ఈ మధ్య ఎక్కువ అంచనాలు, ఆశలు పెట్టుకున్న పెద్ద, మిడ్ రేంజ్ సినిమాల కంటే చిన్న సినిమాలే బాగా ఆడుతున్నాయి. మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. కమిటీ కుర్రాళ్లు, ఆయ్, 35.. ఇలా నెల వ్యవధిలో మూడు చిన్న సినిమాలు మంచి ఫలితాన్నందుకున్నాయి. ఈ కోవలోనే ‘మత్తు వదలరా-2’ సైతం అంచనాలను మించి ఆడేస్తోంది.
హిట్ మూవీ ‘మత్తు వదలరా’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ మూవీ చడీచప్పుడు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంది. విడుదలకు మూడు వారాల ముందే ఈ సినిమాను అనౌన్స్ చేయడం విశేషం. నేరుగా టీజర్‌తో పలకరించిన ఈ సినిమా.. క్రేజీ ప్రమోషన్లతో రిలీజ్ ముంగిట మంచి బజ్ తెచ్చుకుంది. ఐతే సినిమా సూపర్ అనే టాక్ అయితే రాలేదు. కథాకథనాల విషయంలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అందరూ ముక్తకంఠంతో సత్య కామెడీ సూపర్ అని కొనియాడారు.
ఐతే సత్య కామెడీ.. ఇంకొన్ని ప్లస్సులు ప్రేక్షకులను అలరించడానికి సరిపోయాయి. తొలి రోజు నుంచి మంచి ఆక్యుపెన్సీలతో సాగిన ఈ చిత్రం.. రెండో వీకెండ్లో కూడా బలంగా నిలబడింది. శనివారం మల్టీప్లెక్సుల్లో ఈ సినిమాకు ఫుల్స్ పడ్డాయి. ఆదివారం కూడా బాగా ఆడే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ చిత్రం పాతిక కోట్ల గ్రాస్, రూ.12 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ‘మత్తు వదలరా-2’ థియేట్రికల్ హక్కులను రూ.8 కోట్ల మేర అమ్మారు. అంటే ఆల్రెడీ రూ.4 కోట్ల మేర లాభం అన్నమాట. ఆదివారం కూడా మంచి షేర్ వచ్చే అవకాశాలున్నాయి. శుక్రవారం ‘దేవర’ వచ్చే వరకు ‘మత్తు వదలరా’ జోరు కొనసాగుతుంది. ఆ సినిమా వచ్చాక కూడా సెకండ్ ఛాయిస్‌గా ‘మత్తు వదలరా-2’నే ఉంటుంది. ‘దేవర’ ఓవర్ ఫ్లోస్ కూడా ఈ సినిమాకు కలిసొచ్చి తర్వాతి వీకెండ్లో కూడా చెప్పుకోదగ్గ షేర్ వచ్చే అవకాశముంది. మొత్తానికి ఈ చిన్న సినిమా పెట్టుబడి మీద రెట్టింపు ఆదాయం తెచ్చిపెట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకునేలా కనిపిస్తోంది.
This post was last modified on September 22, 2024 10:32 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…