బిగ్‌బాస్ గత రెండు సీజన్లలో ఆడియన్స్ ఎవరికి సపోర్ట్ చేయాలనేది మొదటి రెండు, మూడు వారాలలోనే తేల్చేసుకున్నారు తేజస్వి అండ్ కో టార్గెట్ చేసిన కౌషల్ మూడో వారం నుంచి క్రౌడ్ ఫేవరెట్‌గా అవతరించాడు. గత సీజన్లో శ్రీముఖి బ్యాలన్స్ తప్పి రాహుల్ సిప్లిగంజ్ని టార్గెట్ చేయడంతో అతను అనూహ్యంగా పుంజుకున్నాడు. మూడవ వారంలో ఎలిమినేట్ అవుతాడని అనుకున్న రాహుల్ ఏకంగా టైటిల్ గెలిచేసుకున్నాడు. ఈ సీజన్లో ఎవరూ ఎవరినీ పర్సనల్ టార్గెట్స్ చేయడం లేదు. అలా అని ఎవరూ కూడా గొప్ప స్ట్రాటజీతో ఆడడం లేదు.
ఒక్కొక్కరూ ఒక్కో విషయంలో వీక్‌గా వుంటూ జనం దృష్టిని ఆకర్షించడంలో విఫలమవుతున్నారు. నాలుగవ వారంలోకి ఎంటరయిన ఈ సీజన్లో ఇంతవరకు పబ్లిక్ సపోర్ట్ పూర్తిగా ఎవరికీ దక్కడం లేదు. మాస్ ఓట్లు గంగవ్వకు పోల్ అవుతున్నాయనేది తెలిసిందే కానీ ఆమెను హౌస్మేట్స్ నామినేట్ చేయడం కూడా మానేసారు. అడపాదడపా తన మార్కు వినోదం పండిస్తోన్న అవ్వ చాలా సమయాలలో ఏమి చేయాలో పాలుపోకుండా నిలబడి చూస్తుండి పోతోంది. గత వారం రోబోల టాస్కులో ఏదో కాస్తయినా పాల్గొన్నది కానీ తాజా కాయిన్స్ టాస్కు తనకి సంబంధం లేదన్నట్టు పక్కకు వుండిపోయింది.
అరియానా, సోహైల్ లాంటి వాళ్లు ఈ షో తమకు చాలా ముఖ్యమనే మెసేజ్‌ని జనాలకు పంపించగలిగారు. కొత్తగా వచ్చిన స్వాతి దీక్షిత్ ఇంకా ఎలాంటి ఇంప్రెషన్ వేయకముందే నామినేషన్స్ లోకి వచ్చేసింది. ఈవారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates