ఈ మధ్య ‘దేవర’ ట్రైలర్ రిలీజైనపుడు ఎక్కువగా నెగెటివ్ కామెంట్లే వినిపించాయి. ట్రైలర్ ఏమంత ఎగ్జైటింగ్‌గా లేదని.. సినిమా ‘ఆచార్య-2’లా అనిపిస్తోందని.. ఇంకా రకరకాలుగా కామెంట్లు చేశారు జనాలు. ట్రైలర్ యావరేజ్‌గా ఉండడంతో ఈ ప్రభావం సినిమా మీద పడుతుందేమో.. రిలీజ్ ముంగిట హైప్ తగినంత ఉండదేమో అని విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ అలా అన్నవాళ్లంతా అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూసి షాకవుతున్నారు.
ఎన్టీఆర్ కెరీర్లోనే ఎన్నడూ లేనంత భారీగా సినిమా రిలీజవుతుండగా.. టికెట్ సేల్స్ కూడా ఒక రేంజిలో జరుగుతుండడంతో చిత్ర బృందం ఫుల్ ఖుషీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక యుఎస్‌లో ‘దేవర’ అడ్వాన్స్ బుకింగ్స్‌కు డిమాండ్ మామూలుగా లేదు. ఏపీ, తెలంగాణల్లోని 90 శాతం పైగా థియేటర్లలో ‘దేవర’ను ప్రదర్శించబోతున్నారు. ఊహించని స్థాయిలో షోలు ఇచ్చినా.. వాటిలో చాలా వరకు సోల్డ్ ఔట్ అయిపోయాయి. మిగతావి ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉన్నాయి. యుఎస్‌లో నెల రోజు ముందే టికెట్ సేల్స్ మొదలు కాగా.. ప్రి సేల్స్‌తోనే 2 మిలియన్ డాలర్ల మార్కును దాటేసిందీ చిత్రం.
‘దేవర’ జోరు ఏ స్థాయిలో ఉందంటే.. విడుదల మూడు రోజుల ముందే ఒక పెద్ద మైలురాయిని టచ్ చేసేసింది. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది. రిలీజ్ రోజు రూ.50 కోట్ల వసూళ్లు వచ్చినా ఘనంగా చెప్పుకుంటారు. బాలీవుడ్ సినిమాలకు అది పెద్ద మార్కు. అలాంటిది ఓ తెలుగు సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌తో విడుదలకు మూడు రోజుల ముందే ఈ మార్కును అందుకోవడం చిన్న విషయం కాదు.
ఈ 50 కోట్లలో మేజర్ వాటా రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, యుఎస్ నుంచి వచ్చింది. తమిళనాడు, కేరళ, నార్త్ ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ఊపందుకోలేదు. అక్కడ ముందస్తు బుకింగ్స్ కంటే.. రిలీజ్ రోజు వాకిన్స్ ఎక్కువ ఉంటాయని అంచనా వేస్తున్నారు. ‘దేవర’ అడ్వాన్స్ బుకింగ్స్ ఊపు చూస్తుంటే ఈ సినిమా తొలి రోజు అలవోకగా రూ.100 కోట్ల మార్కును అందుకోవడం పక్కా. తొలి రోజు ఫుల్ రన్ అయ్యేసరికి రూ.130-140 కోట్ల మేర వసూళ్లు వచ్చే అవకాశముంది.
This post was last modified on September 25, 2024 2:57 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…