ప్రస్తుతం భారతీయ క్రికెట్ అభిమానులకు అత్యంత ఇష్టమైన విదేశీ క్రికెటర్ ఎవరు అంటే.. మరో మాట లేకుండా డేవిడ్ వార్నర్ పేరు చెప్పేయొచ్చేమో. కేవలం ఆటతో మాత్రమే కాక.. తన చర్యలతోనూ అతను ఇండియన్ ఫ్యాన్స్‌ను కట్టి పడేస్తుంటాడు. భారతీయ సినిమాల్లోని పాటలకు స్టెప్పులేయడం.. మన హీరోలను అనుకరిస్తూ షార్ట్స్, రీల్స్ చేయడం.. ఇలా చాలా పెద్ద కథే ఉంది.
ఈ నేపథ్యంలోనే రాజమౌళితో కలిసి ‘క్రెడ్’ కోసం ఒక యాడ్ కూడా చేశాడు వార్నర్. అది బాగా పేలింది. ఇప్పుడు వార్నర్ ఏకంగా ఇండియన్ సినిమాలో నటించేస్తున్నాడు. ఆ మూవీ తెలుగుదే కావడం విశేషం. నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న ‘రాబిన్ హుడ్’లో వార్నర్ నటిస్తున్నాడన్నది తాజా కబురు. ఇటీవలే ఆస్ట్రేలియాలో ఈ మూవీ కొత్త షెడ్యూల్ మొదలైన సంగతి తెలిసిందే. ఆ షెడ్యూల్లో వార్నర్ కూడా భాగమయ్యాడట.
వార్నర్ ‘పుష్ప’ గెటప్‌లో హల్‌చల్ చేస్తున్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలోకి వచ్చాయి. అవి చూసి వార్నర్ పుష్ప-2 మూవీలో నటిస్తున్నాడా అనే చర్చ జరిగింది. అతను పుష్ప గెటప్ వేసింది ‘పుష్ప-2’ కోసం కాదు.. రాబిన్ హుడ్ కోసం. ఇందులో పుష్పను పోలిన డాన్ తరహా కామెడీ క్యారెక్టర్ ఉందట. ఆ పాత్రను వార్నర్‌ను చేయించారట. వార్నర్‌కు మన అభిమానుల్లో ఉన్న సూపర్ ఫాలోయింగ్ నేపథ్యంలో సరిగ్గా డిజైన్ చేసి ఉంటే ఈ క్యారెక్టర్ బాగా పేలే అవకాశముంది.
ఇండియన్ ఫ్యాన్స్‌లో తెలుగు అభిమానులకు వార్నర్‌తో మరింత కనెక్షన్ ఉంది. అతను ఎక్కువ కాలం ప్రాతినిధ్యం వహించింది తెలుగు ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్‌కు. అతను టిక్ టాక్ వీడియోలు చేసింది కూడా తెలుగు సినిమాల్లోని పాటలు, సన్నివేశాలకే. మరి ‘రాబిన్ హుడ్’కు వార్నర్ క్యామియో ఎంత ప్లస్ అవుతుందో చూడాలి.
This post was last modified on September 23, 2024 7:24 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…