ఇంకో మూడు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘దేవర’ సినిమా. గురువారం అర్ధరాత్రి నుంచే షోలు పడనున్న నేపథ్యంలో వాస్తవానికి అంత టైం కూడా లేనట్లే. ఐతే మాంచి హైప్ మధ్య రిలీజవుతున్న ఈ సినిమాలో కథ గురించి.. పాత్రల గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగిపోతున్నాయి. ట్రైలర్ చూడగానే కథ ఇదంటూ రకరకాల థియరీస్ సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి.
సినిమాలో ట్విస్టుల గురించి కూడా సోషల్ మీడియాలో రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. పార్ట్-2 ప్లాట్ పాయింట్ మీద కూడా అంచనాల్లోకి వెళ్లిపోయారు. మరోవైపు ‘దేవర’లో తారక్ చేస్తున్నది డబుల్ రోల్ అని అందరికీ తెలుసు కానీ.. మూడో పాత్ర కూడా ఉందంటూ ఓ ప్రచారం మొదలైంది. దీని గురించి ఊహాగానాలు పెరిగిపోవడంతో ‘దేవర’ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు స్పందించారు. ఈ చిత్రంలో తారక్‌ది ట్రిపుల్ రోల్ కాదని ఆయన తేల్చేశారు.
“దేవర సినిమా మీద సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు షేర్ అవుతున్నాయి. యూట్యూబ్ ఛానెళ్ల గురించి మనకు తెలిసిందే. వాళ్లు ఏది కావాలంటే అది చెప్పగలరు. ఎన్టీఆర్ ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ చేస్తున్నాడని అంటున్నారు. అది నిజం కాదు. ఆయన ద్విపాత్రాభినయం మాత్రమే చేస్తున్నారు. తారక్ తండ్రీ కొడుకుల పాత్రల్లో నటిస్తున్నారా.. అన్నదమ్ములుగానా అనే విషయాన్ని నేను చెప్పను. ఇంకో మూడు రోజుల్లో సినిమా రిలీజయ్యాక మీకే తెలుస్తుంది” అని రత్నవేలు చెప్పారు.
రత్నవేలు ఇంత స్పష్టంగా చెప్పారు కాబట్టి ట్రిపుల్ రోల్ గురించి ఊహాగానాలు కట్టిపెట్టేయొచ్చన్నమాట. ‘దేవర’ సినిమా కోసం తామెంత కష్టపడింది వివరిస్తూ రత్నవేలు ఇటీవలే ఒక పోస్ట్ పెట్టారు. 30 రోజుల పాటు నిద్ర మాని ఈ సినిమాకు కలర్ గ్రేడింగ్ చేసినట్లు వెల్లడించారు. ఎక్కువగా సుకుమార్ సినిమాలకే పని చేసిన రత్నవేలు.. ‘దేవర’ కోసం కొరటాలతో తొలిసారి వర్క్ చేశారు.
This post was last modified on September 24, 2024 6:36 pm
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…