నార్త్ ఇండియాలో ఎవ్వరూ ఊహించని ఫలితాన్ని అందుకున్న సౌత్ సినిమాల్లో ‘పుష్ప’ ఒకటి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఉత్తరాదిన బాగా ఆడడం ఏమంత ఆశ్చర్యం కలిగించలేదు. కానీ తెలుగులో డివైడ్ టాక్ తెచ్చుకుని అంచనాలకు తగ్గ వసూళ్లు రాబట్టలేకపోయిన ఈ చిత్రం.. హిందీలో పెద్దగా ప్రచారం లేకుండా విడుదలై 80 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది.
‘పుష్ప’ రిలీజ్ తర్వాత ఆ సినిమా పాటలు.. బన్నీ మేనరిజమ్స్ వైరల్ అయ్యాయి. నార్త్ ఇండియన్లను ఒక ఊపు ఊపేశాయి. దీని తర్వాత హిందీలో సర్ప్రైజ్ హిట్ అంటే.. కార్తికేయనే. ఇప్పుడు ‘దేవర’ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఐతే ‘దేవర’కు హిందీలో విడుదల ముంగిట పెద్దగా బజ్ కనిపించలేదు. ‘ఆర్ఆర్ఆర్’తో తారక్ హిందీలో కూడా మంచి గుర్తింపే తెచ్చుకున్నా.. అది ‘దేవర’కు ఏమేర కలిసి వస్తుందో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ట్రైలర్‌కు సరైన రెస్పాన్స్ రాలేదు. ‘దేవర’కు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పెద్దగా కనిపించలేదు. కానీ రిలీజ్ రోజు ఈ సినిమాకు వచ్చిన స్పందన, వసూళ్లు చూసి ఇప్పుడు ట్రేడ్ పండిట్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.
తొలి రోజు హిందీలో దేవర ఏడున్నర కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది సినిమాకు ముందున్న బజ్ ప్రకారం చూస్తే పెద్ద నంబరే. మాస్ ఏరియాల్లో సింగిల్ స్క్రీన్లలో ‘దేవర’ సినిమాకు మంచి స్పందన కనిపిస్తుండడం విశేషం. అక్కడ సినిమాకు రెస్పాన్స్ బాగుంది అంటే.. మున్ముందు దీనికి బాక్సాఫీస్ దగ్గర బాగా కలిసి రాబోతుందన్నమాటే. మల్టీప్లెక్సుల్లో కూడా స్పందన బాగానే ఉంది. హిందీ రూరల్ మార్కెట్లో ఓ సినిమా క్లిక్ అయితే దానికి లాంగ్ రన్ ఉంటుంది. అక్కడి మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే మంచి వసూళ్లు వస్తాయి. చూస్తుంటే ‘పుష్ప’ మ్యాజిక్‌ను ‘దేవర’ రిపీట్ చేసేలాగే కనిపిస్తోంది.
This post was last modified on September 28, 2024 5:18 pm
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సమీపంలోనే జరగబోయే మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలను ముందుగానే…
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా…
టీడీపీ సీనియర్ నాయకురాలు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత… రాజకీయంగా చర్చనీయాంశం అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి…
గేమ్ ఛేంజర్ ఇంకా విడుదలే కాలేదు రామ్ చరణ్ అప్పుడే తన తదుపరి సినిమాను పట్టాలెక్కించేశాడు. సుకుమార్ ప్రియ శిష్యుడు…
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న పార్టీ మార్పుల కేసులో హైకోర్టు సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. బీఆర్ఎస్…