ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలకు తోడు.. అనేకమంది సినీ ప్రముఖులపై తీవ్ర విమర్శలు, ఆరోపణలతో శ్రీరెడ్డి ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. మొదట్లో ఆమె ఏం మాట్లాడినా, ఏ ఆరోపణలు చేసినా జనాలు ఆసక్తిగా విన్నారు కానీ.. ఒక దశ దాటాక మరీ శ్రుతిమించిపోవడం, దారుణమైన మాటలు, చర్యలకు దిగడంతో లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు.
తర్వాత ఆమె హైదరాబాద్ నుంచి చెన్నైకి షిఫ్ట్ అయిపోయి మన జనాలతో డిస్కనెక్ట్ అయిపోయింది. అప్పుడప్పుడూ ఫేస్ బుక్ ద్వారా సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రయత్నం చేసింది కానీ.. దాన్ని పట్టించుకున్నవారు తక్కువే.
కానీ ఇప్పుడు శ్రీరెడ్డి ఒక ముఖ్యమైన విషయం మీద ఫేస్ బుక్‌లో పెట్టిన వీడియో చర్చనీయాంశమైంది. ఆమె మాటలకు మంచి స్పందన కూడా రావడం గమనార్హం. గాన గంధర్వుడు ఎస్పీ బాలు అంత్యక్రియలకు టాలీవుడ్ నుంచి ఎవ్వరూ హాజరు కాకపోవడంపై శ్రీరెడ్డి పెట్టిన వీడియో ఇది. చెన్నైలోనే ఉన్న శ్రీరెడ్డి బాలు అంత్యక్రియలకు హాజరైంది.
ఐతే అక్కడ టాలీవుడ్ నుంచి ఎవరూ కనిపించకపోవడం చాలా బాధ కలిగించిందని, మన సినీ పరిశ్రమను అక్కడి జనాలు చాలా తిట్టుకున్నారని.. ఒక తెలుగు నటిగా తన పరువు పోయిందని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ విషయమై ఆమె టాలీవుడ్ ప్రముఖులను తీవ్ర స్థాయిలో తిట్టిపోసింది.
‘‘బాలు గారి మరణం తర్వాత ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతూ అన్నయ్యా.. వెళ్లిపోయావా? అంటూ దొంగ కన్నీరు కార్చారు తప్ప కడసారి చూపు కోసం రాలేదు. ఆయన వాయిస్ లేనిదే మెగాస్టార్లు టాలీవుడ్‌లో అనేవాళ్ళే లేరు. ఆయన గాత్రంతోనే వాళ్లను స్టార్లను చేశారు. కానీ ఆయన చనిపోతే ఒక్కరూ రాలేదు. ‘మా ’అసోసియేషన్ నుంచి కూడా ఒక్కడూ రాలేదు. రావాలనే ఉద్దేశ్యమే ఉంటే చిరంజీవి లాంటి హీరోలు రాలేరా? ఆ బోడి గుండులు ఫోటోలు తీసుకుంటూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు కానీ బాలు అంత్యక్రియలకు మాత్రం రాలేరా? మీ కొడుకులను, మేనల్లుళ్లను ప్రమోట్ చేయడంలో ఉన్న శ్రద్ద.. ఇంత పెద్ద గాన గంధర్వుడు పోతే వెళ్లడంలో లేదా? ఒక్క నా కొడుకూ రాలేదని తమిళనాడులో టాలీవుడ్‌పై ఉమ్మేస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ల అంత్యక్రియలకు వెళతారు కానీ మీ కెరీర్ నిలబెట్టిన వారిని చివరిచూపు చూడలేరా? షేమ్ షేమ్.. చెన్నైలో నా పరువు పోయింది. నేను బాలు గారి అంత్యక్రియలకు వెళ్ళా కానీ టాలీవుడ్ తరుపున కాదు.. కోలీవుడ్ తరుపున. తెలుగు అమ్మాయిగా గర్వపడుతున్న నేను.. తెలుగు నటిగా చెప్పుకోవడాని సిగ్గుపడుతున్నా’’ అని శ్రీరెడ్డి అంది.
This post was last modified on September 29, 2020 4:08 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…