Movie News

దసరా విలన్ వృథా అవుతున్నాడు

మలయాళం నుంచి విలన్లను తీసుకొచ్చి భారీ పారితోషికాలు ఇచ్చి నటింపజేయడం గత కొన్నేళ్లలో బాగా ఊపందుకుంది. కేరళలో హీరోగా ఉన్న ఫహద్ ఫాసిల్ పుష్పలో ప్రతినాయకుడిగా కనిపించడానికి కారణం ఇదే. జీజు జార్జ్ ని ఏరికోరి మరీ ఆదికేశవ కోసం పట్టుకొచ్చారు కానీ ఫలితం దక్కలేదు. జయరాంకు అగ్ర దర్శకుల నుంచి క్రమం తప్పకుండా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఈ ట్రెండ్ కొత్తగా పుట్టుకొచ్చింది కాదు కానీ మెథడ్ యాక్టింగ్ మీద మంచి పట్టుకున్న క్యారెక్టర్ ఆర్టిస్టులను తీసుకురావడం మంచి ఎత్తుగడే. ఈ కోవలో వచ్చేవాడే షైన్ టామ్ చాకో. నాని దసరాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.

మొదటి సినిమానే వంద కోట్ల బ్లాక్ బస్టరయ్యింది. తర్వాత నాగశౌర్య రంగబలిలో చేశాడు. పాత్ర తీరుతెన్నులతో పాటు కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండటంతో డిజాస్టరయ్యింది. తాజాగా దేవర పార్ట్ 1లోనూ ఉన్నాడు. అయితే ఎంత మాత్రం ప్రాధాన్యం లేని క్యారెక్టర్ కావడంతో కేవలం కొద్ది సీన్లలో మాత్రమే కనిపించింది తేలిపోయాడు. దీనికి కారణం లేకపోలేదు. మెయిన్ విలన్ సైఫ్ అలీ ఖాన్ డామినేషన్ తో పాటు అతని వెనుక ఉండే రౌడీల గ్యాంగ్ ని పెద్దది పెట్టడంతో షైన్ టామ్ చాకో ఆ గుంపులో కలిసిపోయాడు. ఇంటర్వెల్ లో దేవర చేతిలో కత్తిపోటుకి గురై ఆ తర్వాత మళ్ళీ కనిపిస్తాడు.

ఈ లెక్కన దేవర 2లో షైన్ కి ఎక్కువ స్కోప్ దొరికేలా ఉంది. చనిపోయాడనుకున్న వాడు ఎలా బ్రతికాడు, దేవర హత్య వెనుక అసలు రహస్యం ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం దొరికే క్రమంలో సీక్వెల్ లో నిడివి పెరిగే ఛాన్స్ ఉంది. చాలా ఆచితూచి కథలను ఎంచుకుంటున్న ఈ విలక్షణ నటుడు తెలుగులో దేవర కాకుండా ఇంకే కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. ఏది ఏమైనా ఇలాంటి నటులను వీలైనంత వాడుకోవాల్సిన బాధ్యత దర్శకుల మీద ఉంది. ముక్కు మొహం తెలియని ఆర్టిస్టులయితే ఏదో అనుకోవచ్చు కానీ షైన్ టామ్ చాకో లాంటి వాళ్ళు ఆ విభాగంలోకి రారు కనక డిజైనింగ్ చాలా అవసరం.

This post was last modified on September 28, 2024 10:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది

గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…

17 minutes ago

నిత్యమీనన్ ఆ బయోపిక్ ఎందుకు చేయలేదు?

దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…

42 minutes ago

గౌతమ్ మీనన్ షాకింగ్ కామెంట్స్

తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

2 hours ago

‘షా’ మాట‌లు హుష్‌.. బీజేపీ నేత‌లు మార‌రా?

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా నాలుగు రోజుల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించా రు. విజ‌యవాడ…

2 hours ago

వ‌ల‌సల‌పై ట్రంప్ నిర్ణ‌యం.. అమెరికాకు చేటేనా?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి మాట‌లు చె ప్పినా.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు…

3 hours ago

కొత్త తరం దర్శకులతో చిరంజీవి లైనప్

తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…

4 hours ago