Movie News

ఫైట్లు పాటలు లేకుంటే ఎలా కార్తీ

ఆవారా, ఖైదీ, నా పేరు శివ లాంటి సూపర్ హిట్లతో తెలుగులో మార్కెట్ ఏర్పరుచుకున్న కార్తీ కొత్త సినిమా సత్యం సుందరం వచ్చే వారం సెప్టెంబర్ 28 విడుదల కానుంది. నిజానికి తమిళ వెర్షన్ తో పాటు దేవర వచ్చే రోజునే రిలీజవ్వాలి కానీ జూనియర్ ఎన్టీఆర్ సునామికి థియేటర్లు దొరక్కపోవడంతో పాటు కార్తీ మూవీని ఎవరూ పట్టించుకోకుండా పోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక రోజు ఆలస్యంగా తీసుకొస్తున్నారు. విజయ్ సేతుపతి – త్రిషల కాంబోలో 96 లాంటి మ్యూజికల్ కల్ట్ క్లాసిక్ ఇచ్చిన ప్రేమ్ కుమార్ దర్శకుడు కావడంతో దీని మీద మంచి అంచనాలే నెలకొన్నాయి.

అయితే అసలు ట్విస్టు వేరే ఉంది. ఇందులో పాటలు, ఫైట్లు గట్రా ఏమి ఉండవు. ఈ విషయాన్ని చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కార్తీనే స్వయంగా చెప్పడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎంత కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ అయినా సరే కార్తీ లాంటి కమర్షియల్ సెలబిలిటీ ఉన్న హీరోలకు మినిమమ్ మాస్ మసాలా ఉండాలి. లేకపోతే అన్ని వర్గాలను మెప్పించలేం. ఖైదీని నిలబెట్టింది వాళ్ళే కదా. కానీ సత్యం సుందరంలో వాటిని ఆశించవద్దని ముందే చెబుతున్నాడు. కానీ అంతకు మించి వినోదం, మంచి సినిమా చూశామనే తృప్తిని ఖచ్చితంగా కలిగిస్తుందని అంటున్నాడు.

ఒకరకంగా చెప్పాలంటే ఇది ప్రయోగమే. అందులోనూ దేవర లాంటి పోటీని ఎదురుగా పెట్టుకుని ఇలాంటి ఎక్స్ పరిమెంట్లతో రావడం బయట మార్కెట్ ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తుంది. పెళ్లి మండపంలో కలుసుకున్న ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక రాత్రి జరిగే ప్రయాణంగా సత్యం సుందరంని తెరకెక్కించారు. శ్రీదివ్య లాంటి ఫిమేల్ క్యారెక్టర్లు ఉన్నప్పటికీ అధిక శాతం కార్తీ, అరవింద్ స్వామిల మధ్యే జరుగుతుంది. అందుకే ప్రమోషన్లు, పోస్టర్లలో వాళ్లనే హైలైట్ చేస్తున్నారు. 96కి బెస్ట్ ఆల్బమ్ ఇచ్చిన గోవింద్ వసంత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సత్యం సుందరంకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు.

This post was last modified on September 20, 2024 12:26 pm

Share

Recent Posts

దర్శకుడి కుటుంబం అంటే ఇలా ఉండాలి

రాజమౌళి సినిమా అంటే.. ఫ్యామిలీ అంతా కలిసి ఎలా కష్టపడతారో.. ఎంతగా ఇన్వాల్వ్ అవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.…

52 minutes ago

10 వేల మందికి ఫుడ్డు పెట్టి ఫొటో ఇచ్చిన నాని

ఈ రోజుల్లో అభిమానులను పట్టించుకుని, వాళ్లను మేనేజ్ చేయకపోతే స్టార్ హీరోల ఇమేజ్ పెరగడం, మార్కెట్ విస్తరించడం కష్టమవుతుంది. స్టార్‌గా…

2 hours ago

పార్టీ పెట్టేశారు ఓకే… అజిత్ రావడమే ఆలస్యం

సినిమా హీరోలు రాజకీయ పార్టీలు పెట్టడం తమిళనాడు లో ఎప్పటి నుంచో చూస్తున్నదే. ఈసారి దానికి భిన్నంగా అభిమానులు పార్టీ…

3 hours ago

పోలీస్ లాజిక్ ఒప్పుకునేలా ఉందంటారా

ఇరుముడి థియేటర్ లో విడుదలైనప్పుడు ఒకలా, ఓటిటిలో వచ్చాక మరోలా డిస్కషన్స్ లో నిలుస్తోంది. ముఖ్యంగా ఒక బ్లాక్ బస్టర్…

3 hours ago

మూడు బ్లాక్ బస్టర్లు… మూడు చరిత్రలు

కేవలం ఒక నెల రోజుల గ్యాప్ లో బాక్సాఫీస్ మూడు విలువైన పాఠాలు నేర్చుకుంది. ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి…

4 hours ago

డిజాస్టర్లు పడుతున్నా వేగం తగ్గట్లేదు

మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ తో పోటీ పడుతూ వేగంగా సినిమాలు చేయడంలో పృథ్విరాజ్ సుకుమారన్ ఎప్పుడూ ముందు వరసలో…

6 hours ago