చేశాడు.
మరోవైపు నటీనటులు లడ్డు వివాదంపై స్పందించకపోవడంపై విష్ణు మాట్లాడుతూ.. “ఆర్టిస్టులు అద్దాల మేడల్లో ఉంటాం. ఏదైనా విషయమై మేం మాట్లాడితే కొందరికి నచ్చవచ్చు. కొందరికి నచ్చకపోవచ్చు. నచ్చని వాళ్లు సులభంగా మమ్మల్ని టార్గెట్ చేస్ారు. అందుకే ఈ వివాదంపై బహిరంగంగా మాట్లాడితే ఎవరి మనోభావాలైనా దెబ్బ తింటాయేమో అని మౌనంగా ఉన్నారు” అని చెప్పాడు.
This post was last modified on September 29, 2024 9:34 pm
ఈ సోషల్ మీడియా జమానాలో ఏ పాట ఎప్పుడు ఎక్కడ ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ కుర్చీని…
స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…
ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…
కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…
సినిమాల సెన్సార్షిప్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…
వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…