Movie News

స్పిరిట్ కోసం క్రేజీ విలన్ జంట ?

దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఇది ఖచ్చితంగా తనకు పెద్ద బ్రేక్ అవుతుందనే నమ్మకంగా ఉన్నాడు. ఆదిపురుష్ తో మనకు గతంలో పరిచయమైనప్పటికీ దాన్ని అసలు డెబ్యూగానే పరిగణించడం లేదు సైఫ్. ఇదిలా ఉండగా ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందబోయే స్పిరిట్ లో ప్రతినాయకుడిగా సైఫ్ అలీ ఖాన్ ని సంప్రదించినట్టు లేటెస్ట్ గాసిప్. యానిమల్ చివరి ముప్పావు గంటలో బాబీ డియోల్ ని చూపించిన తీరు ఏ స్థాయిలో ప్రశంసలు దక్కించుకుందో చూశాం.

అదే తరహాలో అంతకు మించి అనేలా స్పిరిట్ విలన్ ని డిజైన్ చేశారని ఇన్ సైడ్ టాక్. అంతే కాదు ప్రభాస్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రని కవ్వించేలా వయొలెంట్ భార్యా భర్తల క్యారెక్టర్లు ఉంటాయని, సాధ్యమైతే కరీనా కపూర్ నే సైఫ్ కు జోడిగా తీసుకోవాలని ట్రై చేస్తున్నారట. మహేష్ బాబు అర్జున్ లో ప్రకాష్ రాజ్, సరితా టైపన్న మాట. ప్రస్తుతానికి పుకారు దశలోనే ఉంది కాబట్టి నిర్ధారణగా నిజమా కాదాని చెప్పలేం కానీ ఇటీవలే ఒక సౌత్ ప్యాన్ ఇండియా మూవీకి కరీనా సైన్ చేసిన మాట అయితే వాస్తవం. అది స్పిరిటా లేక మహేష్ బాబు రాజమౌళి సినిమానా అనేది తేలాల్సి ఉంది.

ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజి పనుల మీదున్నాడు. మొదటిది ఏప్రిల్ విడుదలకు రెడీ అవుతుండగా రెండోది వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కల్కి 2, సలార్ 2 ఇంకా టైం పట్టేలా ఉన్నాయి. వీటికన్నా ముందు స్పిరిట్ సెట్స్ పైకి వెళ్తుంది. ప్రొడక్షన్ కోసం సందీప్ వంగా ఏడాదిన్నర టైం అడిగినట్టు తెలిసింది. బడ్జెట్ అయిదు వందల కోట్ల దాకా వెళ్లొచ్చని అంటున్నారు. పోలీస్ స్టోరీనే అయినప్పటికీ యాక్షన్ ఎపిసోడ్స్ భారీ ఎత్తున ఉండబోతున్నాయట. తన మేకింగ్ స్టైల్ తో పాటు కమర్షియల్ అంశాలను సందీప్ కొత్తగా హ్యాండిల్ చేయబోతున్నారని యూనిట్ న్యూస్.

This post was last modified on September 18, 2024 10:20 pm

Share

Recent Posts

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

3 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

3 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

3 hours ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

7 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

7 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

8 hours ago