ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్‌లోనే మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటి.. దేవర. ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న కొత్త చిత్రం కావడంతో తెలుగుతో పాటు వేరే భాషల్లోనూ ఈ సినిమాకు బజ్ కనిపిస్తోంది. టాక్ బాగుంటే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చు. ట్రైలర్ కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ అది సినిమా మీదున్న హైప్‌నేమీ తగ్గించేయలేదు.
తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మోత మోగిపోవడం ఖాయం. అలాగే ఓపెనింగ్స్ కూడా ఊహించని స్థాయిలో ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియా వరకు తొలి రోజు, తొలి వీకెండ్ ఓవరాల్ వసూళ్లు ఎలా ఉంటాయో కానీ.. యుఎస్‌లో మాత్రం ముందే ఫిగర్ మీద ఒక అంచనా వచ్చేస్తోంది. తొలి వీకెండ్లోనే ‘దేవర’ 4 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంటుందని అక్కడి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
‘దేవర’ ప్రి సేల్స్‌లోనే ఆల్రెడీ మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. ప్రిమియర్స్‌తోనే ఈ చిత్రం 1.5 మిలియన్ డాలర్లు కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. శుక్ర, శని, ఆదివారాల్లో రోజుకు మిలియన్ చొప్పున కొల్లగొట్టే అవకాశాలు లేకపోలేదు. పాజిటివ్ టాక్ వస్తే.. శనివారం రికార్డు స్థాయిలో వసూళ్లు రావడం ఖాయం.
మల్టీస్టారర్ అయిన తారక్ చివరి సినిమా ‘ఆర్ఆర్ఆర్’కు దీటుగా ఈ చిత్రానికి యుఎస్‌లో ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. ఐమాక్స్ వెర్షన్లో కూడా రిలీజవుతుండడం ‘దేవర’కు యుఎస్‌లో బాగా ప్లస్ అయ్యే అంశం. అక్కడ వచ్చే వీకెండ్ టాప్-10లోనూ ‘దేవర’ నిలిచే సంకేతాలు కనిపిస్తున్నాయి. కావాల్సిందల్లా సినిమాకు పాజిటివ్ టాక్ రావడమే. అదే జరిగితే ‘దేవర’ బాక్సాఫీస్ విధ్వంసానికి ఆకాశమే హద్దు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. తారక్ సరసన జాన్వి కపూర్ నటించిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించాడు.
This post was last modified on September 22, 2024 5:15 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…