ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు మోస్తున్న పుష్ప 2 ది రూల్ షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు. డిసెంబర్ 6 విడుదల తేదీని వదులుకునే పరిస్థితి లేకపోవడంతో దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ టీమ్ మొత్తాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో రెండు యూనిట్లు, కాకినాడలో ఇంకో బృందం ఏకధాటిగా పని చేస్తున్నాయంటే వర్క్ ఏ రేంజ్ లో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. కీలకమైన ఐటెం సాంగ్ ని అక్టోబర్ లో ప్లాన్ చేశారు. బన్నీతో ఆడిపాడే భామ ఎవరో ఇంకా తేలలేదు. మొదటి భాగంలో సమంతాని మరిపించే బ్యూటీ కోసం వేట జరుగుతూనే ఉంది.
ఇటీవలే ఒక ఈవెంట్ లో నిర్మాత చెప్పినట్టు నవంబర్ మధ్యలోకల్లా ఫస్ట్ కాపీ, వీలైతే సెన్సార్ రెండూ పూర్తి చేసేలా ప్రణాళిక వేసుకున్నారు. కాకపోతే ఒత్తిడి అధికంగా ఉన్న నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ కి సుకుమార్ ఎంత టైం కేటాయిస్తారనేది కీలకం కానుంది. పుష్ప 1 సమయంలోనూ ఇదే సమస్య వచ్చింది. ఆ కారణంగానే రీ రికార్డింగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ కు తగినంత నిడివి దొరకలేదనేది అప్పట్లో వినిపించిన కామెంట్. ఇప్పుడలా జరగకూడదనే అభిమానుల కోరిక. ఆ మధ్య కొంచెం బ్రేక్ తీసుకున్నా ఇప్పుడు మాత్రం బన్నీ నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొంటూనే ఉన్నాడు.
బిజినెస్ పరంగా వెయ్యి కోట్ల టార్గెట్ పెట్టుకున్న పుష్ప 2కి అధిక శాతం ఏరియాలకు డీల్స్ జరిగాయని ఇన్ సైడ్ టాక్. వాటికి సంబంధించిన వివరాలు రావడానికి టైం పడుతుంది కానీ కల్కి 2898 ఏడి రికార్డులను దాటే సత్తా దీనికే ఉందనే నమ్మకం నార్త్ బయ్యర్లలో కనిపిస్తోంది. ఊహించని విధంగా పుష్ప 1 బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కావడం రేంజ్ పెంచేసింది.అందుకే అక్కడి నుంచి మాములు డిమాండ్ లేదు. ప్రమోషన్ల పరంగా ఈసారి ప్రత్యేక శ్రద్ధ తీసుకోబోతున్నారట. ఓ ఇరవై రోజులు దీనికే కేటాయించే ప్లానింగ్ జరుగుతోంది. కీలక ఈవెంట్లకు బన్నీతో పాటు టీమ్ మొత్తం హాజరవుతుంది.
This post was last modified on September 20, 2024 1:51 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…