Movie News

బాక్సాఫీస్ దారులన్నీ దేవర వైపే

ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. సోలోగా తమ హీరోని తెరమీద చూసి ఆరేళ్ళు గడిచిపోయిన ఆకలితో ఉన్న అభిమానులకు డబుల్ విందు వడ్డించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తూ దేవరగా థియేటర్లో అడుగు పెట్టాడు. ఊహించిన దాని కన్నా ఎక్కువగా అడ్వాన్స్ బుకింగ్స్ అరాచకం చేయడం చూసి ఎగ్జిబిటర్ల ఆనందం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అర్ధరాత్రి ప్రీమియర్లకు అనుమతులు రావడంతో కనివిని ఎరుగని స్థాయిలో అయిదు వందలకు పైగా మిడ్ నైట్ షోలు పడ్డాయి. ఇది గత దశాబ్ద కాలంలో ఎప్పుడూ చూడని రికార్డు.

ఇక కావాల్సిందల్లా పాజిటివ్ టాక్ రావడమే. ఓవర్సీస్, తెల్లవారుఝామున షోలు చూసిన వాళ్ల నుంచి సూపర్ రిపోర్ట్స్ ఉన్నాయి. పూర్తి స్పష్టత కామన్ పబ్లిక్ ఎలా స్పందిస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. దానికి కొంత సమయం వేచి చూడాలి. హైదరాబాద్ నుంచి అమలాపురం దాకా ప్రతిచోటా ర్యాంపేజ్ మోడ్ లో ఉన్న దేవర సరిపోదా శనివారం తర్వాత డ్రైగా ఉన్న బాక్సాఫీస్ కు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. దసరాకు ఇంకా రెండు వారాల సమయం ఉన్నప్పటికీ ముందస్తు పండగ వాతావరణం టాలీవుడ్ లో కనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఫ్యాన్స్ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.

ఉత్తరాది వైపు బుకింగ్స్ నెమ్మదిగా ఉన్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో ఓటిటి రిలీజ్ సైతం ఆలస్యంగా పెట్టుకున్న దేవర బృందం దానికి తగ్గ ఫలితంగా అందుకోవడం కీలకం. ఆర్ఆర్ఆర్ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తారక్ కు ఈ విజయం చాలా ముఖ్యం. ముంబై ప్రెస్ మీట్లతో మొదలుపెట్టి బియాండ్ ఫెస్ట్ ప్రీమియర్ల దాకా ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ త్వరలో చేయబోతున్న బాలీవుడ్ డెబ్యూకి దేవర బ్లాక్ బస్టర్ బలమైన మెట్టు. రికార్డులు, కలెక్షన్లు ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ప్రేక్షకులు ప్లస్ బాక్సాఫీస్ దారులన్నీ దేవర వైపే వెళ్తున్నాయి.

This post was last modified on September 27, 2024 9:13 am

Share

Recent Posts

ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ…

50 minutes ago

త్రివిక్రమ్ మేజిక్ పని చేసినట్టేనా

ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…

2 hours ago

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

3 hours ago

ఒత్తిడి బండి మీద ‘రణబాలి’ ప్రయాణం

ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…

3 hours ago

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

4 hours ago

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

7 hours ago