ఇటీవలి కాలంలో ఓ చిన్న సినిమా బాలీవుడ్లో సంచలనం రేపింది. లక్ష్య అనే కొత్త హీరోను పెట్టి నిఖిల్ నగేష్ భట్ రూపొందించిన ఈ చిత్రం ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ యాక్షన్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. రిలీజ్‌కు పది నెలల ముందే ముందే టొరంటో ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకున్న ఈ మూవీ.. రెండు నెలల కిందటే థియేటర్లలోకి దిగి బ్లాక్ బస్టర్ ఫలితాన్ని అందుకుంది.
ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రానికి అక్కడా మంచి స్పందన వస్తోంది. ఈ మూవీని హాలీవుడ్లో రీమేక్ చేయడానికి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో ఆల్రెడీ ఒప్పందం కుదరడం విశేషం. ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ చిత్ర తమిళ, తెలుగు రీమేక్ ఖరారైందట. రాఘవ లారెన్స్ హీరోగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారన్నది తాజా కబురు. లారెన్స్ 25వ సినిమాగా ‘కిల్’ రీమేక్ తెరకెక్కనుంది.
తెలుగులో ‘రాక్షసుడు’తో పాటు ‘ఖిలాడి’ మూవీని రూపొందించిన రమేష్ వర్మ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. గతంలో ఓ హాలీవుడ్ మూవీని కాపీ కొట్టి ‘రైడ్’ అనే సినిమా తీసి హిట్ కొట్టాడు రమేష్ వర్మ. ఆపై ‘రాక్షసన్’ రీమేక్‌తో మరో విజయాన్నందుకున్నాడు. కానీ ‘ఖిలాడి’ మాత్రం పెద్ద డిజాస్టర్ అయింది. దీని తర్వాత ‘రాక్షసుడు-2’ తీయాల్సింది కానీ.. అది ఆగిపోయింది. ఇప్పుడు లారెన్స్ మూవీ తెరపైకి వచ్చింది.
ఐతే ఇది ‘కిల్’ రీమేక్ అని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాలు మాత్రం ‘కిల్’ రీమేక్ అనే అంటున్నాయి. ఐతే ఇలాంటి సెన్సేషనల్ థ్రిల్లర్ మూవీని లారెన్స్‌తోనా తీయడం అని సోషల్ మీడియాలో ఇప్పటికే వ్యతిరేకత మొదలైంది. ఎలాంటి పాత్రలో అయినా లారెన్స్ చేసే ఓవరాక్షన్ సంగతి చెప్పాల్సిన పని లేదు. అతడికి హార్రర్ కామెడీలైతే ఓకే కానీ.. ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్లకు తనేం సూటవుతాడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీని మీద ఆల్రెడీ సోషల్ మీడియాలో కౌంటర్లు గట్టిగా పడుతున్నాయి.
This post was last modified on September 17, 2024 7:31 pm
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…