టాలీవుడ్లో చాలామంది హీరోలకు పేర్ల వెనుక ‘ట్యాగ్స్’ ఉన్నాయి. అందులో కొన్ని అభిమానులు ఇచ్చినవి అయితే.. కొన్ని ఆ హీరోలను ఇష్టపడే దర్శకులు, నిర్మాతలు పెట్టినవి. కొందరు హీరోలు సొంతంగా తమకు తాము ట్యాగ్స్ ఇచ్చుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఆ సంగతలా ఉంచితే సాధారణంగా ఒక హీరోకు ఉన్న ట్యాగ్‌ను ఇంకొకరు వాడుకోరు.
సూపర్ స్టార్, పవర్ స్టార్ లాంటి ట్యాగ్స్‌ను వేర్వేరు ఇండస్ట్రీల్లో వేర్వేరు హీరోలకు వాడుతుంటారు కానీ.. ఒకే ఇండస్ట్రీలో ఒక హీరో ట్యాగ్‌ను ఇంకొకరు వాడుకోవడం అరుదు. తండ్రి నుంచి వారసత్వంగా తీసుకున్నవి తప్ప. కానీ ఇప్పుడో యువ కథానాయకుడు.. ఓ సీనియర్ నటుడి బిరుదును తీసి తన పేరు పక్కన పెట్టేసుకున్నాడు. అతనే సందీప్ కిషన్. తన కొత్త చిత్రం ‘మజాకా’ టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఈ రోజే రివీల్ చేశారు. ఇప్పటిదాకా సందీప్‌కు ట్యాగ్ అంటూ ఏమీ లేదు. కానీ ఈ సినిమా పోస్టర్లో మాత్రం ‘పీపుల్స్ స్టార్’ అని వేసేశారు.
టాలీవుడ్లో పీపుల్స్ స్టార్ అనగానే అందరికీ ఆర్.నారాయణమూర్తి గుర్తుకు వస్తారు. పేదల పక్షం వహిస్తూ కమ్యూనిజం నేపథ్యంలో ఒకప్పుడు ఆయన తీసిన ఎర్రసైన్యం, ఒరేయ్ రిక్షా లాంటి చిత్రాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ప్రజల కోసం చిత్తశుద్ధితో సినిమాలు తీసే ఆయనకు అభిమానులు ‘పీపుల్స్ స్టార్’ బిరుదును కట్టబెట్టారు. ఆయన కూడా తన సినిమాల పోస్టర్లు, టైటిల్స్‌లో ఆ ‘ట్యాగ్’ను వాడుకున్నారు. ఐతే నారాయణమూర్తి కొన్నేళ్ల నుంచి సినిమాలు తీయట్లేదు. దాదాపుగా రిటైరైపోయారు. ఐతే ఇప్పుడు సందీప్ ఈ ట్యాగ్‌ను తీసేసుకున్నాడు.
ఐతే నారాయణమూర్తికి ఉన్న ఇమేజ్‌కు, సందీప్‌కు ఉన్న గుర్తింపుకి పొంతన లేదు. నారాయణమూర్తిని పీపుల్స్ స్టార్ అనడంలో అభిమానుల ఉద్దేశం వేరు. కానీ ఎంటర్టైనర్స్ చేసే సందీప్ లాంటి యంగ్ హీరో ఆ ట్యాగ్ పెట్టుకోవడం పట్ల మిశ్రమ స్పందన కనిపిస్తోంది. నారాయణమూర్తి ఫ్యాన్స్ ఈ విషయంలో కచ్చితంగా ఫీలవుతారనడంలో సందేహం లేదు.
This post was last modified on September 23, 2024 7:19 pm
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…
విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్‌కు న్యూజిలాండ్ షాక్…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…
తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…
జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేయడం కలకలం…
సినీ పరిశ్రమను దశాబ్దాల నుంచి పీడిస్తున్న అతి పెద్ద సమస్య.. పైరసీ. గతంలో వీడియో క్యాసెట్లు, సీడీల రూపంలో ఉండే పైరసీ..…