Movie News

రావణుడు చేసిన గాయానికి భైర చికిత్స

ఆదిపురుష్ రిలీజైనప్పుడు ఎక్కువ శాతం ట్రోలింగ్ కి గురైన పాత్ర సైఫ్ అలీ ఖాన్ పోషించిన రావణుడు. దర్శకుడు ఓం రౌత్ దాన్ని తీర్చిదిద్దిన విధానం మరీ దారుణంగా ఉండటంతో తీవ్ర విమర్శలు వచ్చి పడ్డాయి. రిలీజ్ రోజే వీటిని గుర్తించిన సైఫ్ ప్రమోషన్లలో కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా చేసినా కనిపించలేదు. షూటింగులు గట్రా లాంటి కారణాలు చెప్పొచ్చు కానీ ప్రాథమికంగా అతనికది నచ్చలేదన్నది వాస్తవం. అందుకే ఆదిపురుష్ మల్టీలాంగ్వేజెస్ లో తీసిన తెలుగు సినిమానే అయినప్పటికీ దేవరనే టాలీవుడ్ డెబ్యూగా చెబుతున్నాడు.

ఇందులో పోషించిన భైర క్యారెక్టర్ లో చాలా డెప్త్ ఉందనే సంగతి ట్రైలర్ లోనే అర్థమైపోయింది. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లను కొరటాల శివ బలంగా డిజైన్ చేసుకోవడంతో జూనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి ప్రాధాన్యం దక్కింది. ఆ కారణంగానే ముంబైలో ట్రైలర్ లాంచ్ తో మొదలుపెట్టి ఇంటర్వ్యూల దాకా ప్రతి చోటా యాక్టివ్ గా కనిపిస్తున్నాడు సైఫ్. టీమ్ కోరుకున్న రీతిలో పబ్లిసిటీలో భాగమయ్యేందుకు పూర్తిగా సహకరిస్తున్నాడు. రెండు భాగాలు కావడంతో నిడివి కూడా ఎక్కువ దొరకనుంది. బయట ప్రచారం జరిగినట్టు కాకుండా సైఫ్ రెండు భాగాల్లో ఉండబోతున్నాడు.

సో రావణుడు చేసిన గాయాన్ని తీర్చే భారం భైర మీద పడింది. తారక్ ద్విపాత్రాభినయానికి అనుగుణంగా సైఫ్ డ్యూయల్ రోల్ చేయకపోయినా రెండు షేడ్స్ లో కనిపిస్తాడని, అదే హైలైట్ గా నిలవబోతోందని అంటున్నారు. కొరటాల సినిమాల్లో మాములుగా విలన్ కన్నా హీరో డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. కానీ దేవరలో మాత్రం సై అంటే సై అనే రీతిలో ఇద్దరి మధ్య క్లాష్ తీర్చిదిద్దినట్టుగా వినికిడి. దేవర నిర్మాణంలో ఉన్నప్పుడే సైఫ్ కు పలు ఆఫర్లు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ ఫలితం వచ్చాక సౌత్ సినిమాలకు సంబంధించిన ఆఫర్లు పరిశీలించే ఆలోచనలో ఉన్నట్టు టాక్.

This post was last modified on September 17, 2024 3:11 pm

Share

Recent Posts

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

49 minutes ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

2 hours ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

3 hours ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

3 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

5 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

8 hours ago