గత మూణ్నాలుగేళ్లలో తెలుగులో వచ్చిన రీమేక్ సినిమాల లిస్టు తీస్తే.. వాటిలో మంచి ఫలితాన్ని అందుకున్న చిత్రాలను వేళ్ల మీద కూడా లెక్కపెట్టలేం. మాతృక నుంచి మూల కథను తీసుకుని ఎన్నో మార్పులు చేర్పులు చేసి కొత్త సినిమాలా తీర్చిదిద్దుతాడని పేరున్న హరీష్ శంకర్ సైతం ‘మిస్టర్ బచ్చన్’తో బోల్తా కొట్టాడు. ‘బోళా శంకర్’ సహా దారుణమైన డిజాస్టర్లయిన రీమేక్ సినిమాల లిస్టు చాలా పెద్దదే. ఇందుకు కారణాలేంటన్నది అందరికీ తెలుసు.
ఓటీటీల విప్లవం మొదలయ్యాక అన్ని భాషల చిత్రాలనూ ఆన్ లైన్లో అందరూ చూసేస్తున్నారు. చూసినా చూడకపోయినా కథ రివీల్ అయిపోతోంది. దీంతో రీమేక్ చిత్రాల పట్ల ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ కనిపించడం లేదు. ఉన్నదున్నట్లు తీస్తే జిరాక్స్ అంటున్నారు. మార్పులు చేర్పులు చేస్తే చెడగొట్టారు అంటున్నారు. అందుకే రీమేక్ సినిమాల సక్సెస్ రేట్ బాగా పడిపోతోంది. ఇలాంటి టైంలో బాలీవుడ్ సెన్సేషనల్ మూవీ ‘కిల్’ సౌత్ రీమేక్‌ల గురించి వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
ఆల్రెడీ లారెన్స్ హీరోగా తమిళంలో ‘కిల్’ రీమేక్ మొదలైనట్లు వార్తలొస్తున్నాయి. ఆ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. అది ‘కిల్’ రీమేక్ అనే విషయం ఇంకా కన్ఫమ్ కాలేదు. కానీ లారెన్స్ హీరోగా ‘కిల్’ రీమేక్ అనగానే జనాలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇప్పుడేమో తెలుగులో కొత్తగా ‘కిల్’ రీమేక్ గురించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓ నిర్మాణ సంస్థ ‘కిల్’ రీమేక్ హక్కులు తీసుకుందట. వరుణ్ తేజ్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచన చేస్తున్నారట.
కానీ ‘కిల్’ అనేది కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. ఆ కాన్సెప్ట్ ఏంటన్నది రివీలైతే సినిమా చూడడంలో మజా ఉండదు. పైగా ‘కిల్’ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన నేపథ్యంలో సౌత్ జనాలు కూడా ఓటీటీలో ఎగబడి చూశారు. అలాంటి సినిమాను రీమేక్ చేయడం సరైన ఆలోచన అనిపించుకోదు. కాన్సెప్ట్ తెలిసి.. ఆల్రెడీ చాలామంది చూసేసిన సినిమా పట్ల ఏ ఎగ్జైట్మెంట్ ఉండదు. కాబట్టి రీమేక్ ఆలోచనలు మానుకుంటేనే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on September 22, 2024 5:29 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…