సెప్టెంబర్ 27 విడుదల కాబోతున్న దేవర మీద ఎన్నేసి అంచనాలున్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా అర్ధరాత్రి షోలను ప్లాన్ చేసినట్టుగా వచ్చిన వార్తలు అభిమానుల ఎగ్జైట్ మెంట్ ని అమాంతం పెంచేశాయి. అయితే మిడ్ నైట్ ప్రీమియర్లు వేయాలా వద్దా అనే దాని మీద సస్పెన్స్ ఇంకా కొనసాగుతోందని ఇన్ సైడ్ టాక్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు తమకు ఇవి వద్దని, తెల్లవారుఝామున 4 నుంచి 5 మధ్యలో ఆటలు మొదలుపెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్టు వచ్చిన వార్త ఆసక్తి రేపుతోంది. సెక్యూరిటీ సమస్యలతో పాటు రెగ్యులర్ షోలలో ఒకటి తగ్గించాల్సి వస్తుందనే కారణం వినిపిస్తోంది.
పైగా అంత ముందుగా షో వేయడం వల్ల టాక్ సైతం ప్రభావితం చెందుతుందని పలువురు బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. ఫ్యాన్స్ సంగతి పక్కనపెడితే నిద్రపోయే టైంలో కళ్ళు నులుముకుంటూ చూసే సామాన్య ప్రేక్షకుల నుంచి సినిమా బాగున్నా సరే మిక్స్డ్ టాక్ వచ్చే రిస్క్ ఉందనే ఆలోచిస్తున్నారట. అయితే సీడెడ్ లాంటి ప్రాంతాల్లో మాత్రం అర్ధరాత్రి షోలకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఒక చోట వేసి మరోచోట వేయకపోతే అదో తలనొప్పి. మొత్తానికి తుది నిర్ణయం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి. టీమ్ మాత్రం చాలా ధీమాగా బ్లాక్ బస్టర్ తక్కువ కాదనే నమ్మకంతో ఉంది.
టికెట్ రేట్లకు సంబంధించిన జిఓలు ఇవాళో రేపో వచ్చేస్తాయి. టికెట్ మీద గరిష్టంగా వంద రూపాయల దాకా పెంపు ఉండొచ్చు. అది వారమా లేక పది రోజుల దాకా అమలు చేస్తారా అనేది చూడాలి. మంచి టాక్ వచ్చి దసరా దాకా దేవర నడిస్తే అటుపై అదనంగా వచ్చే సెలవులు పెద్ద ప్లస్ అవుతాయి. ఆ టైంలో కొత్త రిలీజులు ఉన్నప్పటికీ ఈ రేంజ్ ప్యాన్ ఇండియా మూవీస్ లేవు. సో పండగ టైంలో సాధారణ రేట్లకు దేవరను చూసే అవకాశం దక్కుతుంది. ఇవన్నీ ఆలోచించే అక్టోబర్ 10 నుంచి తన డేట్ ని సెప్టెంబర్ 27కి మార్చుకున్న దేవర దానికి తగ్గ ప్రయోజనాన్ని పొందబోతోంది.
This post was last modified on September 21, 2024 10:26 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…