Movie News

విడాకుల వార్తలకు చెక్ పెట్టిన ఉంగరం

ఈ మధ్య ఫిలిం సెలబ్రెటీల విడాకుల వార్తలు చాలా చూస్తున్నాం. గత కొన్నేళ్లలో నాగచైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య.. ఇలా చాలామంది విడిపోయారు. లేటెస్ట్‌గా జయం రవి-ఆర్తి జంట కూడా విడాకులు తీసుకుంటున్న విషయం వెల్లడైంది. ఈ క్రమంలోనే బాలీవుడ్లో సెలబ్రేటెడ్ కపుల్ అయిన అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్ కూడా విడిపోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇటీవల అంబానీ కుటుంబంలో జరిగిన పెళ్లి వేడుకకు భర్తతో కాకుండా విడిగా వచ్చింది ఐశ్వర్య. తన వెంట కూతురు కూడా ఉంది. ఆల్రెడీ అభిషేక్, ఐశ్వర్య మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వస్తున్న టైంలోనే ఐశ్వర్య ఇలా భర్తతో కాకుండా విడిగా ఓ పెద్ద వేడుకకు రావడంతో ఈ ఊహాగానాలు నిజమేనన్న చర్చ జరిగింది. విడాకుల గురించి వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఐతే ఇప్పుడు ఆ వార్తలకు స్వయంగా ఐశ్వర్యనే చెక్ పెట్టింది.

తాజాగా పారిస్ ఫ్యాషన్ వీక్‌కు తన కూతురు ఆరాధ్యతో కలిసి హాజరైంది ఐశ్వర్య. ఈ వేడుకలో ఆమె ధరించిన ఉంగరం అందరి దృష్టినీ ఆకర్షించింది. అది పెళ్లి సమయంలో అభిషేక్ బచ్చన్.. ఐశ్వర్యకు తొడిగింది కావడం విశేషం. ఈ దశలో ఆమె ఈ ఉంగరం వేసుకుందంటే విడాకుల వార్తలకు చెక్ పెట్టడానికే అయి ఉండొచ్చని భావిస్తున్నారు. మరి మధ్యలో అభిషేక్‌తో దూరం దూరంగా ఉన్న సంకేతాలు ఎందుకు ఇచ్చిందో తెలియదు.

కెరీర్ ఆరంభంలో కొన్ని రిలేషన్‌షిప్స్‌తో ఇబ్బంది పడ్డ ఐశ్వర్య.. తర్వాత అభిషేక్‌కు చేరువైంది. వీళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా ఏళ్ల పాటు బచ్చన్ కుటుంబంలో ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించిన ఐశ్వర్య.. ఈ మధ్య మాత్రం భర్తకు దూరంగా ఉంటున్న సంకేతాలు ఇచ్చింది. దీంతో విడాకుల గురించి ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు తన తాజా చర్యతో విడాకుల ప్రచారానికి తెరపడింది.

This post was last modified on September 23, 2024 7:09 pm

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

14 minutes ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

3 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

5 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

10 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

11 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

11 hours ago