అందరూ దేవరలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నే చూస్తున్నారు కానీ ఇందులో పెద్ద ఎన్టీఆర్ పక్కన నటించిన మరో అమ్మాయి కూడా అంతే అదృష్టవంతురాలని గుర్తించడం లేదు. తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్న తారక్ కు తల్లిగా నటిస్తున్న ఆర్టిస్టు పేరు శృతి మరాఠి. అలాని జుట్టుకి తెల్లరంగు వేసుకుని వయసు మళ్ళిన దానిగా మాత్రమే కనిపించబోవడం లేదు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కీలకమైన దేవర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో జూనియర్ తో సమానంగా ఈమెకూ ప్రాధాన్యం దక్కిందట. తన జాతి వారి కోసం పోరాడే భర్తకు అండగా నిలబడే క్యారెక్టర్ లో మంచి ఎమోషన్స్ పడ్డాయని టాక్.
రెండో సగంలో మాత్రమే ఈమె లుక్ మారిపోతుంది. దేవర, వర ఇద్దరితోనూ కాంబినేషన్ సీన్లున్న ఆర్టిస్టుల్లో శ్రీకాంత్, సైఫ్ అలీ ఖాన్ తర్వాత శృతి మరాఠి పేరు వినిపిస్తోంది. శృతిది గుజరాతి. పలు హిందీ, మరాఠి సినిమాలు, సిరీస్, సీరియళ్లలో సపోర్టింగ్ రోల్స్ చాలా చేసింది. సౌత్ డెబ్యూ దేవరతో జరుగుతోంది. దర్శకుడు కొరటాల శివ పరిచయం ఉన్న మొహం ఉండకూడదనే ఉద్దేశంతో వెతికి మరీ శృతిని సెట్ చేసుకున్నాడు. పెర్ఫార్మన్స్ పరంగానూ గత చిత్రాలు చూసి అంతా ఓకే అనుకున్నాక ఆడిషన్ కు పిలిచారు. ఇది హిట్ అయితే మాత్రం టాలీవుడ్ అవకాశాలకు లోటు ఉండదని చెప్పొచ్చు.
ఎల్లుండి విడుదల కాబోతున్న దేవర ఫలితం పట్ల శృతి మరాఠి చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. దేవర 2లో కూడా ఉంటుందని సమాచారం. నిర్ధారణగా తెలియదు కానీ పార్ట్ టూకి సంబంధించిన లీక్స్ ఇంకా బయటికి రాలేదు కాబట్టి వేచి చూడాలి. అడ్వాన్స్ బుకింగ్స్ భారీ ఎత్తున జరుగుతున్న దేవర మొదటిరోజే రికార్డుల జాతర మొదలుపెట్టేలా ఉంది. మిడ్ నైట్ ప్రీమియర్ల నుంచి హిట్ టాక్ వస్తే మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. పోటీగా కార్తీ సత్యం సుందరం ఉన్నప్పటికీ అది క్లాస్ డబ్బింగ్ మూవీ కావడంతో మాస్ నుంచి పూర్తి మద్దతు దేవరకు దక్కనుంది. టికెట్ వసూళ్లు దాన్నే స్పష్టం చేస్తున్నాయి.
This post was last modified on September 25, 2024 2:50 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……